For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రసం రెసిపీ : టమోటా రసం ఎలా తయారుచేయాలి

రసం అనేది సంప్రదాయమైన దక్షిణ భారతీయ వంటకం, ఇది రెగ్యులర్ భోజనంలో భాగంగా తయారుచేస్తారు. రసం అనేది స్పైసి మరియు ఉప్పగా ఉండే సూప్. రసంను అన్నం,వడ మరియు ఇడ్లీలతో కలిపి తింటారు. ఇక్కడ టమోటా రసం ఎలా తయారు చ

Posted By: Lakshmi Perumalla
|

రసం అనేది చాలా కుటుంబాలలో రోజువారీగా తయారుచేసే సాంప్రదాయ దక్షిణ భారతీయ ఆహారంగా చెప్పవచ్చు. రసం ఒక స్పైసి మరియు పుల్లని సూప్. వేడి అన్నంలో కలుపుకొని తింటారు.

టమోటా రసం అనేది టమోటా మరియు భారతీయ మసాలా దినుసులతో కలిపి సుగంధ సూప్ గా తయారుచేస్తారు. దీనిని అందరు తినవచ్చు. సాధారణంగా అనారోగ్యంతో ఉన్న పిల్లలు మరియు పెద్దవారికి రసంతో భోజనం పెడతారు.

ఈ రెసిపీలో పప్పుధాన్యాలు ఏమి ఉండవు. ఏది ఏమైనా రసం చిక్కదనం కోసం ఉడికించిన కందిపప్పును కలపవచ్చు. నిమ్మరసం, మిరియాలు రసం,ఉలవలు రసం వంటి అనేక రకాల రసాలను తయారుచేయవచ్చు. టమోటో రసం అనేది సాధారణంగా తయారుచేస్తారు.

రసం చాలా సులభంగా తయారుచేసే ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన దక్షిణ భారతీయ వంటకం. ఇక్కడ టమోటా రసం ఎలా తయారు చేయాలో వీడియో రెసిపీ ఉంది. అలాగే, రసమును ఎలా తయారుచేయాలో వివరణాత్మక స్టెప్ బై స్టెప్ విధానంలో చూసి అనుసరించండి.

రసం వీడియో రెసిపీ

రసం రెసిపీ | టమోటా రసం ఎలా తయారుచేయాలి | పప్పు ధాన్యాలు లేకుండా రసం |టమోటా రసం రెసిపీ
రసం రెసిపీ | టమోటా రసం ఎలా తయారుచేయాలి | పప్పు ధాన్యాలు లేకుండా రసం |టమోటా రసం రెసిపీ
Prep Time
5 Mins
Cook Time
40M
Total Time
45 Mins

Recipe By: అర్చన.వి

Recipe Type: సైడ్ డిష్

Serves: 2

Ingredients
  • టమోటాలు - 3

    నీరు - 3 కప్పులు

    వెల్లుల్లి (తొక్క తీయకుండా) - 4 రేకలు

    లవంగాలు - 1 స్పూన్

    జీలకర్ర - 2 స్పూన్స్

    ఉప్పు - రుచికి సరిపడా

    చింతపండు - అర నిమ్మకాయ పరిమాణం

    రసం పొడి - 2 టేబుల్ స్పూన్లు

    నూనె - 2 టేబుల్ స్పూన్లు

    ఆవాలు - 1 స్పూన్

    కరివేపాకు - 8-10

    ఇంగువ - చిటికెడు

    కొత్తిమీర ఆకులు (సన్నగా తరిగిన) - ½ కప్పు

    నెయ్యి - 2 స్పూన్స్

How to Prepare
  • 1. టమోటాలు తీసుకోని టమోటా పై భాగంలో కట్ చేయాలి.

    2. టమోటాకు మూడు నిలువు గాట్లు పెట్టాలి.

    3. టమోటాలను హెవీ హీటెడ్ పాన్ లో వేయాలి.

    4. దానిలో నీరు పోసి 15 నిమిషాల పాటు మృదువుగా మారే వరకు ఉడికించాలి.

    5. టమోటాలను బౌల్ లోకి తీసుకోవాలి. పాన్ లో నీటిని తరవాత ఉపయోగించాలి.

    6. టమోటాలను 5 నిమిషాల పాటు చల్లారనివ్వాలి.

    7. టమోటాల తొక్క తీసేసి కొంచెం మాష్ చేసి పక్కన పెట్టాలి.

    8. సనికిలిలో వెల్లుల్లి వేయాలి.

    9. దానిలో ఒక స్పూన్ మిరియాలు మరియు ఒక స్పూన్ జీలకర్ర వేయాలి.

