Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
రిపబ్లిక్ డే స్పెషల్..జాతీయ జెండా రంగులతో జిహ్వకు విందు చేసే తిరంగా పులావ్.. ఈజీగా ఇలా చేసేయండి
దేశవ్యాప్తంగా ఇవాళ రిపబ్లిక్ డే ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ప్రతీ ఏటా జనవరి 26న దేశవ్యాప్తంగా జాతీయ జెండా రెపరెపలాడుతుంటే మన గుండెలు ఉప్పొంగుతాయి. 2026 గణతంత్ర దినోత్సవ వేడుకలను మరింత ప్రత్యేకంగా జరుపుకోవడానికి కేవలం కవాతులు, జెండా వందనాలే కాదు.. మన ఇంటి వంటగదిలోనూ దేశభక్తిని నింపేయొచ్చు.
ఈ రోజున కుటుంబ సభ్యులందరికీ కనులవిందు చేస్తూ, నాలుకకు రుచిని అందించే ఉత్తమ వంటకం త్రివర్ణ పులావ్. సాధారణంగా రంగుల కోసం కృత్రిమ ఫుడ్ కలర్స్ వాడుతుంటారు. కానీ మన జెండాలోని పవిత్రతను, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పాలకూర, టమోటాలను ఉపయోగించి సహజసిద్ధంగా ఈ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
బాస్మతి బియ్యం(సగం ఉడికనవి): 1 కప్పు
నెయ్యి: 1 టేబుల్ స్పూన్
జీలకర్ర: పావు టేబుల్ స్పూన్
అల్లం పేస్ట్: 1 టేబుల్ స్పూన్
టమాటా గుజ్జు: పావు కప్పు
ఎర్ర కారం, పేస్ట్: అర టేబుల్ స్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
బాస్మతి బియ్యం (పూర్తిగా ఉడికినవి): 1 కప్పు
నెయ్యి: 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర: పావు టేబుల్ స్పూన్
అల్లం పేస్ట్: 1 టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి పేస్ట్: 1 టేబుల్ స్పూన్
పాలకూర గుజ్జు: అర కప్పు
ఉప్పు: రుచికి సరిపడా
తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక నాన్ స్టిక్ పాన్ పెట్టుకోండి. అందులో నెయ్యి వేసి వేడెక్కాక జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. ఇప్పుడు అల్లం పేస్ట్, ఎర్ర కారం పేస్ట్, టమాటా ప్యూరీ(మిక్సీలో టమాటోలు వేసి గుజ్జుగా చేసుకోవాలి) వేసి పచ్చి వాసన పోయేలా వేయించాలి.
-టమాటో గుజ్జు పచ్చివాసన పోయిన తర్వాత ఆ మిశ్రమంలో సగం ఉడికించిన బాస్మతి బియ్యం, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. అవసరమైతే కొద్దిగా నీరు చల్లి, మూత పెట్టి బియ్యం పూర్తిగా ఉడికి, మంచి కాషాయ రంగు వచ్చే వరకు సన్నని మంటపై ఉడికించాలి.
-మరో పాన్ తీసుకుని నెయ్యి వేడి చేసి జీలకర్ర వేయాలి. తర్వాత అల్లం పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, పాలకూర గుజ్జు వేసి బాగా వేయించాలి. పాలకూరలోని పచ్చిదనం పోయాక, సగం ఉడికించిన బియ్యం, ఉప్పు వేసి కలపాలి. కొద్దిగా నీరు పోసి మూత పెట్టి అన్నం ఆకుపచ్చ రంగులోకి మారి పొడిపొడిగా అయ్యేంత వరకు ఉడికించాలి.
-సాధారణంగా వండుకున్న వేడి వేడి బాస్మతి అన్నాన్ని సిద్ధంగా ఉంచుకోండి. ఇందులో ఎలాంటి మసాలాలు కలపనవసరం లేదు, స్వచ్ఛమైన తెలుపు రంగులో ఉండాలి.
-ఒక లోతైన గిన్నెను తీసుకోండి. ముందుగా అడుగు భాగంలో టమాటోలు వేసి చేసుకున్న అన్నాన్ని వేసి స్పూన్ తో సమానంగా ఒత్తాలి. దాని పైన తెల్లని అన్నాన్ని వేసి రెండో పొరలా పరచాలి. చివరగా పాలకూరలో చేసిన అన్నాన్ని వేసి సమానంగా చేయాలి.
-ఇప్పుడు ఆ గిన్నెను జాగ్రత్తగా ప్లేట్ మీదకు బోర్లించి మెల్లగా తీసేయండి. అంతే మన జాతీయ జెండా రంగులతో అద్భుతమైన త్రివర్ణ పులావ్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
