గార్లిక్ రైస్ ఎప్పుడైనా తిన్నారా? క్షణాల్లో రెడీ, ముద్ద ముద్దలో మజా వస్తుంది,ఎలా చేయాలంటే

Posted By:

వెల్లుల్లి మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఏ వంటకం అయినా అందుల్లో దాదాపు వెల్లుల్లి ఉండి తీరుతుంది. అయితే వెల్లుల్లితో తయారుచేసే రైస్ మీరెప్పుడైనా తిన్నారా? వెల్లుల్లి రైస్ రుచికరమైన వంటకమే కాకుండా ఆరోగ్యకరమైన వంటకం కూడా. దీనిని ఇంట్లోనే చాలా సులభంగా తయారుచేసుకోవచ్చు. దీనికి ఎక్కవగా టైం కూడా పట్టదు. తక్కువ సమయంలో చాలా సులభంగా తయారుచేసుకోవచ్చు. గార్లిక్ రైస్ తయారుచేసుకోడానికి కావలసిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.

గార్లిక్ రైస్ తయారీకి కావలసిన పదార్థాలు

బాస్మతి లేదా నార్మల్ రైస్ : 1 కప్పు
వెల్లుల్లి: 10-12 రెబ్బలు
ఉల్లిపాయ: 1
పచ్చిమిర్చి: 2-3
నూనె: 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు: 1 టీస్పూన్
జీలకర్ర: 1/2 టీస్పూన్
కరివేపాకు: కొన్ని ఆకులు
పసుపు: 1/4 టీస్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
కొత్తిమీర: గార్నిష్ కోసం

గార్లిక్ రైస్ తయారీ విధానం

-ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి 30 నిమిషాలు నానబెట్టండి.

-తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేడి చేసి, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి.

-తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.

-ఇప్పుడు వెల్లుల్లి తరుగు వేసి కొన్ని నిమిషాలు వేయించాలి.

-తర్వాత అందులో పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి.

-తర్వాత అరగంటపాటు నానబెట్టిన బియ్యం వేసి, 2 కప్పుల నీరు పోయాలి.

-గిన్నె మీద మూత పెట్టి మీడియం మంట మీద అన్నం ఉడికే వరకు ఉడికించాలి.

-అన్నం ఉడికిన తర్వాత కొత్తిమీర చల్లి దించేయండి. అంతే గిర్లిక్ రైస్ రెడీ.

మిగిలిపోయిన అన్నంతో ఆలూ రైస్..మీ జన్మలో ఇలాంటి రుచి చూసి ఉండదు,ఎలా చేయాలో చూడండి

ప్రయోజనాలు

వెల్లుల్లి అన్నం రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకం. దీనిని మీ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. వెల్లుల్లి అన్నం తినడం వల్ల శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది శరీరానికి యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. శరీరంలోని రక్తపోటును అదుపులో ఉంచడానికి ఉపయోగపడుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. వెల్లుల్లిలో క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉన్నాయి. వెల్లుల్లి జీర్ణక్రియను మెరుగుపరచడంలో, మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది. వెల్లుల్లి జీవక్రియను పెంచడంలో, కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. వెల్లుల్లి చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

వెల్లుల్లి అన్నం తినడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు

కొంతమందికి కడుపులో మంట, గ్యాస్ వంటి సమస్యలు రావచ్చు. కొంతమందికి అలర్జీ ప్రతిచర్యలు రావచ్చు. ఈ దుష్ప్రభావాలు సాధారణంగా తేలికపాటివి, కానీ మీకు ఏవైనా ఆందోళనలు ఉంటే మీ డాక్టర్ ని సంప్రదించడం బెటర్.

[ of 5 - Users]
Story first published: Saturday, April 12, 2025, 12:44 [IST]
Desktop Bottom Promotion