Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
నోరూరించే కొబ్బరి అటుకుల ఉప్మా: 10 నిమిషాల్లో అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్!
ఇంట్లో కాస్త అటుకులు, పచ్చి కొబ్బరి ఉంటే చాలు.. నిమిషాల్లో అద్భుతమైన రుచితో కొబ్బరి అటుకుల ఉప్మా తయారు చేసుకోవచ్చు. సాధారణంగా ఉప్మా పేరు వింటేనే ఆమడ దూరం పరుగెత్తే వారు కూడా ఈ కొబ్బరి అటుకుల ఉప్మాను లొట్టలేసుకుంటూ తింటారు. అంత అద్భుతంగా ఉంటుంది దీని రుచి.
ముఖ్యంగా ఉదయం పూట హడావిడిగా ఆఫీసులకు వెళ్లే ఉద్యోగస్తులకు, వంట చేయడానికి ఎక్కువ సమయం లేని బ్యాచిలర్స్ కి ఇది పర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్. తక్కువ సమయంలో, చాలా సులభంగా చేసుకునే ఈ వంటకం కడుపుకు హాయిగా ఉండటమే కాకుండా ఎంతో ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. నోరూరించే కొబ్బరి అటుకుల ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావాల్సిన పదార్థాలు
మందపాటి అటుకులు- 250 గ్రాములు
కొబ్బరి నూనె - 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు - 1 టీస్పూన్
మినపప్పు - 1 టీస్పూన్
పచ్చి శనగపప్పు - 1 టీస్పూన్
అల్లం తరుగు - 1 టీస్పూన్
కరివేపాకు - 1 రెమ్మ
ఇంగువ - 2 చిటికెలు
వేయించిన పల్లీలు- 2 టేబుల్ స్పూన్లు
జీడిపప్పు - 6
పచ్చిమిర్చి - 2 (పొడవుగా చీల్చినవి)
ఎండుమిర్చి - 2
పచ్చి కొబ్బరి తురుము - అర కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
కొత్తిమీర - కొద్దిగా
తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో మందపాటి అటుకులను తీసుకుని, రెండు సార్లు శుభ్రమైన నీటిలో కడగాలి. ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసి కేవలం 10 నిమిషాల పాటు నానబెట్టాలి.
-10 నిమిషాల తర్వాత అటుకుల్లో నీరు ఏమాత్రం లేకుండా పూర్తిగా వడకట్టి పక్కన పెట్టుకోవాలి. అప్పుడే ఉప్మా ముద్దగా అవ్వకుండా పొడిపొడిగా వస్తుంది.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, మినపప్పు, పచ్చి శనగపప్పు వేసి దోరగా వేయించాలి.
-తాలింపు గింజలు చిటపటలాడుతున్నప్పుడు సన్నగా తరిగిన అల్లం, కరివేపాకు, రెండు చిటికెల ఇంగువ వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు అందులో వేయించి పెట్టుకున్న పల్లీలు, జీడిపప్పు ముక్కలు వేసి మరో నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ వెంటనే పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి కలుపుకోవాలి.
-మంటను సిమ్ లో పెట్టి, తాజాగా తురుముకున్న పచ్చి కొబ్బరిని పాన్ లో వేయాలి. అందులోనే మీ రుచికి సరిపడా ఉప్పు వేసి తాలింపులో కొబ్బరి తురుము బాగా కలిసేలా కలుపుకోవాలి.
-ఇప్పుడు ముందుగానే నానబెట్టి పక్కన పెట్టుకున్న అటుకులను ఇందులో వేసి తాలింపు అంతా అటుకులకు పట్టేలా నిదానంగా కలపాలి. అటుకులు బాగా వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరను పైన చల్లుకుని స్టవ్ ఆఫ్ చేయాలి.
-అంతే ఎంతో వేడివేడిగా, ఘుమఘుమలాడే కొబ్బరి అటుకుల ఉప్మా రెడీ. ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా లేదా సాయంత్రం స్నాక్ గా కూడా దీనిని లాగించేయవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications