చికెన్ చాప్స్ ఇలా చేస్తే..ముక్క కూడా మిగల్చకుండా లాగించేస్తారు..టేస్ట్ కి అడిక్ట్ అయిపోతారు!

Posted By:

నాన్ వెజ్ ప్రియులకు చికెన్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది, నోరూరించేది చిల్లీ చికెన్. అందులోనూ చిల్లీ చికెన్ చాప్స్ అంటే ఆ మజాయే వేరు. జ్యూసీగా ఉండే చికెన్ చాప్స్‌ రుచికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. వీకెండ్ లో కుటుంబ సభ్యులతో కలిసి ఆస్వాదించడానికి లేదా ఏదైనా పార్టీలకు స్టార్టర్‌ గా అందించడానికి ఇది పర్ఫెక్ట్ గా ఉంటుంది. పెద్ద పెద్ద రెస్టారెంట్లలో చెఫ్ లు చేసే స్టైల్ లో గా చిల్లీ చికెన్ చాప్స్ ను మీ ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

చిల్లీ చికెన్ చాప్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు

-బోన్ లెస్ చికెన్
-ఉప్పు
-కారం
-పసుపు
-ధనియాల పొడి
-పచ్చిమిర్చి
-ఉల్లిపాయ
-అల్లంవెల్లుల్లి పేస్ట్
-అల్లం తరుగు
-వెల్లుల్లి తరుగు
-ఆయిల్
-కరివేపాకు
-కొత్తిమీర
-పుదీనా
-పెరుగు
-సోంపు

Restaurant Style Chilli Chicken Chops Recipe in Teliugu Make This Juicy Starter at Home

చిల్లీ చికెన్ చాప్స్ తయారీ విధానం

-ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో అర కేజీ బోన్ లెస్ చికెన్ ముక్కలు వేయండి. అందులోనే ఉప్పు, అర టేబుల్ స్పూన్ కారం, పావు టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేయండి. మొత్తం చికెన్ ముక్కలకు పట్టేలా చేత్తో బాగా కలుపుకోండి. తర్వాత బౌల్ మీద మూత పెట్టి కనీసం 1 గంట సేపు పక్కన పెట్టుకోండి.

-తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టి అందులో 2 రెబ్బల కరివేపాకు వేసి చెమ్మ ఆరేంతవరకు వేయించాలి. పూర్తిగ డ్రై అయ్యాక బాండీలో నుంచి తీసి పక్కన పెట్టుకోండి.

-ఇప్పుడు స్టవ్ మీద ఉన్న అదే బాండీలో గాలికి ఆరబెట్టిన కొంచెం కొత్తిమీర ఆకులు, చిన్న పిడికెడు పుదీనా ఆకులు కూడ వేసి చెమ్మ ఆరిపోయేంతవరకు వేయించి తీసి పక్కన పెట్టుకోండి. సాద్యమైనంతవరకు కొత్తిమీరలో కానీ, పుదీనాలో కానీ కాడలు లేకుండా చూసుకోండి. వేయించిన కొత్తిమీర, పుదీనాని మిక్సీ గిన్నెలో లేదా రోట్లో వేసి మెత్తగా పొడి చేసుకోండి.

-ఇప్పుడు స్టవ్ మీద బాండీలో 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చెయ్యాలి.

-ఆయిల్ వేడెక్కాక అందులో గంటసేపు పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసి పెద్ద మంట మీద వేపితే చికెన్ లోని తేమ త్వరగా వచ్చేస్తుంది, ముక్క మృదువుగా ఉంటుంది.

-చికెన్ ను 7-8 నిమిషాల పాటు అలా వదిలిస్తే అడుగున రోస్ట్ అవడం మొదలవుతుంది. అప్పుడు నెమ్మదిగా గరిటతో ముక్కలను తిరగేసుకొని వేయించుకోవాలి.

చికెన్ 65, చిల్లీ చికెన్ మర్చిపోతారు.. ఈ కేరళ చికెన్ ఫ్రై రుచి చూస్తే!

-చికెన్ 10 నిమిషాల్లో వేగిపోతుంది, మంచిగా రోస్ట్ అవుతుంది అనుకున్న టైంలో స్టవ్ మీద మరో బాండీ పెట్టి అందులో 4-5టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చెయ్యండి. వేడెక్కిన నూనెలో పావు టీస్పూన్ సోంపు వేసి చిట్లనివ్వాలి. తర్వాత అందులో అగ్గిపుల్లల మాదిరిగా సన్నగా తరిగిన అర ఇంచు అల్లం, ఒకటిన్నర టేబుల్ స్పూన్ల వెల్లుల్లి తరుగు, 1 పచ్చిమిర్చి తరుగు వేసి వేయించాక అందులోనే 3 టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ తరుగు వేసి వేయించాలి.

-ఉల్లి ఎర్రబడుతున్న సమయంలో అందులో తగినంత ఉప్పు, అర టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీస్పూన్ వేపిన జీలకర్ర పొడి వేసి కలుపుకోండి. తర్వాత ఇందులో అరకప్పు పెరుగును బాగా చిలికి బాండీలో పోసి కలుపుకోండి.

-ఇప్పుడు రోస్ట్ అయిన చికెన్ ముక్కలను ఈ పెరుగు మిశ్రమంలో వేసి కలుపుకోండి. పెద్ద మంట మీదనే కలుపుతూ ముక్కలకు అంతా పట్టేలా కలుపుకోండి. తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కరివేపాకు పొడిని చికెన్ ముక్కల్లో వేసి మరో 30 సెకన్లు పెద్ద మంట మీద కలిపి తర్వాత స్టవ్ ఆపేయండి.

-అంతే టేస్టీ చిల్లీ చికెన్ చాప్స్ రెడీ. ఇది స్టార్టర్ గా, ఫ్లేవర్డ్ రైస్ తో తింటుంటే అద్భుతంగా ఉంటుంది.

[ of 5 - Users]
Story first published: Sunday, August 9, 2026, 7:09 [IST]
Desktop Bottom Promotion