Latest Updates
-
మెతుకు మిగల్చకుండా తినే రుచి..తమిళనాడు స్పెషల్ దిండిగల్ తలపకట్టి చికెన్ బిర్యానీ ఇంట్లోనే చేసుకోండిలా.. -
క్రంచీ, టేస్టీ జీడిపప్పు పకోడి..మస్త్ కిక్కిచ్చే స్నాక్ ఈజీగా చేసుకోండిలా.. -
కరివేపాకు మరమరాలు..మూవీ, వెబ్ సిరీస్ చూస్తూ తినడానికి బెస్ట్ టేస్టీ,హెల్తీ స్నాక్ ! -
డీప్ ఫ్రై లేని హెల్తీ స్నాక్..సూపర్ టేస్టీ సగ్గుబియ్యం పొంగనాలు ఈజీగా ఇంట్లో చేసుకోండిలా.. -
ఈ చిన్న సీక్రెట్ తెలిస్తే..ఇంట్లోనే క్షణాల్లో రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ,సాఫ్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ -
వంకాయ దోసకాయ పచ్చడి..ఏంట టేస్ట్ రా బాబు మైండ్ నుంచి పోవట్లేదు అనాల్సిందే! -
తల్లిదండ్రులూ బీ అలర్ట్..పిల్లలకు సిరప్ వేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి -
భూటాన్ స్పెషల్ ఎగ్ ఏమా దత్షీ..స్వర్గానికి బెత్తెడే దూరం! -
పండుగ రోజే దారుణం..భర్త డోర్ ఓపెన్ చేయగానే ప్రియుడితో సరసాలాడుతూ భార్య..రెండ్ హ్యాండెడ్ గా దొరకడంతో.. -
జలుబు, దగ్గును మాయం చేసే చెట్టినాడ్ ఉల్లిపాయ రసం.. ఈ మసాలాతో చేస్తే టేస్ట్ అదుర్స్!
పంజాబీ స్టైల్ ఉల్లిపాయ చట్నీ..ఘాటు,కమ్మదనం కలగలిసిన రుచి..5 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే
ఎప్పుడూ అదే పప్పు, అదే సాంబార్,అవ కూరలు తిని తిని బోర్ కొట్టేసిందా? మీ భోజనానికి ఏదైనా కొత్తదనం, కాస్త ఘాటుదనం జోడించాలని ఉందా? అయితే పంజాబ్ స్పెషల్ స్పైసీ ఉల్లిపాయ చట్నీ ట్రై చేయండి. భారతీయ వంటకాల్లో పంజాబీ వంటలది ఓ ప్రత్యేక సామ్రాజ్యం. పంజాబీ వంటకాలలోని గొప్పదనం, కమ్మని రుచులు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి. అయితే ఆ అసలైన పంజాబీ భోజనం పచ్చళ్లు, చట్నీలు లేకుండా అసంపూర్ణం. అలాంటి కోవకే చెందింది ఈ స్పైసీ ఉల్లిపాయ చట్నీ.
నిమిషాల్లో తయారయ్యే ఈ చట్నీ..మీ సాధారణ భోజనాన్ని కూడా ఒక పండగ భోజనంగా మార్చేస్తుంది. పచ్చి ఉల్లిపాయ, ఘాటైన అల్లం, కారమైన పచ్చిమిర్చిల కలయికతో తయారయ్యే ఈ చట్నీ, దాని సరళత్వంతోనే మన మనసును దోచేస్తుంది. ఇది కేవలం రుచిని పెంచడమే కాకుండా ఉల్లిపాయ, అల్లంలోని సహజ గుణాల వల్ల జీర్ణక్రియకు కూడా ఎంతో మేలు చేస్తుంది. సాధారణంగా చట్నీల తయారీలో రకరకాల మసాలాలు వాడతాం.. కానీ ఈ ఉల్లిపాయ చట్నీ ప్రత్యేకతే దాని సహజమైన, పచ్చి రుచి. దీనిని వేడివేడి చపాతీలు, మెత్తని పరాఠాలు, ముద్దపప్పు అన్నం లేదా ఏ మాంసాహార వంటకంతోనైనా కలిపి తింటే ఆ అనుభూతే వేరు. పంజాబీ ఉల్లిపాయ చట్నీ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావాల్సిన పదార్థాలు
-పెద్ద ఉల్లిపాయ - 1
-అల్లం - 1 అంగుళం ముక్క
-పచ్చిమిర్చి - 2
-నిమ్మరసం - 1 టేబుల్ స్పూన్
-నూనె - 2 టేబుల్ స్పూన్లు
-జీలకర్ర - 1 టీస్పూన్
-తాజా కొత్తిమీర - చిన్న కట్ట
-ఉప్పు - రుచికి సరిపడా
తయారీ విధానం
-ఈ చట్నీ తయారీ కోసం ముందుగా ఒక మిక్సీ జార్ లో తరిగిన ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చి, శుభ్రం చేసిన కొత్తిమీర వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. ఉల్లిపాయలో ఉండే సహజమైన తేమ సరిపోతుంది కాబట్టి నీళ్లు అస్సలు కలపవద్దు. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి.
-ఇప్పుడు ఒక చిన్న పాన్ లో నూనె వేడిచేయండి.
-నూనె వేడెక్కగానే జీలకర్ర వేసి చిటపటలాడనివ్వండి. జీలకర్ర మాడిపోకుండా దోరగా వేగిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి. ఆ వేడి నూనెలో జీలకర్ర సువాసన అద్భుతంగా వ్యాపిస్తుంది.

-వేడివేడిగా ఉన్న జీలకర్ర-నూనె మిశ్రమాన్ని వెంటనే ఉల్లిపాయ పేస్ట్ పై పోయండి. ఆ వేడికి వచ్చే శబ్దం, సువాసన మీ ఆకలిని రెట్టింపు చేస్తుంది.
-ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, పులుపు కోసం నిమ్మరసం వేసి అన్నీ బాగా కలిపితే చాలు. అంతే ఘుమఘుమలాడే పంజాబీ స్టైల్ ఉల్లిపాయ చట్నీ రెడీ.
-ఈ చట్నీని గాలి చొరబడని డబ్బాలో పెట్టి ఫ్రిజ్ లో ఉంచితే రెండు మూడు రోజుల పాటు తాజాగా ఉంటుంది. ఈ సాధారణ చట్నీ కేవలం ఒక వంటకం కాదు, పంజాబీ సంస్కృతికి, వారి ఆహారశైలికి ప్రతిరూపం.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
