Latest Updates
-
ఫుడ్ ప్యాకెట్లపై కొత్త రూల్స్.. FSSAIకి సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు -
చలికాలంలో ఆరోగ్యాన్నిచ్చే హై ప్రోటీన్ వేరుశెనగ బెల్లం లడ్డు..ఈజీగా చేసుకోండిలా.. -
భారతదేశపు అతి పొడవైన రైలు జర్నీ ఇదే..కాలు కింద పెట్టకుండానే 12 రాష్ట్రాలను చూడొచ్చు! -
చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచే, కీళ్ల నొప్పులు పోగొట్టే మునగాకు డ్రై ఫ్రూట్ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
సొంత జెండా, కరెన్సీ ఉన్నా.. వరల్డ్ మ్యాప్ లో లేని రహస్య దేశాలు ఇవే! -
బరువు తగ్గించే రుచికరమైన ఓట్స్ ఉప్మా.. 10 నిమిషాల్లో రెడీ చేసుకోండిలా.. -
భారతే బెటర్.. అమెరికా పర్యటనపై భారతీయ యువతి షాకింగ్ అనుభవాలు! -
కూర లేకుండానే కడుపునిండా తినేయొచ్చు..రోజూ తినే చపాతీకి బదులు ఇలా క్యారెట్ రోటీ చేసి చూడండి -
చికెన్ కబాబ్ బిర్యానీ..ఇంత రుచికరమైన చికెన్ బిర్యానీ ఎప్పుడూ తిని ఉండరు..ఇంట్లోనే చేసుకోండిలా.. -
మూత్ర విసర్జన చేసిన వెంటనే మళ్లీ టాయిలెట్ కు వెళ్లాల్సి వస్తోందా? అసలు కారణాలు ఇవే!
ఇంటిల్లిపాదీ ఫిదా అయ్యే మినుముల చట్నీ..ఇడ్లీ, దోసెలతోనే కాదు అన్నానికి కూడా పర్ఫెక్ట్!
ప్రతిరోజూ ఉదయం టిఫిన్ గా వేడివేడి ఇడ్లీ, కరకరలాడే దోసెలు తింటున్నారా? వాటికి నంజుకోవడానికి ఎప్పుడూ అదే పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ, సాంబార్ తిని బోర్ కొట్టిందా? అయితే మీ వంటగదిలో ఉన్న మినపపప్పుతో ఓసారి ఈ అద్భుతమైన చట్నీని ప్రయత్నించి చూడండి.
దీని రుచికి మీ కుటుంబ సభ్యులు ఫిదా అవ్వాల్సిందే. వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ చట్నీ కలుపుకుని తిన్నా, చపాతీలతో తీసుకున్నా ఆ మజానే వేరు. ఆరోగ్యకరమైన, రుచికరమైన ఈ మినుముల చట్నీని సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావాలసిన పదార్థాలు
నువ్వుల నూనె - 2 టీస్పూన్లు
మినపపప్పు - 50 గ్రాములు
ఎండుమిరపకాయలు - 5
చింతపండు - చిన్న నిమ్మకాయంత
వెల్లుల్లి - 5 రెబ్బలు
కరివేపాకు - 2 రెమ్మలు
పెద్ద ఉల్లిపాయలు - 2
టమాటాలు - 2
తురిమిన కొబ్బరి - 1 టేబుల్ స్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నీరు - అవసరమైనంత
తాలింపు కోసం:
నువ్వుల నూనె - 2 టీస్పూన్లు
ఆవాలు - అర టీస్పూన్
మినపపప్పు - 1 టీస్పూన్
కరివేపాకు - 1 రెమ్మ
కొత్తిమీర తరుగు - కొద్దిగా
చలికాలంలో ఆరోగ్యాన్నిచ్చే హై ప్రోటీన్ వేరుశెనగ బెల్లం లడ్డు..ఈజీగా చేసుకోండిలా..
తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద ఒక కడాయి లేదా పాన్ పెట్టి, అందులో రెండు టీస్పూన్ల నువ్వుల నూనె వేసి వేడి చేయండి. నూనె కాగిన తర్వాత మినపపప్పు వేసి, మంటను తక్కువగా ఉంచి బంగారు రంగులోకి మారి కమ్మని సువాసన వచ్చే వరకు దోరగా వేయించుకోండి.
-పప్పు చక్కగా వేగిన తర్వాత అందులో ఎండుమిరపకాయలు, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి మరో నిమిషం పాటు చక్కగా వేయించండి.
-ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి, అవి పచ్చి వాసన పోయి లేత గులాబీ రంగులోకి మారే వరకు కలుపుతూ వేయించండి. తర్వాత తరిగిన టమాటా ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి టమాటాలు పూర్తిగా మెత్తబడి గుజ్జులా అయ్యే వరకు మగ్గించండి.
-చివరగా తురిమిన కొబ్బరి వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయండి. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వండి.
-చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ జార్ లో వేసి, కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత చట్నీని ఒక గిన్నెలోకి తీసుకుని, జార్‌లో ఇంకొంచెం నీళ్లు పోసి కడిగి ఆ నీటిని చట్నీలో కలపండి.
-ఇప్పుడు తాలింపు కోసం.. స్టవ్ మీద చిన్న పాన్ పెట్టి, నువ్వుల నూనె వేడి చేయండి. అందులో ఆవాలు, మినపపప్పు వేసి చిటపటలాడాక కరివేపాకు వేసి వేయించండి. ఈ తాలింపును చట్నీలో వేసి, పైనుంచి కొత్తిమీర చల్లి బాగా కలపండి.
-అంతే ఎంతో కమ్మగా, నోరూరించే మినపపప్పు చట్నీ నిమిషాల్లో సిద్ధమైపోయింది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