    10. రోకలితో కచ్చా పచ్ఛాగా నూరాలి.

    11. పాన్ లో నీటిని రెండు నిమిషాల పాటు వేడి చేయాలి.

    12. దానిలో టమోటా గుజ్జు మరియు నూరిన వెల్లుల్లి పేస్ట్ వేయాలి.

    13. ఉప్పు మరియు చింతపండు వేసి 8 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించాలి.

    14. రసం పొడి కలపాలి.

    15. రసంను బౌల్ లోకి తీసుకోవాలి.

    16. తాలింపు పాన్ పొయ్యి మీద పెట్టి ఒక స్పూన్ నూనె వేయాలి.

    17. దానిలో ఆవాలు మరియు ఒక స్పూన్ జీలకర్ర వేయాలి.

    18. ఆ తర్వాత ఇంగువ,కరివేపాకు వేయాలి.

    19. బాగా వేగనివ్వాలి.

    20. వేగిన తాలింపును రసంలో పోయాలి.

    21. తరిగిన కొత్తిమీర కలపాలి.

    22. నెయ్యి కలపాలి.

    23. ఒక బౌల్ లోకి రసంను తీసుకోని అన్నంలోకి సర్వ్ చేయాలి.

Instructions
  • 1. మీరు రసం పొడికి బదులు సాంబార్ పొడి ఉపయోగించవచ్చు.
  • 2. రసం చిక్కగా రావటానికి ఉడికించిన పప్పును కలపవచ్చు.
Nutritional Information
  • సర్వింగ్ సైజ్ - 1 కప్పు
  • కేలరీలు - 100 కేలరీలు
  • కొవ్వు - 4 గ్రాములు
  • ప్రోటీన్ - 3 గ్రాములు
  • షుగర్ - 5 గ్రాములు
  • ఫైబర్ - 3 గ్రాములు

స్టెప్ బై స్టెప్ - రసం ఎలా తయారుచేయాలి

1. టమోటాలు తీసుకోని టమోటా పై భాగంలో కట్ చేయాలి.

2. టమోటాకు మూడు నిలువు గాట్లు పెట్టాలి.

3. టమోటాలను హెవీ హీటెడ్ పాన్ లో వేయాలి.

4. దానిలో నీరు పోసి 15 నిమిషాల పాటు మృదువుగా మారే వరకు ఉడికించాలి.

5. టమోటాలను బౌల్ లోకి తీసుకోవాలి. పాన్ లో నీటిని తరవాత ఉపయోగించాలి.

6. టమోటాలను 5 నిమిషాల పాటు చల్లారనివ్వాలి.

7. టమోటాల తొక్క తీసేసి కొంచెం మాష్ చేసి పక్కన పెట్టాలి.

8. సనికిలిలో వెల్లుల్లి వేయాలి.

9. దానిలో ఒక స్పూన్ మిరియాలు మరియు ఒక స్పూన్ జీలకర్ర వేయాలి.

10. రోకలితో కచ్చా పచ్ఛాగా నూరాలి.

11. పాన్ లో నీటిని రెండు నిమిషాల పాటు వేడి చేయాలి.

12. దానిలో టమోటా గుజ్జు మరియు నూరిన వెల్లుల్లి పేస్ట్ వేయాలి.

13. ఉప్పు మరియు చింతపండు వేసి 8 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించాలి.

14. రసం పొడి కలపాలి.

15. రసంను బౌల్ లోకి తీసుకోవాలి.

16. తాలింపు పాన్ పొయ్యి మీద పెట్టి ఒక స్పూన్ నూనె వేయాలి.

17. దానిలో ఆవాలు మరియు ఒక స్పూన్ జీలకర్ర వేయాలి.

18. ఆ తర్వాత ఇంగువ,కరివేపాకు వేయాలి.

19. బాగా వేగనివ్వాలి.

20. వేగిన తాలింపును రసంలో పోయాలి.

21. తరిగిన కొత్తిమీర కలపాలి.

22. నెయ్యి కలపాలి.

23. ఒక బౌల్ లోకి రసంను తీసుకోని అన్నంలోకి సర్వ్ చేయాలి.

[ 4.5 of 5 - 61 Users]
English summary

Rasam Recipe | How To Make Tomato Rasam | Rasam Without Lentils | Tomato Rasam Recipe

Rasam is a traditional South Indian recipe that is prepared as a part of the regular meals. Rasam is a spicy and tangy soup that is served with plain rice, medhu vada and idli as well. Here is a video recipe on how to make tomato rasam. Also, read and follow the step-by-step procedure with images.
Story first published: Saturday, January 20, 2018, 10:45 [IST]
Desktop Bottom Promotion