Latest Updates
-
వీటిని ఫ్రిజ్లో పెట్టి తింటే క్యాన్సర్ రావడం పక్కా.. పొరపాటున కూడా ఈ పని చేయకండి.! -
అల్లుడిపై ఐదుగురు పిల్లల అత్త వ్యామోహం..కన్న కూతురికే సవతిలా మారి..చివరికి ఏమైందంటే.. -
నల్ల శనగలతో ఇలా చేసుకుని తింటే లెక్కలేనన్ని లాభాలు.. ఫిట్నెస్ ప్రియులకు పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్.! -
ఎన్నడూ లేని విధంగా ప్రధాన గ్రహాల సంచారం, అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి సిరిసంపదల వరాలు.! -
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం!
చుక్క నూనె, ఇసుక లేకుండానే రోస్టెడ్ పల్లీలు.. ఎలా చేసుకోవాలంటే
వీధి చివర బండి మీద, లేదా చిన్న చిన్న ప్యాకెట్లలో దొరికే ఉప్పు వేరుశెనగలు (పల్లీలు) అంటే చాలా మంది ఇష్టపడతారు. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే ఆ ఉప్పదనం, కరకరలాడే రుచి.. అబ్బా, ఆ మజాయే వేరు. సాయంత్రం వేడి వేడి టీ తాగుతూ ఈ పల్లీలు తింటుంటే, ఆ ప్యాకెట్ ఎప్పుడు ఖాళీ అయిపోతుందో కూడా మనకు తెలియదు.
ఇవి రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ఎలాంటి నూనె గానీ, ఇసుక గానీ వాడకుండా, అచ్చం బండి మీద దొరికే రుచితో, ఇంట్లోనే చాలా సులభంగా వీటిని తయారు చేసుకోవచ్చు. అదెలాగో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
పచ్చి వేరుశెనగ గుళ్లు - 1 కప్పు
నీళ్లు - 3 నుండి 4 కప్పులు
ఉప్పు - పావు టీస్పూన్ (నీటిలో వేయడానికి)
ఉప్పు - అర టీస్పూన్ (పల్లీలకు పట్టించడానికి)
సాధారణ ఉప్పు - 1 కప్పు (వేయించడానికి)
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి
తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో 3 లేదా 4 కప్పుల నీళ్లు పోసి బాగా మరిగించండి. నీళ్లు మరుగుతున్నప్పుడు స్టవ్ ఆపేసి, అందులో ఒక కప్పు పచ్చి వేరుశెనగ గుళ్లు, పావు టీస్పూన్ ఉప్పు వేసి గరిటెతో బాగా కలపండి. ఆ గిన్నెపై మూత పెట్టి, సుమారు 10 నిమిషాల పాటు పక్కన పెట్టేయండి. ఇలా చేయడం వల్ల పల్లీలు కొద్దిగా మెత్తబడి ఉప్పును పీల్చుకుంటాయి.
-10 నిమిషాల తర్వాత, ఒక జల్లెడ సహాయంతో పల్లీలలోని నీళ్లన్నీ పూర్తిగా వంపేయండి. పల్లీలలో ఒక్క చుక్క నీరు కూడా లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీలను ఒక పొడి గిన్నెలోకి తీసుకుని, అందులో అర టీస్పూన్ ఉప్పు వేసి బాగా కలపండి. ఉప్పు పల్లీలన్నింటికీ సమానంగా పట్టేలా చూసుకుని, మూతపెట్టి మరో 10 నుండి 15 నిమిషాల పాటు పక్కన ఉంచండి.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టి, అందులో ఒక కప్పు సాధారణ ఉప్పు వేసి మంటను హై ఫ్లేమ్ లో ఉంచి బాగా వేడి చేయండి. ఉప్పు బాగా వేడెక్కిన తర్వాత, మనం పక్కన పెట్టుకున్న పల్లీలను అందులో వేయండి. మంటను హై ఫ్లేమ్ లోనే ఉంచి, 2 నుండి 3 నిమిషాల పాటు గరిటెతో నిరంతరంగా కలుపుతూ ఉండండి. ఉప్పు పల్లీలకు అంటుకుని వాటిని సమానంగా వేయిస్తుంది.
-మూడు నిమిషాల తర్వాత మంటను మీడియం లేదా లో ఫ్లేమ్ కి తగ్గించండి. పల్లీలు దోరగా, కరకరలాడేలా వేగే వరకు నెమ్మదిగా కలుపుతూనే ఉండండి. పల్లీలు వేగాయో లేదో తెలుసుకోవడానికి ఒక పల్లీని తీసుకుని వేలితో నొక్కి చూడండి. పొట్టు సులభంగా ఊడివస్తే అవి పర్ఫెక్ట్ గా వేగినట్లే. ఇప్పుడు స్టవ్ ఆపేసి, ఆ వేడి ఉప్పులోనే పల్లీలను మరో రెండు నిమిషాలు వదిలేయండి.
-చివరగా, ఒక ఇనుప జల్లెడ తీసుకుని వేడి ఉప్పులోంచి పల్లీలను వేరు చేయండి. వీటిని ఒక పళ్లెంలో పోసి పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారే కొద్దీ ఇవి మరింత కరకరలాడుతూ తయారవుతాయి.
-అంతే అచ్చం మార్కెట్లో దొరికేలాంటి ఎంతో రుచికరమైన ఉప్పు పల్లీలు రెడీ. ఇవి పూర్తిగా చల్లారాక గాలి చొరబడని ఒక డబ్బాలో నిల్వ చేసుకుంటే చాలా రోజుల పాటు తాజాగా ఉంటాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
