బయట క్రిస్పీగా, లోపల మెత్తగా ఉండే రవ్వ బన్ అప్పం.. తింటే వదలరు..10 నిమిషాల్లోనే చేసుకోండిలా

Posted By:

ఆఫీసులు లేదా పనులకు వెళ్లేవారికి ఉదయం పూట చాలా హడావుడి ఉంటది. అందుకే ఉదం పూట టిఫిన్ కి ఇడ్లీ, దోశలు చేసుకోవడం కోసం ముందు రోజు రాత్రి పిండిని గ్రైండ్ చేసి రాత్రంతా పులియబెట్టి ఉదయం బ్రేక్ ఫాస్ట్. చేసుకుంటారు. అయితే అప్పుడప్పుడు ఇడ్లీ, దోశ పిండి ముందుగానే చేసుకోవడం వీలుపడదు లేదా మర్చిపోతుంటాం. అలాంటి టైమ్ లో కూడా ఉదయం బ్రేక్ ఫాస్ట్ ని మంచి రుచిగా, చాలా సింపుల్ గా 10 నిమిషాల్లోనే చేసుకోవచ్చు..అదే రవ్వ బన్ అప్పం.

వీటిని బన్ దోశలు అని కూడా పిలుస్తారు. చూడటానికి క్రిస్పీగా లోపల మెత్తగా మంచి రుచితో ఉంటాయి. స్పాంజీలా ఉండి, తినడం మొదలుపెడితే సాధారణంగా 1 తినేవాళ్లు 2 తినేస్తారు. రవ్వ బన్ అప్పం తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

Skip the Fermentation Make Fluffy and Flavorful Rava Bun Appam Instantly Recipe in Telugu

రవ్వ బన్ అప్పం తయారీకి కావాల్సిన పదార్థాలు

-పెరుగు
-ఉప్మా రవ్వ
-నూనె
-పచ్చి శెనగపప్పు
-మినపప్పు
-జీలకర్ర
-ఆవాలు
-ఉల్లిపాయ
-పచ్చిమిర్చి
-కొత్తిమీర
-వంటసోడా

చలికాలంలో ఎముకలను దృఢంగా ఉంచే రాగి మునగాకు రోటీ..బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ బ్రేక్‌ ఫాస్ట్

రవ్వ బన్ అప్పం తయారీ విధానం

-ముందుగా ఒక గిన్నె తీసుకోండి. అందులో 1 కప్పు ఉప్మా రవ్వ వేయండి,ఇందులోనే అరకప్పు పెరుగు, అర కప్పు నీళ్లు వేసి కలిపి మూతపెట్టి 10 నిమిషాలు పక్కన ఉంచండి. దీంతో రవ్వ మెత్తగా నానుతుంది.

-10 నిమిషాలకి రవ్వ నీటిని పీల్చుకుని కొంచెం గట్టిపడతుంది. అప్పుడు ఈ మొత్తాన్ని మిక్సీ గిన్నెలో వేసి కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ గ్రైండ్ చేసుకోండి.

-గ్రైండ్ చేసిన దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి.

-ఆ పిండిలో వేసేయడానికి తాలింపు కోసం..స్టవ్ మీద కడాయి పెట్టి అందులో 2 టీస్పూన్ల నూనె వేడి చేసి అందులో 1 టీస్పూన్ పచ్చి శెనగపప్పు, 1 టీస్పూన్ మినపప్పు, అర టీస్పూన్ జీలకర్ర, అర టీస్పూన్ ఆవాలు వేసి కొంచెం వేయించాక అందులో 2 టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ ముక్కలు, 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ దోరగా వేగితే చాలు స్టవ్ ఆపేయండి.

-రెడీ అయిన తాలింపుని గ్రైండ్ చేసుకున్న పిండిలో వేసి కలపండి. ఇందులోనే పిడికెడు కొత్తిమీర ఆకు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపాక ఇందులోనే అర టీస్పూన్ వంటసోడా వేసి అది కరిగేటట్లు అందులోనే కొంచెం నీళ్లు పోసి కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ దోశ పిండిలా ఉండాలి, మరీ పల్చగా ఉండకూడదు.

-తర్వాత స్టవ్ వెలించి తాలింపు కడాయిని పెట్టి అందులో 2 టీస్పూన్ల నూనె వేసి, రెడీ చేసుకున్న పిండి నుంచి గరిటెడు కడాయిలో వేసి మూతపెట్టి తక్కువ మంట మీద 40 సెకన్లు ఉడికించండి, తర్వాత మూత తీసి దాన్ని మరో వైపుకి తిప్పి, అంచుల చుట్టూ కొద్దిగా నూనె వేసి కాల్చితే రెండు పక్కలా బాగా ఉడుకుతుంది. ఇదే విధంగా పిండి మొత్తంతో అప్పాలు చేసుకుని స్టవ్ ఆపేయండి.

-అంతే రవ్వ బన్ అప్పం రెడీ.

[ of 5 - Users]
Story first published: Monday, November 9, 2026, 8:37 [IST]
Desktop Bottom Promotion