Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
రోటీ, నాన్ లోకి పర్ఫెక్ట్ జోడి..ఇంట్లోనే దాబా స్టైల్ పాలక్ పనీర్..ఎలా చేసుకోవాలంటే..
చలికాలంలో వేడివేడిగా, కారంగా ఏదైనా తినాలనిపిస్తుంటది. ముఖ్యంగా రాత్రి భోజనంలోకి రోటీ లేదా పరాఠా ఉండి, దాంతో పాటు కమ్మని గ్రేవీ కర్రీ ఉంటే ఆ మజానే వేరు. చలికాలంలో నైట్ డిన్నర్ లోకి ఇది ఒక పర్ఫెక్ట్ వంటకం పాలక్ పనీర్. పాలక్ పనీర్ ను బటర్ నాన్, రోటీ, పుల్కా లేదా జీరా రైస్‌తో వడ్డిస్తే అద్భుతంగా ఉంటుంది.
ఎంతో రుచికరమైన, రెస్టారెంట్ రుచిని మరిపించే ధాబా స్టైల్ పాలక్ పనీర్ ను మన ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. పాలకూరలోని ఆరోగ్యకరమైన గుణాలు, పనీర్ రుచి కలగలిసిన ఈ వంటకం మీ కుటుంబ సభ్యులందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది.

కావలసిన పదార్థాలు
ఉడికించిన పాలకూర - 2 కప్పులు
పనీర్ ముక్కలు - 250 గ్రాములు
సన్నగా తరిగిన ఉల్లిపాయలు - 2
టమోటా ప్యూరీ - అర కప్పు
అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
కసూరి మేథి - 1 టీస్పూన్
ఎర్ర కారం - 1 టీస్పూన్
పసుపు - అర టీస్పూన్
ధనియాల పొడి - అర టీస్పూన్
చాట్ మసాలా - అర టీస్పూన్
గరం మసాలా - తగినంత
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - 2 టేబుల్ స్పూన్లు
ఫ్రెష్ క్రీమ్ - 2 టేబుల్ స్పూన్లు
తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో పనీర్ ముక్కలను తీసుకుని, అందులో కొద్దిగా ధనియాల పొడి, చాట్ మసాలా, చిటికెడు పసుపు, గరం మసాలా వేసి బాగా కలపండి.
-తర్వాత స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుని అందులో నూనె వేసి వేడి చేయండి. నూనె వేడెక్కాక అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించండి. ఒక నిమిషం తర్వాత, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి అవి లేత గోధుమ రంగులోకి వచ్చేవరకు వేయించాలి.
-ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులో టమోటా ప్యూరీ, కారం, పసుపు, ధనియాల పొడి, చాట్ మసాలా, గరం మసాలా,కసూరి మేథి వేయండి. వీటిని కాసేపు వేయించిన తర్వాత మెత్తగా చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్,క్రీమ్ వేసి బాగా కలిపాక అందులో తగినంత ఉప్పును వేయండి. గ్రేవీ మరీ చిక్కగా ఉంటే కొద్దిగా నీళ్లు పోసుకోవచ్చు.
-ఇప్పుడు పాన్ పై మూతపెట్టి, సన్నని మంటపై 5 నుండి 10 నిమిషాల పాటు ఉడికించండి. ఇలా చేయడం వల్ల పాలకూరలోని పచ్చి వాసన పోయి, మసాలాలన్నీ గ్రేవీకి బాగా పడతాయి.
-గ్రేవీ నుండి నూనె పైకి తేలుతున్నప్పుడు ముందుగా మసాలా కలిపి పెట్టుకున్న పనీర్ ముక్కలను ఇందులో వేయండి. ముక్కలు విరిగిపోకుండా నెమ్మదిగా కలిపి మరోసారి మూతపెట్టి 5 నిమిషాల పాటు తక్కువ మంటపై ఉడికించండి. దీనివల్ల పనీర్ ముక్కలు గ్రేవీని పీల్చుకుని జ్యూసీగా తయారవుతాయి.
-పాలక్ పనీర్ చిక్కగా, క్రీమీగా మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. అంతే ఎంతో రుచికరమైన, ఘుమఘుమలాడే ధాబా స్టైల్ పాలక్ పనీర్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
