రాజస్థానీ మలై ప్యాజ్.. రోటీ, చపాతీల్లోకి బెస్ట్ సైడ్ డిష్..ఎలా చేసుకోవాలంటే..

Posted By:

ప్రతిరోజూ ఇంట్లో చపాతీలు చేయడం కామనే.. కానీ చపాతీలోకి సైడ్ డిష్ గా ఎప్పుడూ ఒకే రకమైన కూరలు తిని బోర్ కొడుతోందా? ఎప్పుడూ రొటీన్‌ గా తినే ఆలుగడ్డ, టమాటా కర్రీలకు భిన్నంగా.. నోటికి రుచిగా ఏదైనా కొత్త రకం కర్రీ చేయాలని అనుకుంటున్నారా? అయితే రాజస్థానీ మలై ప్యాజ్ ఓసారి టేస్ట్ చేయాల్సిందే. దీని కమ్మని రుచికి ఇంట్లో వాళ్ళు రోజూ తినేవాటికంటే రెండు చపాతీలు అదనంగా లాగించేస్తారు.

దీని కోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. మీ వంటగదిలో ఉండే కేవలం 4 ఉల్లిపాయలు ఉంటే చాలు. దీని రుచి అచ్చం రెస్టారెంట్ స్టైల్ పనీర్ మసాలాను తలపిస్తుంది. రుచికరమైన ఈ రాజస్థానీ స్పెషల్ మలై ప్యాజ్ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Rajasthani Malai Pyaz Recipe in Telugu The Perfect Easy Side Dish for Roti and Chapati

రాజస్థానీ మలై ప్యాజ్ తయారీకి కావలసిన పదార్థాలు

నూనె - 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
ఉల్లిపాయలు - 4
పచ్చిమిరపకాయలు - 2
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
కాశ్మీరీ కారం - 2 టేబుల్ స్పూన్లు
ధనియాల పొడి - ఒకటిన్నర టేబుల్ స్పూన్లు
ఉప్పు- రుచికి తగినంత
పసుపు - పావు టేబుల్ స్పూన్
ఆమ్ చూర్ పొడి- అర టేబుల్ స్పూన్
ఫ్రెష్ క్రీమ్ లేదా పాల మీగడ - 150 ml
కసూరి మేతి- 2 టేబుల్ స్పూన్లు
కొత్తిమీర - కొద్దిగా

చుక్క నూనె, ఇసుక లేకుండానే రోస్టెడ్ పల్లీలు.. ఎలా చేసుకోవాలంటే

రాజస్థానీ మలై ప్యాజ్ తయారీ విధానం

-ముందుగా స్టవ్ వెలిగించి, ఒక మందపాటి బాండీ పెట్టుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె పోసి వేడి చేయండి. నూనె వేడెక్కాక జీలకర్ర వేసి, అది చిటపటలాడే వరకు వేయించండి.

-ఇప్పుడు అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి లేత బంగారు రంగు వచ్చేవరకు నెమ్మదిగా వేయించండి.

-ఉల్లిపాయలు మగ్గిన తర్వాత, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు దోరగా వేయించండి. ఇప్పుడు మంటను పూర్తిగా సిమ్‌ లో పెట్టి కాశ్మీరీ కారం, ధనియాల పొడి, తగినంత ఉప్పు, పసుపు వేసి అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా మసాలాలన్నీ నూనెలో ఒకట్రెండు నిమిషాలు ఉడకనివ్వాలి.

-ఈ దశలో వంటకానికి అసలైన కమ్మటి రుచినిచ్చే ఫ్రెష్ క్రీమ్ వేసి, మసాలాతో చక్కగా కలిసేలా మిక్స్ చేయండి.

-చివరగా ఆమ్ చూర్ పొడి, చేత్తో కొద్దిగా నలిపిన కసూరి మేతి, కొత్తిమీర చల్లుకుని బాగా కలపండి. మూతపెట్టి సన్నని మంట మీద మరో 2 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయండి.

-అంతే రాజస్థానీ మలై ప్యాజ్ రెడీ.

[ of 5 - Users]
Story first published: Saturday, September 19, 2026, 12:50 [IST]
Desktop Bottom Promotion