Latest Updates
-
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! -
ఎండల తీవ్రత: ఢిల్లీ స్కూళ్లలో 'వాటర్ బెల్'.. మీ పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడుకోవడం ఎలా?
ఎండల్లో ఎనర్జీ కావాలా? అయితే ఒంటికి చలవ చేసే ఈ రాగి పాలు తాగాల్సిందే..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..
మండుతున్న ఎండలు, ఉక్కిరిబిక్కిరి చేసే ఉక్కబోత.. ఈ వేసవి కాలంలో బయట అడుగుపెట్టాలంటేనే భయపడే పరిస్థితి ఉంటుంది. వేడి వాతావరణం కారణంగా శరీరంలోని నీరంతా చెమట రూపంలో బయటకు పోయి, మనం త్వరగా అలసిపోతుంటాం. ఈ క్రమంలో డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండాలంటే శరీరానికి తగినన్ని నీటితో పాటు, చల్లదనాన్ని ఇచ్చే ద్రవ పదార్థాలు తీసుకోవడం చాలా అవసరం. కూల్ డ్రింక్స్ కంటే ఇంట్లో చేసుకునే నేచురల్ డ్రింక్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
అలాంటి ఒక అద్భుతమైన, ఆరోగ్యకరమైన పానీయమే రాగి పాలు. రాగులు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. రాగుల్లో కాల్షియం పుష్కలంగా ఉండి ఎముకలను దృఢంగా మారుస్తుంది, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది,బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. వేసవిలో శరీరంలోని వేడిని లాగేసి, తక్షణమే చల్లదనాన్ని ఇవ్వడంలో రాగులు అద్భుతంగా పనిచేస్తాయి. అలాంటి రాగులతో ఎంతో రుచికరమైన రాగి పాలు ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
రాగి పిండి - 1 కప్పు
బెల్లం -తగినంత
ఉప్పు - చిటికెడు
జీడిపప్పు - గుప్పెడు
నానబెట్టిన బాదం పప్పులు - 10-15
యాలకుల పొడి - అర టీస్పూన్
కాచి చల్లార్చిన పాలు - 1 గ్లాసు
రాగి పాలు తయారీ విధానం
-ముందుగా రాగి పిండిని జల్లెడ పట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులో కొద్దిగా నీళ్లు పోసి, ఎక్కడా ఉండలు లేకుండా మెత్తని పేస్ట్ లాగా కలుపుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి, ఒక పాత్రలో రెండు కప్పుల నీళ్లు పోసి మరిగించాలి. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండి మిశ్రమాన్ని అందులో పోస్తూ.. అడుగు అంటకుండా, ఉండలు కట్టకుండా గరిటెతో నెమ్మదిగా తిప్పుతూ ఉండాలి.
-పిండి బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, ఆ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.
-ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో నానబెట్టిన బాదం పప్పులు (పొట్టు తీసి), జీడిపప్పు, ముందుగా ఉడికించి పెట్టుకున్న రాగి మిశ్రమం వేసి మెత్తగా బ్లెండ్ చేయాలి. ఆ తర్వాత ఇందులో రుచికి సరిపడా బెల్లం, చిటికెడు ఉప్పు, యాలకుల పొడి వేసి మరోసారి మిక్సీ పట్టుకోవాలి.
-చివరగా అందులో ఒక గ్లాసు పాలు పోసి, రెండు సార్లు మిక్సీ తిప్పితే ఎంతో రుచికరమైన, చిక్కటి రాగి పాలు రెడీ అయిపోయినట్లే.
-తయారైన ఈ రాగి పాలను ఒక గ్లాసులోకి తీసుకుని, ఫ్రిజ్ లో పెట్టి చల్లబడిన తర్వాత తాగితే ఆ మజాయే వేరు. ఒకవేళ వెంటనే తాగాలనుకుంటే కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకుని స్వాదించవచ్చు.
-ఇది శరీరాన్ని చల్లబరచడమే కాకుండా రోజంతా ఉత్సాహంగా పనిచేసేలా శరీరానికి కావలసిన శక్తిని ఇస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications




