బనానా మఫ్పీన్స్

Banana Muffins
కావలసిన పదార్ధాలు:
వెన్న - 150 grms
పంచదార - 150 grms
కోడిగుడ్డు - 1
మైదా - 1 cup
బేకింగ్ సోడా - 1/2 tsp
అరటికాయ ముక్కలు - 1 cup
నూనె - 1 tsp

తయారు చేయు విధానము

1. ఒక వెడల్పాటి ప్లట్ కానీ, బౌల్ కానీ తీసుకొని అందులో వెన్న, పంచదార, రెండు సమపాళ్లలో తీసుకొని బాగా కలపాలి.
2. అందులోనే కోడిగుడ్డు, కొద్దిగా నూనె వేసి బాగా మిక్స్ అయ్యేలా కలపాలి అప్పుడే పంచదార అందులో బాగా కరిగుతుంది.
3. ఇప్పుడు ఆ మిశ్రమానికి ఒక కప్పు మైదా, చిటికెడు బేకింగ్ సోడా, ఒక కప్పు కట్ చేసి పెట్టిన అరటికాయ ముక్కలు, బనానా అసెన్స్ వేసి బాగా కలపి పక్కన పెట్టాలి.
4. తర్వాత టీ కప్పు సైజులో చిన్న కప్పులు లేదా ప్లాస్టిక్ కప్పులు తీసుకొని అందులో తయారు చేసిపెట్టుకొన్న మిశ్రమాన్ని నిండుగా పెట్టాలి. అలా అన్నింటిలో పెట్టుకొన్నా తర్వాత వాటిని వోవన్ లో పెట్టి 180 డిగ్రీ లో బేక్ చెయ్యాలి. అంతే పసందైన బనానా మఫ్పీన్స్ రెడీ.

Story first published: Friday, November 13, 2009, 15:47 [IST]
Desktop Bottom Promotion