Latest Updates
-
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్‌తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి
అమృతం తాగిన అనుభూతి- మ్యాంగో లస్సీ..!
వేసవిలో దాహం తీర్చుకునేందుకు ఎక్కువమంది లస్సీని ఎంచుకుంటారు. లస్సీ నిజానికి పంజాబీ సంప్రదాయ పానీయం. పెరుగుతో తయారుచేసే ఈ సమ్మర్ డ్రింక్ మన దేశంలోనే కాదు పాకిస్తాన్‌లోనూ చాలా ఫేమస్. కారాన్ని ఇష్టపడేవాళ్లు పెరుగులో ఉప్పు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు వేసి తయారుచేస్తే తీపిని ఇష్టపడేవాళ్లు పంచదార వేసుకుంటారు.
ఈ రెండూ కాకుండా నచ్చిన పండ్లతో కూడా లస్సీ చేసుకోవచ్చు. దేనితో కలిపినా చక్కగా కలిసిపోయి నోటికి కమ్మదనాన్ని, ఒంటికి చల్లదనాన్ని ఇచ్చేవి పండ్లతో తయారు చేసే లస్సీలు. అయితే ప్రస్తుతం మామిడి పండ్ల సీజన్ కాబట్టి మ్యాంగో లస్సీ ఎలా తయారు చేస్తారు ఒక సారి చూద్దాం...

ఒక మామిడి పండ్లు : 1 లేదా 2(గుజ్జు తీసుకోవాలి)
పంచదార: 1/2cup
పెరుగు: : 1cup
ఐస్‌క్యూబ్స్: 2-3
యాలకుల పొడి: చిటికెడు
కుంకుమపువ్వు: చిటికెడు
తయారు చేయు విధానం:
1. ముందుగా మామిడిపండుకు ఉన్న పైపొట్టును తీసి గుజ్జుగా తయారు చేసుకోవాలి.
2. తర్వాత పెరుగు, పంచదార, యాలకుల పొడి, ఐస్‌క్యూబ్స్‌ను మిక్సీ జార్‌లో వేసి మెత్తగా అయ్యే వరకు బ్లెడ్ చేయాలి.
3. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని సర్వింగ్ గ్లాసుల్లోకి తీసుకుని కుంకుమపువ్వుతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. చల్లటి మ్యాంగో లస్సీ తాగుతుంటే అమృతం తాగినట్టే ఉంటుంది.



Click it and Unblock the Notifications











