Latest Updates
-
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్‌తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి
మఖాన కీర్: నవరాత్రి స్పెషల్ స్వీట్
వసంత నవరాత్రి ఉపవాసాలు ప్రారంభమైనాయి. నవరాత్రి స్పెషల్ ఉపవాస పలహారలు, స్వీట్స్, తయారుచేసుకోవడానికి ఇది ఒక మంచి సమయం. . ఇవి తినడానికి టేస్టీగా హెల్తీ మరియు కడుపు నింపేవిగా ఉంటాయి. ఖీర్ అనేది మన ఇండియాలో చాలా పాపులర్ అయినటువంటి స్వీట్ డిష్. ముఖ్యంగా పండుగ సందర్భంగా వీటిని తయారు చేసుకుంటారు.
ఖీర్ తయారుచేయడానికి వివిధ మార్గాలున్నాయి. సాధారణంగా ఎక్కువగా తయారుచేసుకొనే ఖీర్ రైస్ కీర్ . అయితే వ్రతాల సమయంలో బియ్యంతో తయారుచేసిన ఖీర్ లను తీసుకోకూడదు. కాబట్టి, ఇక్కడ ఒక స్పెషల్ కీర్ మీకు పరిచయం చేయడం జరిగింది. దీన్ని నవరాత్రి వ్రత సందర్బంగా తయారుచేసుకోండి...

కావల్సిన పదార్థాలు:
లోఫ్యాట్ మిల్క్: 3cups
మఖాన: 1cup
షుగర్: 11/2cup
నట్ మగ్ పౌడర్: చిటికెడు
బదాం: 5-6
జీడిపప్పు: 5-6(మద్యలోకి కట్ చేసుకోవాలి)
కుంకుమపువ్వు: కొద్దిగా
నెయ్యి: 1tsp
తయారుచేయు విధానం:
1. ముందుగా పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి వేడి చేయాలి. తర్వాత అందులో మఖాన వేసి 3-4నిముషాలు మీడియం మంట మీద వేగించుకోవాలి.
2. తర్వాత వాటిని ఒక ప్లేట్ లోనికి తీసుకోవాలి. అంతలోపు, పాలలో కొద్దిగా కుంకుమ పువ్వు వేసి నానబెట్టుకోవాలి.
3. ఇప్పుడు డీప్ బాటమ్ పాన్ లో కొద్దిగా పాలు పోసి బాగా కాచాలి. పాలు చిక్కబడే వరకూ మరిగించాలి.
4. ఇప్పుడు ఆ మరిగే పాలలో వేయించుకొన్న మఖానా(చీజ్ లేదా పనీర్ వంటిది)వేసి మంటను సిమ్ లో పెట్టి 5నిముషాలు ఉడికించుకోవాలి.
5. ఇప్పుడు అందులో పంచదార వేసి బాగా కలుపుకోవాలి . పంచదార కరిగే వరకూ ఉడకించుకోవాలి. తర్వాత అందులో కుంకుమ పువ్వు నానబెట్టుకొన్న పాలను పోసి బాగా మిక్స్ చేస్తూ ఉడికించుకోవాలి.
6. ఒక సారి ఉడికించుకొన్న తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. తర్వాత అందులో బాదం, జీడిపప్పు, నట్ మగ్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసి తర్వాత వేడి వేడిగా సర్వ్ చేయాలి.



Click it and Unblock the Notifications











