కోవా క్యారెట్ లడ్డు

Kova Carrot Laddu
కావలసిన పదార్థాలు:
కోవా : 1/2kg
కేరట్: 4
కొబ్బరి :సగం చిప్ప
పంచదార: 1/2 cup
నెయ్యి : 4 tsp
జీడిపప్పు: 8
బాదంపప్పు: 8
కిస్మిస్: 8
ఏలకులపొడి: 1tsp

తయారు చేయువిధానం:
1. ముందుగా క్యారెట్,కొబ్బరి తురుము కోవాలి స్టౌ , మీద బాణలి పెట్టి రెండు చెంచాల నెయ్యి వేసిజీడిపప్పు,బాదంపప్పు,కిస్మిస్ వేయించి కేరట్ పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. 2. దీనికి కొబ్బరితురుము పంచదార కలిపి దగ్గరయ్యే వరకు తిప్పుతూ ఉండాలి .
3. జీడిపప్పు,బాదంపప్పు,కిస్మిస్ ఏలకులపొడి కలిపి స్టవ్ ఆఫ్ చెయ్యాలి ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకుని కోవా చిన్న ఉండ తీసుకుని చేతిలో పరుచుకుని మద్యలో కేరట్ ఉండపెట్టి కప్పెయ్యాలి అన్ని ఆలాచేసుకుంటే క్యారెట్ కోవా లడ్డు రెడి.

Story first published: Thursday, July 28, 2011, 15:23 [IST]
Desktop Bottom Promotion