Latest Updates
-
వైశాఖ పౌర్ణమి నాడు ఈ చిన్న పనులు చేస్తే.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోనే ఉన్న ఈ చిట్కాలు ట్రై చేయండి -
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే! -
నోరూరించే గోంగూర అన్నం..తెలుగువారి రుచుల్లో రారాజు! -
ఎండలో బండి పార్క్ చేస్తున్నారా? మీ మగతనానికి ముప్పే..పిల్లలు పుట్టరంట! -
గురు పుష్య యోగం: ఈ శనివారం ఈ సమయాల్లో పనులు మొదలుపెడితే తిరుగేలేదు! -
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి! -
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి!
కేసర్ పేడ-మిల్క్ స్వీట్-శ్రీ క్రిష్ణ జన్మాష్టమి స్పెషల్ స్వీట్
సాధారణంగా ఏ వంటలకైనా సరే పాలు వేస్తే మరింత టేస్టీగా తయారవుతాయి. అందుకే అనేక వంటకాలలో, స్వీట్స్ లో పాలు విరివిగా ఉపయోగిస్తుంటారు. ఉదా: ఖీర్, పాయసం, పేడా, హల్వా మొ.. అటువంటిదే ఈ కేసర్ పేడ. దీన్ని తయారు చేయడం చాలా సులభం మరియు అతి తక్కువ సమయంలో తయారు చేయవచ్చు.
ఇటువంటి స్పెషల్ స్వీట్స్ ను శ్రీక్రిష్ణ జన్మాష్టమికి తయారు చేస్తే ఇంటిల్లిపదీ నోటిని తీపిచేసుకొని సంతోషకరమైన వాతవరణం ఏర్పడుతుంది. కొత్త టేస్ట్ తో మరింత ఆనందంగా గడపవచ్చు. క్రిష్ణుడికి కూడా పాలతో తయారు చేసిన స్వీట్స్ అంటే మహాఇష్టం కాబట్టి, ఈ జన్మాష్టమికి స్పెషల్ గా తయారు చేసుకుందాం. మరి మీరు కూడా జన్మాష్టమి సెలబ్రేట్ చేసుకుంటున్నట్లైతే ఈ స్పెషల్ స్వీట్ మీద ఓ లుక్ ఏయండి. ట్రై చేయండి. ఎంజాయ్ చేయండి...

కావల్సిన పదార్థాలు:
పాలు: 1ltr
పంచదార: 100grm
యాలకుల పొడి: 1tsp
కుంకుమ పువ్వు : కొద్దిగా
పిస్తా: 4-8(గార్నిషింగ్ కోసం)
తయారు చేయు విధానం:
1. ముందుగా ఒక గిన్నెలో పాలు పోసి బాగా కాచాలి. పాలు చిక్కబడే వరకూ మరగనివ్వాలి. చిక్కటి పాలు మావాలాగా ఉంటాయి.
2. ఇప్పుడు అందులో పంచదార వేసి, కరిగేంత వరకూ బాగా మిక్స్ చేయాలి. పాలు గిన్నెకు అంటుకొని మాడిపోకుండా ఉండాలంటే పంచదార వేసిన తర్వాత కూడా మద్యమద్యలో కలియబెడుతుండాలి. మంట మీడియంగా లేదా పూర్తిగా తగ్గించి పంచదార కరిగేంతవరకూ పాలు చిక్కబడే వరకూ మరగకాచాలి.
3. తర్వాత అందులో కుంకుమపువ్వు కొద్దిగా వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు కుంకుమ పువ్వు కలిపిన తర్వాత పాలు సఫ్రాన్ ఎల్లోకలర్ లోకి మారుతుంది.
4. మావా(కోవా)పూర్తిగా చిక్కడుతుందో, అప్పుడు స్టౌ మీద నుండి క్రిందికి దింపుకొని పక్కకు తీసి బాగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారితి ఉండలు కట్టడం కొద్దిగా కష్ట అవుతుంది. కాబట్టి, గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉండలు చుట్టుకొని, అరచేతిలో ఉంచి, ఫ్లాట్ గా బిస్కెట్ లా వత్తుకోవాలి. తర్వాత వాటి మీద పిస్తాపప్పులను వేసి గార్నిష్ చేయాలి. అంతే కేసర పేడ రెడీ.



Click it and Unblock the Notifications