Latest Updates
-
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్‌తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి
మలై స్టైల్ కర్రీ పఫ్: మలేషియా స్పెషల్ స్నాక్
చిటపట చినుకులతో సన్నని పూల వర్షం కురుస్తూంటే... పొగలు కక్కే వేడి వేడి టీలో కరకరలాడే బిస్కెట్లు డిప్ చేసుకొని తింటుంటే... ఏదో తెలియని అనుభూతి... మరేదో తెలియని ఆనందం... ఇదంతా పాతబడిపోయింది... ఇప్పుడు... మన ఇంటికి టీ సమయంలో అనుకోని అతిథి వస్తే.. వాళ్లకి రొటీన్‌గా కాకుండా రకరకాల టీ లు తయారుచేసి... వాటికి రకరకాల స్నాక్స్ జత చేస్తూ అందిస్తే... వాళ్లు పొందే సంతోషం... సిప్పు సిప్పుకీ... ముక్క ముక్కకీ రెట్టింపు అవుతూ ఉంటుంది.
అలాంటి స్నాక్ రిసిపినే ఈరోజు మీకోసం ఒకటి పరిచయం చేస్తున్నాము. మలేషియన్ స్టైల్ కర్రీ పఫ్ స్నాక్ రిసిపి . ఇది మలేషియా, సింగపూర్ లలో చాలా ఫేమస్ స్నాక్ రిసిపి. ఈ స్నాక్ రిసిపిని ఈవెంగ్ టీ తో పాటు తీసుకోవడం ఒక చక్కటి అనుభూతి. మీ ఇంట్లో వారికి మాత్రమే కాదు ఇంటింకి వచ్చే అతిథులకు అందించి సంతోషంతో ఎంజాయ్ చేయండి... వారిచ్చే కాంప్లిమెంట్స్ కోసం సిద్ధమైపోండి...

కావలసిన పదార్థాలు:
ఫ్రోజెన్ పఫ్ పేస్ట్రీ - 1packet (సూపర్ మార్కెట్‌లో దొరుకుతుంది);
బంగాళదుంపలు - 4 (ఉడికించి, తొక్క తీసి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేయాలి)
కైమా మీట్ - 1cup (ఉప్పు, మిరియాల పొడి జత చేసి మ్యారినేట్ చేయాలి)
ఉల్లి తరుగు - 1/2cup
వెల్లుల్లి - 3 రెబ్బలు (సన్నగా తరిగిపెట్టుకోవాలి)
బఠాణీ, మొక్కజొన్న, క్యారట్: 1cup (ఉడికించుకోవాలి)
కర్రీ పౌడర్ - 3tbsp
నీళ్లు - cup
ఉప్పు: రుచికి సరిపడా
పంచదార: కొద్దిగా
మిరియాల పొడి - రుచికి తగినంత
నూనె - తగినంత
తయారు చేయు విధానం:
1. ముందుగా పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక అందులో వెల్లుల్లి తరుగు వేసి వేయించాలి.
2. అందులోనే కైమా మీట్ కూడా వేసి రెండు నిముషాలు వేయించుకోవాలి.
3. కైమాతో పాటు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా వేగిన తర్వాత బంగాళదుంప ముక్కలు, కర్రీ పౌడర్, నీళ్లు, ఉప్పు, పంచదార, మిరియాలపొడి, వేసి మిక్స్ చేసి ఉడికించుకోవాలి.
4. మొత్త మిశ్రమం సమంగా మెత్తగా ఉడికేవరకూ ఉడికించి దింపేసుకోవాలి.
5. ఇప్పుడు పఫ్ పేస్ట్రీని పొడవుగా ముక్కలుగా కట్ చేసి, ఉడికించి ఉంచుకున్న మిశ్రమాన్ని ఒక్కో దానిలో ఉంచి, మడత పెట్టి, కోడిగుడ్డు సొనతో అంచులు మూసేయాలి
6. ఫ్రోజెన్ పఫ్ పేస్ట్రీని ప్యాకెట్ మీద ఉన్న సూచనల మేరకు, ప్రీహీట్ చేసిన ఓవెన్ లో పెట్టి బేక్ చేయాలి.అంతే మలేషియా స్టైల్ కర్రీ పఫ్ రెడీ....



Click it and Unblock the Notifications











