Latest Updates
-
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్‌తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.!
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే!
ఇంట్లో తరచుగా చపాతీలు, పూరీ లేదా పరోటా వంటివి చేసుకుంటారా? వీటిల్లోకి నంజుకోడానికి రొటీన్ గా చేసుకునే ఆలుగడ్డ మసాలాతో బోర్ కొట్టిందా?
అయితే ఈసారి కాస్త కొత్తగా, శరవణ భవన్ స్టైల్ వెజిటబుల్ వైట్ కుర్మా ట్రై చేయండి. ప్రతి ఒక్కరూ దీని రుచికి ఫిదా అవ్వాల్సిందే. ఈ రుచికరమైన కుర్మా ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

శరవణ భవన్ స్టైల్ వెజ్ వైట్ కుర్మా తయారీకి కావాల్సిన పదార్థాలు
కూరగాయలు: క్యారెట్ - 1, బీన్స్ - 6, బంగాళాదుంప - 1,
క్యాలీఫ్లవర్, పచ్చి బఠానీలు (అన్నీ కలిపి ఒక కప్పు )
పెద్ద ఉల్లిపాయ - 1
టొమాటో - 1
కొత్తిమీర, పుదీనా -గుప్పెడు
నిమ్మరసం - 1 టీస్పూన్
పెరుగు - 1 టీస్పూన్
నూనె - 3 టేబుల్ స్పూన్లు
నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు
బిర్యానీ ఆకు - 1
రాతి పువ్వు- కొద్దిగా
అల్లం వెల్లుల్లి పేస్ట్ - అర టీస్పూన్
కారం, పసుపు, గరం మసాలా - ఒక్కోటి పావు టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
మసాలా పేస్ట్ కోసం:
తురిమిన పచ్చి కొబ్బరి - పావు కప్పు
పచ్చిమిర్చి - 2
గసగసాలు, సోంపు, జీలకర్ర - ఒక్కోటి అర టీస్పూన్ చొప్పున
లవంగాలు - 2
యాలకులు - 1
దాల్చిన చెక్క - చిన్న ముక్క
పుట్నాల పప్పు (వేపిన శెనగపప్పు) - 2 టేబుల్ స్పూన్లు
జీడిపప్పు - 5
శరవణ భవన్ స్టైల్ వెజ్ వైట్ కుర్మా తయారీ విధానం
-ముందుగా క్యారెట్, బీన్స్, ఆలుగడ్డ, క్యాలీఫ్లవర్ వంటి కూరగాయలను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, టొమాటోలను కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి.
-ఇప్పుడు మిక్సీ గిన్నెలో కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, సోంపు, గసగసాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, పుట్నాల పప్పు, జీడిపప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లా రుబ్బి పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద ప్రెజర్ కుక్కర్ పెట్టి అందులో నూనె, నెయ్యి వేసి వేడి చేశాక బిర్యానీ ఆకు, కల్పాసి, జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేలా ఫ్రై చేయాలి. తర్వాత అందులోనే కొత్తిమీర, పుదీనా వేసి బాగా వేయించాలి.
-ఇప్పుడు అందులో పసుపు, కారం, గరం మసాలా, సరిపడా ఉప్పు వేసి నూనె పైకి తేలే వరకు సన్నని మంటపై వేయించాలి. తర్వాత అందులో మిక్సీ పట్టుకున్న కొబ్బరి మసాలా పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేలా ఒక నిమిషం వేయించాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న కూరగాయల ముక్కలు, పచ్చి బఠానీలు వేసి కలపాలి. ఇందులో ఒక స్పూన్ పెరుగు, కొద్దిగా నిమ్మరసం, కుర్మా గ్రేవీకి సరిపడా నీళ్లు పోసి కలపాలి.
-కుక్కర్ మూత పెట్టి, మీడియం మంటపై కేవలం ఒక్క విజిల్ రానివ్వాలి. అంతే వెజిటబుల్ వైట్ కుర్మా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
