Latest Updates
-
మీ శరీరంలో ప్రోటీన్ లోపం ఉందని చెప్పే 5 ముఖ్యమైన సంకేతాలివే! -
డీప్‌ఫేక్ సెక్స్టార్షన్ ఉచ్చులో పడ్డారా? మీ ఫోటోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే! -
కిడ్నీ రాళ్లను ఇట్టే కరిగించే ఉలవలతో టేస్టీ వడలు..తయారీ విధానం ఇదే! -
తెలంగాణ-ఏపీలో ఎండల తీవ్రత: గర్భిణీలకు పొంచి ఉన్న ముప్పు ఇదే! -
ఇడ్లీ,దోశల్లోకి బెస్ట్ కాంబినేషన్ కరివేపాకు కొబ్బరి చట్నీ..మామూలు చట్నీల కంటే 100 రెట్లు రుచి! -
వేసవిలో బరువు తగ్గాలా? అయితే మజ్జిగలో ఈ చిన్న పొడి కలిపి తాగితే, మీ పొట్టలోని కొవ్వు మంచులా కరిగిపోతుంది! -
విజయ్–త్రిష వెడ్డింగ్ వీడియో.. సోషల్ మీడియాలో రచ్చ! అసలు నిజం ఇదేనా? -
ఓట్స్ అంటే ఇష్టం లేదా? ఇలా గంజిలా చేసి చూడండి..బరువు తగ్గడంతో పాటు రుచీ మీ సొంతం! -
పప్పుల పొడి బోర్ కొట్టిందా? అయితే ఈ ఘాటైన ఆంధ్రా చికెన్ కారప్పొడి ట్రై చేయండి! -
పీరియడ్స్ ఆలస్యం అవ్వడానికి అసలు కారణం ఇదేనట!
ఎగ్ లెస్ క్యారెట్ కేక్ రిసిపి: క్రిస్మస్ స్పెషల్
క్రిస్‌మస్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది క్రిస్‌మస్ ట్రీ. పిల్లలకయితే క్రిస్‌మస్ తాత గుర్తుకువస్తాడు. ఇంకా ఏం గుర్తుకువస్తాయి అని అడిగితే...ప్రశ్న పూర్తవకుండానే జవాబు వచ్చేస్తుంది. నోరూరించే కేకులని. ఒకటి రెండూ కాదు ఆ సమయంలో బోలెడు రకాల కేకులు కెవ్వుమని కేక వేస్తాయి. పిల్లలు, పెద్దలు తేడా లేకుండా చాకులతో రెడీ అయిపోతారు.
క్రిస్‌మస్‌ని కేకుతో ఆహ్వానిస్తారు. తియ్యగా సెలబ్రేట్ చేసుకుంటారు. క్రిస్మస్ అంటే ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకునే సమయం. క్రిస్మస్‌కి కేకులు తయారుచేసి వచ్చిన అతిథులకే కాక దూరాన ఉన్న వారికి సైతం ఆర్డర్ చేసి మరీ అందచేస్తారు. కొందరు మాత్రం ఇంట్లో చేసుకోవాలనుకుంటారు. అందుకే ఇక్కడ మీకోసం ఒక కేక్ రిసిపిని తయారుచేసే విధానంతో అంధిస్తున్నాం. మీరు కూడా ప్రయత్నించి మీ క్రియేటివిటీని జోడించి డెకొరేట్ చేయండి...కేక్ కట్ చేసి ఇంటికి వచ్చిన అతిథులకు క్రిస్మస్ శుభాకాంక్షలను తీయగా అందించండి...

కావలసిన పదార్థాలు:
వెన్న: 1/2cup
కొబ్బరి తురుము: 1cup
అక్రోట్ ముక్కలు: 1cup
ఎండుద్రాక్ష: 1cup
క్యారెట్ తురుము: 3cups
దాల్చినచెక్కపొడి: 1tsp
జాజికాయ పొడి: 1tsp
అల్లంపొడి: 1tsp
బ్రౌన్ షుగర్ (ముడి పంచదార): 1cup
మైదాపిండి: 2cups
బేకింగ్‌సోడా: 1tsp
ఆరెంజ్ జ్యూస్: 2tsp
ఆరెంజ్ కేక్ విత్ చాక్లెట్ కేక్-క్రిస్మస్ స్పెషల్
తయారు చేయు విధానం:
1. ముందుగా ఒక గిన్నెలో మైదా, మసాలా పొడులు, బేకింగ్ సోడా, బ్రౌన్ షుగర్, వాల్‌నట్ ముక్కలు వేసి బాగా కలపాలి.
2. తర్వాత విడిగా ఓ పాన్‌లో వెన్న వేసి కరిగిన తరవాత బంగారువర్ణంలోని ఎండుద్రాక్ష, క్యారెట్లు, ఆరెంజ్ జ్యూస్ వేసి కలిపి వెంటనే దించి మైదా మిశ్రమంలో వేసి కలపాలి.
3. ఇప్పుడు మొత్తం మిశ్రమం కూడా వేసి బాగా కలపాలి.
4. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన బేకింగ్ టిన్‌లో వేసి సుమారు గంటసేపు 150 డిగ్రీల సెంటీగ్రేడు దగ్గర బేక్ చేయాలి.
5. చిన్న టూత్‌పిక్‌తో ఉడికిందో లేదో చూసి బయటకు తీయాలి. బయటకు తీసిన తరవాత ఐసింగ్ చేసి అందిస్తే బాగుంటుంది. మదర్స్ డే రోజున మీ మదర్స్ ను సర్ ప్రైజ్ చేయండి.



Click it and Unblock the Notifications