Latest Updates
-
డెంగ్యూకి బొప్పాయి ఆకు రసం బ్రహ్మాస్త్రమా? ఇది తాగితే ప్లేట్ లెట్స్ పెరుగుతాయా? -
రక్తం పట్టడానికి, ఉక్కు లాంటి ఎముకల కోసం తప్పక తినాల్సిన పాత కాలం నాటి బలమైన స్వీట్.! -
తప్పేం లేదు.. ప్రశాంతంగా బతకాలంటే ఈ ఐదు అబద్ధాలు చెప్పడం నేర్చుకోవాల్సిందే.! -
మీ సోదరుడి రాశి చక్రం ఆధారంగా ఈ రాఖీలు కడితే.. వారి సంతోషానికి ఢోకా ఉండదు.! -
పకోడీలు, బజ్జీలు బోర్ కొట్టాయా? అయితే ఈ కరకరలాడే మునగకాయ స్నాక్ ట్రై చేయండి! -
డిన్నర్, బ్రేక్ ఫాస్ట్ ఏ టైంకి తింటున్నారు? ప్రాణగండం ఉంది జాగ్రత్త! -
సోదరి లేకపోతే ఎవరు రాఖీ కట్టవచ్చు.. రక్షాబంధన్ ఉద్దేశం, నియమాలు తెలుసుకోండి.! -
మై బ్రదర్, మై సూపర్ హీరో..మీ సోదరుడికి రాఖీ విషెస్ చెప్పండిలా -
టేస్టీ అండ్ క్రంచీ స్నాక్ ..కరకరలాడే శనగపిండి మసాలా పల్లీలు ఇలా చేసుకోండి -
తెల్ల ఇడ్లీ కాదు..అసలైన శక్తి ఉన్న నల్ల ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే..
రాఖీ స్పెషల్: నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే కమ్మటి బేసన్ లడ్డూ..చాలా ఈజీగా చేసుకోండిలా
రాఖీ పండుగ సందర్భంగా ఇంట్లో సింపుల్ గా ఏదైనా స్వీట్ ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే బేసన్ లడ్డు మీకు బెస్ట్ ఆప్షన్. బేసన్ లడ్డు తయారుచేసుకోవడం చాలా ఈజీ. రుచి గురించి చెప్పాలంటే..నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది. మధ్య మధ్యలో క్రిస్పీగా తగులుగా చాలా రుచిగా ఉంటాయి. దీని తయారీకి ఎక్కువ పదార్థాలు అవసరం లేదు.
రెగ్యులర్ గా మన వంటగదిలో ఉండే పదార్థాలు చాలు ఈ బేసన్ లడ్డు తయారుచేసుకోడానికి. అచ్చం స్వీట్ షాపు స్టైల్ రుచితో మీ ఇంట్లోనే చాలా ఈజీగా బేసన్ లడ్డు తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

బేసన్ లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు
పుచ్చ గింజలు-2 టేబుల్ స్పూన్లు
నెయ్యి-100 గ్రాములు
శనగపిండి-200 గ్రాములు
చక్కెర-200 గ్రాములు
పకోడీలు, బజ్జీలు బోర్ కొట్టాయా? అయితే ఈ కరకరలాడే మునగకాయ స్నాక్ ట్రై చేయండి!
బేసన్ లడ్డు తయారీ విధానం
-ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ల పుచ్చ గింజలు(watermelon seeds)వేసి లైట్ గా కలర్ మారేవరకు వేయించి తీసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద ఉన్న అదే పాన్ లో నెయ్యి వేసి కొంచెం వేడెక్కిన తర్వాత అందులో శనగపిండి వేసి మంటను అడ్జెస్ట్ చేసుకుంటూ శనగపిండిని కమ్మని వాసన వచ్చేదాకా బాగా వేయించుకోవాలి.
-ఒక ముద్దగా అయినప్పుడు మరో 2 నిమిషాలు వేయించినప్పుడు కలర్ లైట్ గా మారుతుంది. అప్పుడు స్టవ్ ఆపేయండి. మధ్యమధ్యలో గరిటతో మిశ్రమాన్ని అటు ఇటూ కలుపుకుంటూ కొంచెం చల్లారనివ్వండి.
-ఇప్పుడు మిక్సీ గిన్నెలో చక్కెర వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకులుగా ఉండేలా గ్రైండ్ చేసుకోండి.
-ఇప్పుడు శనగపిండి మిశ్రమం గోరువెచ్చగా అయినప్పుడు అందులో కొద్దిగా యాలకల పొడి, గ్రైండ్ చేసిన చక్కెర పొడి వేసి మొత్తం కలిసేలా బాగా చేత్తో కలుపుకోండి. వేయించిన పుచ్చ గింజలు కూడా వేసి బాగా కలుపుకున్నాక కొంచెం కొంచెం మిశ్రమాన్ని చేతుల్లోకి తీసుకొని లడ్డుల్లా చేసుకోండి.
-అంతే టేస్టీ బేసన్ లడ్డు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications