Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఎర్ర కందిపప్పు మరియు క్యారెట్ సూప్ రెసిపి : స్పైసీ క్యారెట్ మరియు ఎర్ర కంది పప్పు సూప్ రెసిపి
ఆరోగ్యకరమైన,రుచికరమైన మరియు తక్కువ కేలరీలు కలిగిన ఈ సూప్ అన్ని రకాల విందులకు సెట్ అవుతుంది. మీరు భోజన సమయంలో తీసుకుంటే భారీగా భోజనం చేయవలసిన అవసరం లేదు.
సూప్ లో ఉండే పప్పు మీకు కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. ఈ సూప్ లో ఉల్లిపాయలు,క్యారెట్ మరియు వెల్లుల్లి రుచి ఉంటుంది. తేలికపాటి విందుల కోసం ఈ వంటకం బాగుంటుంది. ఈ సూప్ ని తయారుచేయడానికి కేవలం 20 నుంచి 25 నిమిషాల సమయం పడుతుంది. మీకు కేలరీల గురించి పెద్దగా పట్టింపు లేకపోతే సూప్ రుచి పెరగటానికి వెన్న లేదా క్రీమ్ వేసుకోవచ్చు.

Recipe By: పూజ గుప్త
Recipe Type: సూప్
Serves: 2
-
తెల్ల ఉల్లిపాయ - 1 (ముక్కలుగా కోయాలి)
ఆలివ్ నూనె - 2 స్పూన్
వెల్లుల్లి - 3 (ముక్కలుగా కోయాలి)
క్యారెట్లు (డైస్ ఆకారం) - 2
ఎర్ర కందిపప్పు - 1 కప్పు
వెజిటబుల్ స్టాక్ క్యూబ్ - 1
స్ప్రింగ్ పార్స్లీ - 2 స్పూన్స్
రెడ్ రైస్ కందా పోహ్
-
1. కెటిల్ లో ఉల్లిపాయ ముక్కలను వేసి ఉడికించాలి.
2. పాన్ లో నూనె వేసి ఉడికించిన ఉల్లిపాయ ముక్కలను వేసి 2 నిముషాలు వేగించి ఆ తర్వాత వెల్లుల్లి ముక్కలు మరియు క్యారెట్ ముక్కలు వేయాలి.
3. అన్నింటిని బాగా కలిపి వేగించాలి.
4. ఒక లీటర్ నీటిని పోసి వేడి చేయాలి. ఆ నీటిలో వెజిటబుల్ స్టాక్ క్యూబ్ మరియు ఎర్ర కందిపప్పు వేసి మూత పెట్టి 15 నిమిషాల పాటు మీడియం మంట మీద ఉడికించాలి.
5. మంట తొలగించి స్ప్రింగ్ పార్స్లీ వేసి బాగా కలపాలి.
6. తయారైన సూప్ ని బౌల్ లోకి తీసుకోవాలి. ఇష్టం అయితే స్ప్రింగ్ పార్స్లీ ఆకులను జల్లుకోవచ్చు.
- మీరు అదనపు సువాసన కొరకు కొత్తిమీర మరియు జీలకర్ర జోడించవచ్చు. రెడ్ బెల్ పెప్పర్ కూడా కలపవచ్చు.
- సర్వింగ్ సైజ్ - 1 కప్పు
- కేలరీలు - 258 కేలరీలు
- ప్రోటీన్ - 13 గ్రాములు
- కార్బోహైడ్రేట్లు - 37 గ్రాములు
- షుగర్ - 12 గ్రాములు
- ఫైబర్ - 8 గ్రాములు
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications