Latest Updates
-
పొట్ట కొవ్వును కొవ్వొత్తిలా కరిగించే డ్రింక్స్ ఇవే! -
పక్క రాష్ట్రంలో భర్త జాబ్..మరిది ప్రైవేట్ పార్ట్ కొరికిన వదిన..55 కుట్లు పడ్డాయ్ -
ఫైబర్ ఎక్కువ, ఆయిల్ తక్కువ.. కడుపుకు హాయినిచ్చే చౌ చౌ క్యారెట్ కూటు..చపాతీ,పూరీల్లోకి కిర్రాక్ టేస్ట్ -
సెర్బియా ఎన్నికల్లో జెన్ జీ సంచలనం..విద్యార్థుల ఆందోళన దెబ్బకి కుప్పకూలిన ప్రభుత్వం.. -
మాంసాహారాన్ని మించే రుచితో స్పైసీ సోయా చుక్కా..రైస్, చపాతీ, దోశలోకి బెస్ట్ సైడ్ డిష్ -
మీకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముప్పు ఉందో లేదో..ఇలా తెలుసుకోండి -
జస్ట్ 5 నిమిషాల్లో టేస్టీ ఎగ్ పరోటా..ఈజీగా చేసుకోండిలా -
ఇట్ట తయారయ్యారేందే: ప్రియుడితో సుఖం కావాలని భర్తను దారుణంగా.. -
ప్రేమించిన పాపానికి ఇంత ఘోరమా? తండ్రీకొడుకులను నగ్నంగా నడిపించిన యువతి కుటుంబం! -
పంజాబీ జీరా ఆలూ ఫ్రై.. అన్నం, పూరీ, చపాతీల్లోకి అదిరిపోయే సైడ్ డిష్!
Happy Atla Tadde 2026: బంధుమిత్రులకు, పెళ్లి కాని అమ్మాయిలకు అట్లతద్ది విషెస్, స్టేటస్ లు
తెలుగు పంచాగం ప్రకారం ప్రతి ఏటా అశ్వయుజ మాసంలోని కృష్ణ పక్షం తదియ రోజున అట్లతద్ది పండుగ జరుపుకుంటారు. ఈ ఏడాది అక్టోబర్ 28 బుధవారం నాడు అట్లతద్ది జరుపుకుంటున్నాం. ఈ రోజున తెలుగు రాష్ట్రాల్లోని ఆడవాళ్లు దీనిని పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటారు. పెళ్లి కాని అమ్మాయిలు మంచి భర్త రావాలని, పెళ్లైనోళ్లు..భర్త ఆయురారోగ్యాలతో, దీర్ఘాయుష్షుతో కలకాలం వర్థిల్లాలని, దాంపత్యం అన్యోన్యంగా సాగాలని గౌరీదేవిని పూజించి ఉపవాసం ఉంటారు.
అట్టతద్ది రోజున పొద్దున్నే లేచి పది రకాల చద్ది అన్నం తినడం, గోరింటాకు పెట్టుకోవడం, ఊయల ఊగడం, ఆటపాటలతో గడుపుతారు, కొన్ని ఊర్లలో ఉట్టి కొట్టే కార్యక్రమం కూడా జరుగుతుంది. సాయంత్రం శివపార్వతులను పూజించి, చంద్ర దర్శనం చేసుకున్న తర్వాత 11 అట్లను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి, ముత్తయిదువులకు వాయనంగా ఇస్తారు. అట్లతద్ది సందర్భంగా బంధుమిత్రులు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు తెలుగులో ఎలా చెప్పాలో, వాట్సాప్ స్టేటస్ లో ఎలా విషెస్ చేస్తూ పెట్టాలో ఇక్కడ చూడండి.

కుటుంబ సభ్యులకు, ఫ్రెండ్స్ కు ఇలా
-మీకు, మీ కుటుంబ సభ్యులకు అట్లతద్ది శుభాకాంక్షలు. గౌరీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటున్నాను.
-పండుగ వెలుగులు మీ ఇంట్లో సిరులు కురిపించాలి. అందరికీ అట్లతద్ది పండుగ శుభాకాంక్షలు.
-పసుపు కుంకుమలు, సంతోషాలతో మీ జీవితం కలకాలం వర్ధిల్లాలి. హ్యాపీ అట్లతద్ది.
-మీ మాంగల్య బలం ఆయురారోగ్యాలతో పదిలంగా ఉండాలని కోరుకుంటూ అట్లతద్ది శుభాకాంక్షలు.
-మీ దాంపత్యం కలకాలం చిరునవ్వులతో నిండి ఉండాలని ఆశిస్తూ, హ్యాపీ అట్లతద్ది.
