Latest Updates
-
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి!
మాన్ సూన్ స్పెషల్ - లో క్యాలరీ భేల్‌పూరి
వర్షాకాలం మొదలైంది నోటికి వేడి వేడిగా..కారం కారంగా ఏదైనా తినాలనిపిస్తుంది. అలాగని అదేపనిగా బజ్జీ, బోండా, వడలు రోజూ తినలేం కదా..ఒక వేళ తిన్నా నూనె పదర్థాలు మన ఆరోగ్యాన్ని పాడు చేయడం ఖాయం. మరి ఇటువంటి సమయంలో సులభంగా తయారు చేసుకొనేవి, తేలికగా జీర్ణం అయ్యేవాటి మీద మనస్సు మళ్లించాలి. వర్షాకాలంలో చిరు జల్లులు పడుతున్న సమయంలో వేడి వేడి ఛాట్స్ నోరూరింస్తుంటాయి. మరియ ఇంటిల్లిపాది తినేటటువంటి ఆరోగ్యభరితమైన ఛాట్స్ మీకోసం..
ఈ ఛాట్ కు కావల్సిన పదార్థాలన్నీ ఇంట్లోనే ఉంటాయి. ముఖ్యంగా భేల్ పూరికి , మరమరాలు మరియు సన్న కార్పూస ఈ రెండు ప్రధానమైనవి మిగిలినవన్నీ మన వంటగదిలో నిల్వ ఉండే వస్తువులే కాబట్టి తయారు చేయడం కూడా చాలా సులభం. తక్కువ కేలరీల ఆహారం ఇది. రుచికరమైనది కాబట్టి పిల్లలకు తినడానికి ఎంతో ఇష్టపడతారు.మీరు ఈ ఛాట్ తయారుచేసుకొని రుచి చూడండి...

కావలసిన పదార్థాలు:
మరమరాలు: 100grms
ఉడకబెట్టిన బంగాళాదుంపల ముద్ద: 1/2cup
చింతపండు: 50grms.
బెల్లం: 50grms
సన్న కారప్పూస: 50grms
పుదీనా ఆకులు: ఒకకట్ట
ఛాట్ మసాలా: tbsp
కొత్తిమీర: ఒకకట్ట
పచ్చిమిర్చి: 3
ఉప్పు: రుచికి తగినంత
తయారు చేయు విధానం:
1. ముందుగా బెల్లాన్ని నీళ్లలో వేసి ఐదు నిమిషాలు మరిగించిన తరువాత చింతపండును కప్పు వేడినీటిలో వేసి కొద్దిగా చిక్కబడేవరకూ మరిగించి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత దీనికి పచ్చిమిర్చి ముక్కలను, పుదీనా ఆకులను కలిపి మెత్తగా పేస్ట్‌లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత ఉడికిన బంగాళా దుంపలను తీసుకుని దానికి ఛాట్‌మసాలా వేసి బాగా కలపాలి.
4. ఇప్పుడు మరమరాలను ఒక బౌల్‌లోకి తీసుకుని పుదీనా పేస్ట్‌ను కలపాలి. దీనిపై చిన్న ముక్కలుగా చేసుకున్న ఉల్లిపాయముక్కలు, చింతపండు వాటర్, సన్నకారప్పూస, బంగాళాదుంపల ముద్దను వేసి బాగా గరిటెతో బాగా కలపాలి. అంతే భేల్ పూరి రెడీ. తక్కువ కేలరీల ఆహారం ఇది. రుచికరమైనది కాబట్టి పిల్లలకు తినడానికి ఎంతో ఇష్టపడతారు.



Click it and Unblock the Notifications











