Latest Updates
-
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
సర్వ రోగాలకు మూలం కడుపే..పేగుల్లో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపే 10 ఫుడ్స్ -
మన పూర్వీకుల ఆరోగ్య రహస్యం గుమ్మడికాయ దప్పళం.. వారానికోసారి తింటే సర్వరోగాలు మాయం.! -
కేవలం 10 నిమిషాల్లో స్వర్గాన్ని చూపించే వెల్లుల్లి కారం ఆమ్లెట్..ఎలా చేసుకోవాలంటే..
పిచ్చెక్కించే పచ్చి మామిడికాయ పచ్చడి.. రుచి నషాళానికి ఎక్కాల్సిందే, ఎలా చేసుకోవాలంటే?
వేసవి వచ్చింది అంటే మార్కెట్లో పచ్చి మామిడికాయలు విరివిగా లభిస్తుంటాయి. మార్కెట్‌లోనే కాకుండా ఊరిలో ఏ చెట్టుపైన చూసినా పచ్చి మామిడి కాయలు దర్శనమిస్తుంటాయి. ఈ నేపథ్యంలో చాలా మంది మామిడికాయతో రకరకాల వంటలు తయారు చేస్తుంటారు. వాటిలో పచ్చి మామిడికాయతో పచ్చడి ఒక ప్రధాన వంటకం. పచ్చి మామిడి కాయలు, పచ్చిమిర్చితో చేసుకునే ఈ పచ్చడి, చాలా రుచికరంగా ఉంటుంది. కానీ పాత రుచులు మాదిరిగా అదే టేస్ట్‌తో చేసుకునే వారి సంఖ్య తగ్గిపోయింది. అందుకే ఈసారి అదే పాత రుచితో అద్భుతమైన పచ్చి మామిడి కాయ పచ్చడి ఎలా చేసుకోవాలి? అనేది తెలుసుకుందాం.
ఈ చట్నీని తయారు చేయడం చాలా సులభం. ఎక్కువ సమయం తీసుకోకుండా కేవలం 5-10 నిమిషాల్లో ఈ పచ్చడిని సిద్ధం చేసుకోవచ్చు. అంతేకాదు, కావాల్సిన పదార్థాలు కూడా తక్కువే, కానీ ఫ్లేవర్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. దీనితో మీ అన్నం ఇంకా రుచికరంగా మారుతుంది. ఇది ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

అవసరమైన పదార్థాలు:
చిన్న మామిడికాయ ముక్కలు - 1 కప్పు
పల్లీలు (వేరుశనగ గుండ్లు) - 2 టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి - 6-7
జీలకర్ర - 1/2 టీస్పూన్
వెల్లుల్లి రెబ్బలు - 6-7
ఉప్పు - రుచికి సరిపడా
పచ్చికొబ్బరి ముక్కలు - 1/4 కప్పు
కొత్తిమీర - ఒక చిన్న కట్ట
గోదారొళ్ల స్పెషల్ పాల ముంజలు.. ఒక్కటి తింటే,ఇంకోటి అడుగుతారు,ఎలా ప్రిపేర్ చేయాలంటే?
తయారీ విధానం:
ముందుగా పాన్ పెట్టి పల్లీలను వేయించి, వాటి పొట్టు తీసి పక్కన పెట్టండి.
ఒక పచ్చి మామిడికాయను శుభ్రంగా కడిగి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక కప్పు పరిమాణంలో పక్కన ఉంచండి.
మిక్సీ జార్‌లో వేయించిన పల్లీలు, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసి బరకగా గ్రైండ్ చేయండి.
తర్వాత, పచ్చికొబ్బరి ముక్కలు, కొత్తిమీర, కొద్దిగా నీళ్లు వేసి కాస్త బరకగా గ్రైండ్ చేయాలి.
చివరగా, మామిడికాయ ముక్కలను జోడించి రుబ్బండి.
ఇప్పుడు, చట్నీ ఒక మిక్సింగ్ బౌల్‌లో తీసుకుని తాలింపు తయారుచేసుకోండి.
తాలింపు కోసం:
నూనె - 3 టేబుల్ స్పూన్లు
ఆవాలు - 1/2 టీ స్పూన్
మినప్పప్పు - 1 టీస్పూన్
పచ్చిశనగపప్పు - 1 టీస్పూన్
ఎండుమిర్చి - 2
జీలకర్ర - 1/2 టీ స్పూన్
ఇంగువ - 1/2 టీ స్పూన్
అల్లం తురుము - 1 టీ స్పూన్
కరివేపాకు - 2 రెబ్బలు
పసుపు - 1/2 టీ స్పూన్
తాలింపు తయారీ విధానం:
స్టౌ మీద పాన్ పెట్టి నూనె వేడి చేయండి.
నూనె వేడి అయ్యాక, ఆవాలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి వేసి వేయించండి.
వేయించిన తరువాత, జీలకర్ర, ఇంగువ, అల్లం తురుము, కరివేపాకు వేసి మరికాసేపు వేయించండి.
చివరగా, పసుపు వేసి తాలింపును ఆఫ్ చేయండి.
తాలింపును చట్నీలో వేసి, బాగా కలిపి టేస్టీ గా చేసుకోండి.
ఈ రుచికరమైన మామిడికాయ కొబ్బరి చట్నీ మీకు కొత్త రుచి అనుభవాన్ని ఇస్తుంది. ఈ చట్నీతో మీ అన్నం, చపాతీ, లేదా ఇతర వంటకాలు మరింత రుచిగా ఉంటాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