-శివపార్వతుల అనుగ్రహం మీ కుటుంబంపై ఎప్పటికీ ఉండాలి. హ్యాపీ అట్లతద్ది.
-ఈ అట్లతద్ది మీకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు, ఆనందాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను.
-అట్లతద్ది పర్వదినం మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు.
భార్యాభర్తల ప్రేమను తెలిపే కోట్స్
-నా ప్రాణానికి ప్రాణమైన నా భర్త ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ.. అట్లతద్ది శుభాకాంక్షలు.
-నీ ప్రేమే నా బలం, నీ నవ్వే నా ప్రాణం. నీతో నా ఈ ఏడు అడుగుల బంధం ఏడేడు జన్మలు సాగాలి.
-నా నుదుటి కుంకుమకు నిలువెత్తు సాక్ష్యం నువ్వు. నా ప్రతి ప్రార్థనలోనూ నీ క్షేమమే కోరుకుంటాను. హ్యాపీ అట్లతద్ది.
-ఎన్ని జన్మలైనా నీకే భార్యగా ఉండాలని, గౌరీదేవి దీవెనలతో మన బంధం పదిలంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.
-నా చేతి గోరింటాకు ఎరుపులో నీపై నాకున్న ప్రేమ దాగి ఉంది. అట్లతద్ది శుభాకాంక్షలు.
-నా కంఠాన ఉన్న తాళిబొట్టు కలకాలం పదిలంగా ఉండాలని ఆ గౌరీమాతను ప్రార్థిస్తూ... అట్లతద్ది శుభాకాంక్షలు.
వాట్సాప్, ఫేస్ బుక్ స్టేటస్ లు
-అందరికీ అట్లతద్ది శుభాకాంక్షలు..గౌరీ మాత కరుణ అందరిపై ఉండాలి.
-సౌభాగ్యానికి ప్రతీక, అనుబంధానికి వేదిక ఈ పవిత్ర అట్లతద్ది పండుగ.
-స్త్రీల ముత్తైదువతనాన్ని కాపాడే గౌరీదేవికి శతకోటి ప్రణామాలు.
-చంద్రుని చల్లదనం, గౌరీదేవి చల్లని దీవెనలు మీ జీవితంలో నిండాలని కోరుకుంటూ అట్లతద్ది శుభాకాంక్షలు.
-ఉపవాసం ఉండి, అమ్మవారిని పూజించే ప్రతి ఆడపడుచుకూ అట్లతద్ది శుభాకాంక్షలు.
-చద్ది అన్నం మధురంగా, ఉయ్యాల ఆటలు ఉత్సాహంగా... పండుగ పూట అందరికీ శుభాకాంక్షలు.
-ఆడపడుచులందరికీ అట్లతద్ది పండుగ శుభాకాంక్షలు. మీ కోరికలన్నీ నెరవేరాలి.
పెళ్లికాని యువతులకు ప్రత్యేక విషెస్
-మనసుకి నచ్చిన, నిన్ను అర్థం చేసుకునే మంచి భర్త రావాలని ఆకాంక్షిస్తూ... అట్లతద్ది శుభాకాంక్షలు.
-గౌరీ పూజ ఫలించి నీకు మంచి వాడితో వివాహం జరగాలని ఆశిస్తూ, హ్యాపీ అట్లతద్ది.
-ఉయ్యాల ఆటలు, గోరింటాకు మురిపాలతో అట్లతద్ది పండుగ నీకు మంచి భవిష్యత్తును ఇవ్వాలి.
-నీ కలల రాకుమారుడు త్వరలోనే నీ జీవితంలోకి రావాలని కోరుకుంటూ, అట్లతద్ది శుభాకాంక్షలు.
ఆధ్యాత్మిక, భక్తి కోట్స్
-గౌరీ మాత కరుణా కటాక్షాలు ప్రతి ఇల్లాలిపై ఉండి, వారి మాంగల్య బలం కలకాలం నిలవాలి.
-అట్లు వాయనంగా ఇచ్చే ముత్తయిదువులకు అమ్మవారి ఆశీస్సులు పుష్కలంగా లభిస్తాయి. అట్లతద్ది శుభాకాంక్షలు.
-పసుపు, కుంకుమల శోభతో మీ గడప ఎప్పుడూ కళకళలాడుతూ ఉండాలి.
-లోకాలనేలే ఆ చల్లని తల్లి మీ దాంపత్యాన్ని నిండు నూరేళ్లు చల్లగా చూడాలని ప్రార్థిస్తూ, అట్లతద్ది శుభాకాంక్షలు.
-భక్తి శ్రద్ధలతో చేసే ఈ అట్లతద్ది నోము, మీ కుటుంబానికి శ్రీరామరక్షగా నిలవాలి.



Click it and Unblock the Notifications

