Latest Updates
-
చలికాలంలో హార్ట్ ఎటాక్ ముప్పు? తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు! -
కేరళ స్పెషల్ మలబార్ చికెన్ బిర్యానీ.. బ్యాచిలర్లు కూడా చిటికెలో చేసేయొచ్చు! -
చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచి, చర్మానికి మెరుపునిచ్చే తులసి తమలపాకు రసం..ఎలా చేసుకోవాలంటే.. -
మెగ్నీషియం లోపం వేధిస్తోందా? కండరాల నొప్పులు, అలసట తగ్గించే 5 ఫుడ్స్ ఇవే! -
కార్తీకమాసం స్పెషల్.. ఘుమఘుమలాడే అసలైన బ్రాహ్మిణ్ స్టైల్ సాంబార్ మీ ఇంట్లోనే చేసుకోండిలా.. -
చలికాలంలో ఆరోగ్యానికి మేలు చేసే..విటమిన్ C, ప్రోటీన్లు మెండుగా ఉండే ఉసిరి కరివేపాకు పొడి ఎలా చేసుకోవాలంటే.. -
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఉప్పు ఇదే.. ధర ఎంతో తెలుసా..? -
గంటల సమయం పట్టకుండా.. కేవలం 20 నిమిషాల్లోనే రుచికరమైన నిమ్మకాయ పచ్చడి చేసుకోండిలా! -
రైలులో థర్డ్ ఏసీ ప్రయాణంపై కొడుకు ఫిర్యాదు.. జనరల్ కంపార్ట్మెంట్ కి తీసుకెళ్లిన తండ్రి.. వీడియో వైరల్ -
మేఘన చికెన్ బిర్యానీ.. అస్సలు మిస్ అవ్వకండి!
మీ రెగ్యులర్ టీలో ఈ 3 పదార్థాలు కలిపితే.. మండువేసవిలోనూ ఎంతో చల్లదనం!
భారతీయులకు టీ అంటే కేవలం ఒక పానీయం మాత్రమే కాదు.. అదొక ఎమోషన్. పొద్దున లేవగానే ఓ కప్పు వేడి వేడి చాయ్ పడితే కానీ చాలామందికి రోజు మొదలవ్వదు. అయితే ఎండాకాలం వచ్చేసరికి టీ ప్రియులకు పెద్ద కష్టమే వచ్చి పడుతుంది. బయట మండిపోతున్న ఎండలు, ఉక్కిరిబిక్కిరి చేసే ఉక్కపోత.. వీటికి తోడు వేడి వేడి టీ తాగితే శరీరం మరింత వేడెక్కిపోతుందేమో అన్న భయం. అందుకే టీ తాగాలని ఎంత ఇష్టం ఉన్నా సరే.. వేసవిలో బలవంతంగా దానికి దూరంగా ఉంటారు. అయితే మన వంటింట్లో సులభంగా దొరికే కేవలం మూడు సహజసిద్ధమైన పదార్థాలు పుదీనా,సోంపు, యాలకలను మీ రెగ్యులర్ టీలో కలుపుకుంటే చాలు.. ఆ టీ మీకు వేడి చేయకపోగా, వేసవిలో అద్భుతమైన చల్లదనాన్ని, రోజంతా తాజాదనాన్ని ఇస్తుంది.

మామూలు టీ తాగిన తర్వాత వేసవిలో కడుపులో కాస్త బరువుగా, వేడిగా అనిపిస్తుంది. కానీ ఈ పుదీనా, సోంపు, యాలకుల టీ తాగితే మాత్రం ఎలాంటి భారమైన భావన లేకుండా ఎంతో తేలికగా, రిఫ్రెషింగ్ గా ఉంటుంది. పుదీనా ఆకులకు సహజంగానే శరీరాన్ని చల్లబరిచే అద్భుతమైన గుణం ఉంటుంది. ఎండలో తిరిగి వచ్చిన తర్వాత అలసటగా అనిపించినప్పుడు ఈ పుదీనా టీ తాగితే తక్షణ శక్తి, ఉత్సాహం వస్తాయి. సోంపు టీలో వేసి మరిగిస్తే, అది శరీరాన్ని లోపలి నుంచి చల్లబరుస్తుంది. కడుపులో ఉబ్బరంగా ఉన్నప్పుడు ఈ టీ కడుపుకు ఎంతో తేలికైన అనుభూతిని ఇస్తుంది. టీలో యాలకులు వేయడం వల్ల వచ్చే కమ్మని సువాసన మనసుకు అద్భుతమైన ప్రశాంతతను చేకూరుస్తుంది.
స్పెషల్ సమ్మర్ టీ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి
సమ్మర్ స్పెషల్ టీ తయారీకి కావాల్సిన పదార్థాలు
సోంపు - 1 టీస్పూన్
తాజా పుదీనా ఆకులు - 6 నుంచి 7
యాలకులు - 1 లేదా 2 (కొద్దిగా దంచినవి)
టీ పొడి - అవసరమైనంత
చక్కెర - మీ రుచికి సరిపడా
పాలు, నీళ్లు - తగినన్ని

సమ్మర్ స్పెషల్ టీ తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని అందులో తగినన్ని నీళ్లు, పాలు పోసి మరిగించాలి. మరింత కడక్ చాయ్ ఇష్టపడేవారు ముందుగా నీళ్లను మరిగించి, ఆ తర్వాత పాలు కలుపుకోవచ్చు.
-నీళ్లు మరుగుతున్న సమయంలో అందులో టీ పొడి, రుచికి సరిపడా చక్కెర వేసి బాగా కలపాలి. టీ కాస్త మరుగుతున్న సమయంలో అందులో సోంపు, తాజా పుదీనా ఆకులు, కచ్చాపచ్చాగా దంచిన యాలకులు వేయాలి. ఈ మిశ్రమాన్ని సిమ్ లో పెట్టి మరో రెండు, మూడు నిమిషాల పాటు బాగా మరిగించాలి. అప్పుడే ఈ మూడు పదార్థాలలోని సుగుణాలు, ఫ్లేవర్లు టీలోకి సంపూర్ణంగా దిగుతాయి.
-ఇల్లంతా కమ్మని వాసన వస్తున్న సమయంలో స్టవ్ ఆపేసి వడకట్టుకుని వేడివేడిగా ఆస్వాదించడమే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
