హైదరాబాద్ ఫేమస్ లింగయ్య టిఫిన్ సెంటర్ చట్నీ..ఇంట్లోనే అదే టేస్ట్ తో ఎలా చేసుకోవాలో చూడండి

Posted By:

సాంప్రదాయ వంటకాలకు, ముఖ్యంగా చట్నీలకు, తెలుగు ప్రజల వంట గదిలో ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు వంటలంటే చట్నీలు, పచ్చళ్లు తప్పనిసరి. తెలంగాణలోని పల్లెల్లో ఎన్నో రకాల చట్నీలు, పచ్చళ్లు దొరుకుతాయి. అయితే తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో లింగయ్య టిఫిన్ సెంటర్ లో దొరికే చట్నీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఓ ఇంటర్యూలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ లింగయ్య టిఫిన్ సెంటర్ చట్నీ గురించి ప్రస్తావించిన తర్వాత ఆ హోటల్ కి జనం క్యూ కట్టారు.

ఆ చట్నీ కోసం కిలోమీటర్ల దూరం నుంచి అక్కడికి వెళ్తున్నారు. ఈ చట్నీని ఇడ్లీ, దోస, పూరీ, వడ, ఉప్మా, పొంగల్, వంటి అనేక అల్పాహారాలకు వాడుకోవచ్చు. ఈ చట్నీని మనం ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు. హైదరాబాద్ ఫేమస్ లింగయ్య టిఫిన్ సెంటర్ చట్నీని ఇంట్లోనే అదే టేస్ట్ తో ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

Recreate Lingayya Tiffin Centre s Famous Chutney at Home Recipe in Telugu

తయారీకి కావాల్సిన పదార్థాలు

-పల్లీలు
-ఆయిల్
-చింతపండు రసం
-ఉప్పు
-జీలకర్ర
-ఆవాలు
-మినపగుళ్లు
-ఇంగువ
-కరివేపాకు
-కారం
-వెల్లుల్లి

తయారీ విధానం

-ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 1కప్పు పల్లీలను వేసి తక్కువ మంట మద మంచి రంగు వచ్చేంతవరకు వేయించి ఓ ఫ్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.

-ఇప్పుడు స్టవ్ మీద ఉన్న పాన్ లోనే 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేశాక అందులో 10 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసి 30 సెకన్ల పాటు వేయించాక అందులోనే ముందుగా వేయించిన పల్లీలను కూడా వేసి రెండింటిని కలిపి మరో 30 సెకన్ల పాటు వాటిని వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి.

-పాన్ లో ఉన్న పల్లీలు,వెల్లుల్లిమీదనే ఒకటిన్నర టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల చింతపండు రసం, రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోండి. ఈ మిశ్రమం చల్లారాక దీన్ని మిక్సీ జార్ లో వేసి తగినన్ని నీళ్లు పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకొని ఓ గిన్నెలోకి ఆ చట్నీని తీసుకోండి.

-ఇప్పుడు స్టవ్ మీద ఉన్న అదే పాన్ లో మరో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసి అందులో పావు టీస్పూన్ జీలకర్ర, పావు టీస్పూన్ ఆవాలు, 3 టేబుల్ స్పూన్ల మినపగుళ్లు వేసి లైట్ గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్న తర్వాత అందులో పావు టీస్పూన్ ఇంగువ, 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి కరివేపాకు క్రిస్సీగా అయ్యేదాకా వేయించి స్టవ్ ఆఫ్ చేసేయండి.

-ఈ మిశ్రమం చల్లారిన తర్వాత దానిని మిక్సీ జార్ లో వేసి కోర్స్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని ఈ పౌడర్ ని ముందుగా గ్నైండ్ చేసుకున్న చట్నీలో వేసి కలుపుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే లింగయ్య టిఫిన్ సెంటర్ చట్నీ రెడీ.

[ of 5 - Users]
Story first published: Tuesday, September 23, 2025, 13:14 [IST]
Desktop Bottom Promotion