Latest Updates
-
డైలీ ఐదు చాలు.. వీటిని రాత్రంతా నానబెట్టి తింటే రక్తహీనత బాధే ఉండదు.! -
శుక్ర గోచారం 2026..ఆగష్టు 25 నుంచి ఈ 3 రాశులకు కష్టాలు తప్పవు! -
శ్రావణ మాసం స్పెషల్ మజ్జిగ ఆలు కర్రీ..జన్మ జన్మలు గుర్తిండిపోయే రుచి! -
పాముకాటుకి గురైతే మేల్కొని ఉండాలా.. పొరపాటున కళ్లు మూస్తే ఏం జరుగుతుంది.? -
పిల్లల్లో క్యాన్సర్ తొలి లక్షణాలు..ప్రతి పేరెంట్ తెలుసుకోవాల్సిన నిజాలు.. -
రాఖీ 2026 స్పెషల్: స్వీట్ షాప్ టేస్ట్‌ను తలదన్నేలా ఇంట్లోనే ఈజీగా కొకొనట్ బర్ఫీ.! -
పాతకాలం పద్దతిలో జొన్నల అన్నం..శరీరానికి అపరిమిత బలం..వారానికి 2 సార్లు తిన్నా 100 ఏళ్లు బలంగా బతికేస్తారు! -
ఒకేసారి ఇడ్లీ, రైస్‌లోకి పర్ఫెక్ట్ రెసిపీ.. నోరూరించే ఘాటుతో టిఫిన్ సెంటర్ స్టైల్ టొమాటో చట్నీ.! -
ఆగష్టు 28న చంద్రగ్రహణం.. ఈ రాశుల వారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త.! -
ఒక్కసారి ఈ టర్కిష్ టమాటో ఆనియన్ సలాడ్ రుచి చూస్తే..నాలుక నిద్రలేచి నాట్యమాడతది!
రాఖీ, కృష్ణాష్టమి స్పెషల్..అచ్చు స్వీట్ షాప్ రుచితో ఇంట్లోనే పర్ఫెక్ట్ సోన్ పాప్డీ చేసుకోండిలా..
నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే తియ్యని స్వీట్ సోన్ పాప్డీ అంటే ఇష్టపడని వారుండరు. ఇది తయారు చేయడం కొద్దిగా కష్టమేమో, చాలా ఓపిక కావాలేమో అనిపిస్తుంది. కానీ సరైన పద్ధతిలో చేస్తే అచ్చం స్వీట్ షాపులో దొరికే అంతే అద్భుతమైన రుచితో ఇంట్లోనే దీన్ని తయారు చేసుకోవచ్చు.
ఆగస్టు 28న రక్షాబంధన్, ఆ తర్వాత ఎనిమిది రోజులకు శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగలు రానున్నాయి. ఈ పండుగల వేళ మీ కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు మీ చేతులతో స్వయంగా సోన్ పాప్డీ చేసి తినిపించాలనుకుంటే దీనిని మీ ఇంట్లో ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

మైదా పిండి - 1 కప్పు
శనగ పిండి - 1/3 కప్పు
స్వచ్ఛమైన నెయ్యి - 1 కప్పు.
చక్కెర - 1 కప్పు
నీళ్లు - పావు కప్పు
నిమ్మరసం - 1 టీస్పూన్.
బాదం పప్పులు
రాఖీ 2026 స్పెషల్: మీ చేతులతో సోదరుడి కోసం కుంకుమపువ్వు పిస్తా మిల్క్ కేక్ ఇలా చేయండి!
సోన్ పాప్డీ తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి మందంగా ఉన్న బాండీ పెట్టుకుని మంటను సిమ్ లో ఉంచాలి. అందులో నెయ్యి వేసి వేడి అయ్యాక, మైదా, శనగపిండి వేసి నిదానంగా కలపాలి. పచ్చివాసన పోయి, కమ్మని సువాసన వస్తూ లేత బంగారు రంగులోకి మారేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆపేసి, మిశ్రమాన్ని కొద్దిగా చల్లారనివ్వాలి. ఎలాంటి ఉండలు లేకుండా జల్లెడ పట్టి ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు మరో బాండీ తీసుకుని అందులో చక్కెర, నీళ్లు పోసి ఉడికించాలి. పాకం చిక్కగా, జిగురుగా మారుతున్నప్పుడు అందులో ఒక టీస్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి పళ్ళెంలో కొద్దిగా నెయ్యి రాసి, ఈ వేడి వేడి పాకాన్ని అందులో పోయాలి. పాకం గోరువెచ్చగా, చేత్తో పట్టుకునేంత వేడికి వచ్చే వరకు చల్లారనివ్వాలి.
-అసలైన ఘట్టం ఇక్కడే ఉంది. మీ చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకుని, గోరువెచ్చని పాకాన్ని చేతుల్లోకి తీసుకుని ఒక ముద్దలా చేయండి. ఆ పాకాన్ని నెమ్మదిగా సాగదీస్తూ, మళ్ళీ మడతపెడుతూ ఉండాలి. పాకం అంటుకోకుండా ఉండేందుకు ముందుగా వేయించి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని అప్పుడప్పుడు చల్లుకుంటూ ఉండాలి. ఇలా పాకాన్ని లాగుతూ, మడతపెడుతూ ఉంటే క్రమంగా సన్నని దారాల్లాంటి పోగులు ఏర్పడతాయి.
-నెయ్యి రాసిన చిన్న గిన్నెలు లేదా అచ్చులను తీసుకుని, అడుగున వేయించిన బాదం ముక్కలు చల్లాలి. మనం తయారుచేసుకున్న సోన్ పాప్డీ దారాలను అందులో ఉంచి, చేతితో సున్నితంగా నొక్కాలి. ఆ తర్వాత జాగ్రత్తగా గిన్నెలోంచి బయటకు తీస్తే కమ్మని వాసనతో నోరూరించే సోన్ పాప్డీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications