Latest Updates
-
నిమజ్జనం రోజు గణేశుడి చెవిలో ఈ 3 పదాలను చెప్పండి.. మీ తీరని కోరిక నెరవేరడం పక్కా.! -
రాత్రి మిగిలిన చపాతీలతో అదిరిపోయే బ్రేక్ఫాస్ట్.. పదే నిమిషాల్లో ఇలా చేసుకుంటే సూపర్ టేస్ట్.! -
సమసప్తక యోగం.. నెల రోజుల పాటు వీరిపై తీవ్రంగా శని ప్రభావం, ఈ పరిహారాలు తప్పనిసరి.! -
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా!
బీహారీ స్పెషల్ చోఖా..పొలం గట్టు మీద కూర్చొని ఈ పచ్చడి కలిపి అన్నం తింటుంటే స్వర్గమే!
రోజూ అవే పచ్చళ్లు, అవే చట్నీలు తిని తిని బోర్ కొట్టేసిందా? ఏం తిన్నా నోటికి రుచించట్లేదా? అయితే ఒక్కసారి చోఖా రుచి చూడాల్సిందే. చోఖా అంటే..నిప్పు మీద కాల్చిన వంకాయ, టమోటాలు, ఉడికించిన బంగాళాదుంపలు, ఆవ నూనె, సాధారణ సుగంధ ద్రవ్యాలను కలిపి మెత్తగా నూరి తయారుచేసే ఒక బీహారీ సాంప్రదాయ వంటకం.
స్మోకీ ప్లేవర్ తో, ఘాటుగా, పూర్తి రుచితో ఉండే చోఖా.. ఒక సాధారణ భోజనాన్ని కూడా అద్భుతంగా మార్చేయగల వంటకం. బీహారీ సంప్రదాయ వంటకం చోఖా మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

చోఖా తయారీకి కావలసిన పదార్థాలు
-ఉడికించిన బంగాళాదుంపలు
-వంకాయలు
-టమోటాలు
-సన్నగా తరిగిన ఉల్లిపాయ
-సన్నగా తరిగిన వెల్లుల్లి
-తరిగిన పచ్చిమిర్చి
-ఎండుమిర్చి
-కొత్తిమీర
-ఉప్పు
-ఆవ నూనె
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే..
చోఖా తయారీ విధానం
-బంగాళాదుంపలను మెత్తబడే వరకు ఉడకబెట్టండి. వాటిని కొద్దిగా చల్లారనిచ్చి, తొక్క తీయండి.
-వంకాయ, టమోటాలను నేరుగా మంట మీద చక్కగా వేగి, పొగ వచ్చేంత వరకు కాల్చండి. వాటిని చల్లారనిచ్చి, ఆ తర్వాత మాడిన తొక్కను తీసివేయండి.
-ఒక మిక్సింగ్ బౌల్ లో, తొక్క తీసిన వంకాయలు, కాల్చిన టమోటాలు,ఉడికించిన బంగాళదుంపలను వేయండి. అన్నింటినీ కలిపి బాగా మెత్తగా చేయండి. తర్వాత ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ, వెల్లుల్లి, పచ్చిమిర్చి, తాజా కొత్తిమీర వేసి ఉప్పు కలపండి.
-ఇప్పుడు ఎండు మిరపకాయలను మంటపై కాల్చి, వాటిని నలిపి చోఖాలో
కలపండి.
చివరగా కాస్త ఎక్కువగానే ఆవ నూనెను జల్లి, వాటన్నింటినీ బాగా
కలపండి.
-అంతే చోఖా రెడీ. దీన్ని పరాఠా, పప్పు-అన్నం, ఖిచిడీ లేదా మీకు నచ్చిన ఇతర వంటకాలతో తింటే ఆహా ఏమి రుచిరా అనాల్సిందే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
