Latest Updates
-
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.?
అల్లం వెల్లుల్లి పేస్ట్ నెలల తరబడి ఫ్రెష్ గా ఉండాలంటే ఇలా చేయండి
రోజువారీ కూరల్లో చక్కని రుచి రావాలన్నా,ఆదివారం స్పెషల్ నాన్ వెజ్ వండాలన్నా మనకు ముందుగా గుర్తొచ్చేది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది వంటలకు అద్భుతమైన రుచితో పాటు కమ్మని సువాసనను ఇస్తుంది. ఇందులో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. అయితే వంట చేసిన ప్రతిసారీ అప్పటికప్పుడు దంచుకోవడం లేదా మిక్సీ పట్టుకోవడం అనేది వంటగదిలో కాస్త శ్రమతో కూడుకున్న పనే. దీంతో చాలామంది తీరిక దొరికినప్పుడు ఎక్కువ మొత్తంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటుంటారు.

దీంతో చాలామంది తీరిక దొరికినప్పుడు ఎక్కువ మొత్తంలో అల్లం, వెల్లుల్లిపాయలు తెచ్చుకుని పేస్ట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటుంటారు. కానీ కొన్నిసార్లు మనం ఎంత జాగ్రత్తగా డబ్బాల్లో పెట్టినా.. అది కొద్ది రోజులకే పైపొర రంగు మారడం, బూజు పట్టడం లేదా వాసన రావడం జరుగుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పాడవకుండా, ఎక్కువ రోజుల పాటు ఫ్రెష్ గా, ఘుమఘుమలాడుతూ ఉండాలంటే ఏం చేయాలో ఇక్కడ చూడండి.
తడి అస్సలు తగలకూడదు
ఏ ఆహార పదార్థమైనా పాడైపోవడానికి ప్రధాన కారణం తేమ. అల్లం వెల్లుల్లి
పేస్ట్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. మీరు అల్లం ముక్కలు, వెల్లుల్లి
రెబ్బలను శుభ్రం చేసిన తర్వాత, వాటిని ఓ పొడి గుడ్డతో తుడిచి
ఆరబెట్టాలి. వాటిలో కొంచెం కూడా తడి లేదు అని నిర్ధారించుకున్న
తర్వాతే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేస్తే పేస్ట్ త్వరగా పాడవదు.
నూనె, ఉప్పు.. సహజ రక్షకాలు
పేస్ట్ ఎక్కువ మొత్తంలో తయారు చేసుకున్నప్పుడు, అందులో ఒకటిన్నర
టేబుల్ స్పూన్ల నూనె (పల్లీ, సన్ ఫ్లవర్ లేదా ఆలివ్ ఆయిల్),
ఒక టీస్పూన్ ఉప్పు కలపండి. ఉప్పు, నూనె సహజమైన
ప్రిజర్వేటివ్ లుగా పనిచేసి పేస్ట్ ను
సూక్ష్మజీవుల బారినుండి కాపాడతాయి. దీన్ని గాలి చొరబడని గాజు సీసాలో
భద్రపరుచుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
వెనిగర్ మ్యాజిక్
నార్మల్ గా గాజు సీసాలో అల్లం వెల్లుల్లి పేస్ట్
ను నింపిన తర్వాత, దాని పైన పలుచని పొరలా వెనిగర్ పోయాలి. ఆ తర్వాత
మూతను గట్టిగా బిగించి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే పేస్ట్
ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.
నిమ్మరసంతో రంగు మారకుండా
కొన్నిసార్లు పేస్ట్ పైభాగం ఆకుపచ్చ లేదా పసుపు రంగులోకి మారుతుంది.
ఇది పేస్ట్ పాడవుతోందనడానికి స్పష్టమైన సంకేతం. ఇలా జరగకుండా ఉండాలంటే
అల్లం వెల్లుల్లి పేస్ట్ రుబ్బేటప్పుడు అందులో ఒక టీస్పూన్ తాజా
నిమ్మరసం కలపండి. ఇది రంగు మారకుండా నిరోధించి, పేస్ట్ ను
ఫ్రెష్ గా ఉంచుతుంది.

జిప్ లాక్ కవర్ లేదా క్లింగ్ ఫిల్మ్
మీరు గాజు సీసాలో కాకుండా కవర్లలో దాచుకోవాలనుకుంటే గాలి చొరబడని,
లీకేజీలు లేని జిప్ లాక్ బ్యాగ్‌లో పెట్టి
ఫ్రిడ్జ్‌లో పెట్టొచ్చు. ఒకవేళ డబ్బాలో పెడితే, గాలిలో ఉండే
తేమ, జిడ్డు పేస్ట్ లోకి చేరకుండా సీసా మూత పెట్టే ముందు
దానిపై క్లింగ్ ఫిల్మ్ లేదా పార్చ్మెంట్ పేపర్ ఉంచి మూతను
గట్టిగా బిగించాలి. ఇది అదనపు రక్షణ కవచంలా పనిచేస్తుంది.
ఐస్ క్యూబ్స్ లా ఫ్రీజ్ చేసుకోండి
ఇది అందరికీ ఎంతో ఉపయోగపడే బెస్ట్ టిప్. మీరు తయారు చేసుకున్న
పేస్ట్ ను చిన్న చిన్న ముద్దలుగా చేసి ఐస్ క్యూబ్ ట్రేలో
వేసి ఫ్రీజర్ లో పెట్టండి. అవి గడ్డకట్టిన తర్వాత వాటిని
తీసి ఎయిర్ టైట్ జిప్ లాక్ బ్యాగ్ లో వేసుకుని
ఫ్రీజర్ లో భద్రపరుచుకోండి. ఇలా చేస్తే ఏకంగా రెండు, మూడు
నెలల పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ చెక్కుచెదరదు. వంట చేసేటప్పుడు
మీకు కావాల్సినన్ని క్యూబ్స్ నేరుగా కూరలో వేసేసుకోవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications