Latest Updates
-
కరకరలాడే బెండకాయ చట్నీ ఎప్పుడైనా తిన్నారా? ఒక్కసారి రుచిచూస్తే వదలరు! -
వేడి వేడి ఇడ్లీ, కరకరలాడే దోశల్లోకి అదిరిపోయే టమాటా చట్నీ.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
స్వైపింగ్ ఇక లేదు! బంబుల్ యాప్‌లో వచ్చిన ఆ మార్పుతో డేటింగ్ స్టైల్ పూర్తిగా మారిపోతుందా? -
ఎండల వల్ల పీరియడ్స్ మిస్ అవుతున్నాయా? మహిళలు తప్పక తెలుసుకోవాల్సిన షాకింగ్ నిజాలు! -
నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే దహీ లచ్చా పరాఠా.. దీన్ని ఎలా చేయాలో తెలుసా? -
అమ్మకు, భార్యకు మధ్య నలిగిపోతున్నారా? మదర్స్ డే రోజున ఈ బ్యాలెన్స్ ఎలాగో తెలుసా! -
మార్కెట్లో కొనే పనిలేదు.. 100% స్వచ్ఛమైన మామిడి పొడి తయారీ విధానం ఇదే -
ఆమె తెచ్చిన రోజే ఆమెకు భారమైంది.. మాతృదినోత్సవం వెనుక తెలియని నిజాలు! -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణులు ఈ చిన్న పొరపాట్లు చేస్తే ప్రమాదమేనా? -
గుండె పదిలం..కిడ్నీలు శుభ్రం..అంతులేని పోషకాలున్న ఈ జ్యూస్ తాగితే బోలెడు బెనిఫిట్స్!
పాస్టా టిక్కీస్ ఎలా చేయాలి?

టిక్కీ మిశ్రమంకోసం: మీడియంసైజు బంగాళాదుంపలు: ఆరు, నిమ్మరసం: 2 టీస్పూన్లు, బ్రెడ్‌పొడి: అరకప్పు, కార్న్‌ఫ్లోర్: టేబుల్‌స్పూను, నూనె: సరిపడా, ఉప్పు: సరిపడా, మిరియాలపొడి: అరటీస్పూను
స్టఫింగ్‌కోసం: పాస్టా: పావుకప్పు(ఉడికించి నీళ్లు వంపి పక్కన ఉంచాలి), క్యాప్సికమ్ ముక్కలు: 2 టేబుల్‌స్పూన్లు, వెల్లుల్లి తురుము: అరటీస్పూను, వెన్న: టీస్పూను, చాట్‌మసాలా: టీస్పూను, నిమ్మరసం: టీస్పూను, కొత్తిమీర తురుము: టీస్పూను, చిజ్‌తురుము: 2 టేబుల్‌స్పూన్లు. అలంకరణకోసం: వంకాయరంగు క్యాబేజీ తురుము: అరకప్పు
తయారుచేసే విధానం:
- బంగాళాదుంపల్ని ఉడికించి పొట్టు తీసి చిదమాలి. ఈ మిశ్రమంలో ఉప్పు, మిరియాలపొడి, నిమ్మరసం వేసి కలపాలి. తర్వాత కార్న్‌ఫ్లోర్ కూడా వేసి బాగా కలపాలి.
- ప్రెషర్‌పాన్‌లో వెన్న వేసి వేడిచేయాలి. తర్వాత వెల్లుల్లి తురుము వేసి వేయించాలి. ఆ వెనక పాస్టా వేసి కలపాలి. దాని తర్వాత క్యాప్సికమ్ ముక్కలు, కొత్తిమీర తురుము కూడా వేసి ఓ నిమిషం వేయించాలి. నిమ్మరసం, చాట్‌మసాలా వేసి కలిపి స్టవ్‌మీద నుంచి దించి చిజ్‌తురుము వేసి కలపాలి.
- టిక్కీలకోసం చేసిన ఆలూ మిశ్రమాన్ని సమభాగాలుగా చేసుకోవాలి. చేతులకు నూనె రాసుకుని ఒక్కోముద్దనీ తీసుకుని మధ్యలో గుంటలా చేయాలి. అందులో పాస్టా మిశ్రమం పెట్టి అంచుల్ని మూసేసి చిన్నపాటి టిక్కీలా వత్తాలి.
- ఇప్పుడు ఒక్కో టిక్కీనీ బ్రెడ్‌పొడిలో దొర్లించి కాగిన నూనెలో వేయించి తీయాలి. వీటిని క్యాబేజీ తురుము మీద అందంగా సర్ది, నిమ్మచెక్కలతో అలంకరించి టొమాటో లేదా చిల్లీసాస్‌తో వడ్డించాలి.



Click it and Unblock the Notifications