Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
శరవణ భవన్ స్టైల్ వైట్ చట్నీ..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..
తెలుగు వారి ఇళ్లలో ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి చాలా ఇళ్లలో రోజువారీగా పల్లీల చట్నీయో లేదా పుట్నాల చట్నీయో చేస్తుంటారు. రోజు అదే రుచిని తిని మీకు బోర్ కొట్టిందా? ఏదైనా కొత్త రుచిని కోరుకుంటున్నారా? అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన శరవణ భవన్ స్టైల్ చట్నీని ఇంట్లో ట్రై చేయండి.
శరవణ భవన్ హోటల్స్ లో దొరికే ఇడ్లీ, దోసెల రుచి ఎంత బాగుంటుందో వాటితో పాటు వడ్డించే ఆ తెల్లటి కొబ్బరి చట్నీ రుచి అంతకంటే అద్భుతంగా ఉంటుంది. మన ఇంట్లో చేసే చట్నీకి, హోటల్ చట్నీకి ప్రధాన తేడా దాని రంగు, క్రీమీ టెక్చర్.

సాధారణంగా మనం చట్నీలో పల్లీలు లేదా పుట్నాలు ఎక్కువగా వాడుతాం. శరవణ భవన్ వారి తెల్లటి చట్నీ సీక్రెట్ వేరే ఉంది.. అదే జీడిపప్పు. ఈ చట్నీలో జీడిపప్పు వాడటం వల్ల దానికి మంచి రుచి, చిక్కదనం, ఆకర్షణీయమైన తెల్లటి రంగు వస్తుంది. మీ ఇంట్లో అందరినీ ఆకట్టుకునేలా ఈ స్పెషల్ చట్నీని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
తాజా కొబ్బరి తురుము - అర కప్పు
పచ్చిమిర్చి - 1-2
జీడిపప్పు - 4 పలుకులు
చింతపండు - చిన్న చిటికెడు
ఉప్పు - రుచికి సరిపడా
నీరు - తగినంత
తాలింపు కోసం:
నూనె - 1 టేబుల్ స్పూన్
ఆవాలు - పావు టీస్పూన్
మినపప్పు - పావు టీస్పూన్
శనగపప్పు - పావు టీస్పూన్
ఎండుమిర్చి - 1
కరివేపాకు - ఒక రెమ్మ
తయారీ విధానం
-ఒక మిక్సీ జార్ లో తాజా కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, ఉప్పు, జీడిపప్పులను వేయండి. ముందుగా నీళ్లు పోయకుండా ఒకసారి మిక్సీ పట్టండి. తర్వాత అందులో కొద్దిగా చింతపండు, తగినంత నీళ్లు పోసి మెత్తగా పేస్ట్ లా రుబ్బుకోవాలి. కాస్త చిక్కగా ఉండేలా చూసుకోండి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక చిన్న కడాయి పెట్టి నూనె వేయండి. నూనె వేడెక్కాక ఆవాలు వేయండి, అవి చిటపటలాడాక మినపప్పు, శనగపప్పు వేసి దోరగా వేయించాలి. పప్పులు బంగారు రంగులోకి మారాక, ఎండుమిర్చి తుంచి వేయండి. చివరగా కరివేపాకు వేసి స్టవ్ ఆపేయండి.
-వేడివేడి తాలింపును గిన్నెలో ఉన్న చట్నీపై వేసి బాగా కలపండి. అంతే ఘుమఘుమలాడే శరవణ భవన్ స్టైల్ వైట్ కోకోనట్ చట్నీ రెడీ.
-ఈ చట్నీని వేడి వేడి ఇడ్లీ, దోసె లేదా పొంగల్ తో వడ్డిస్తే మీ ఇంట్లో వాళ్ళు లొట్టలేసుకుంటూ తింటారు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications