Latest Updates
-
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి!
డైట్ సీక్రెట్-ఓట్స్-వెజిటేబుల్ ఉప్మా

కావలసిన పదార్థాలు:
ఓట్స్ : ఒక కప్పు,
క్యారెట్స్, బీన్స్, క్యాప్సికమ్(తరిగినవి): 1cup
పచ్చిబటానీ: 2tbsp
పచ్చి మిర్చి4-6(చిన్నగా కట్ చేసినవి)
అల్లం: చిన్న ముక్క (తురిమినది)
ఉల్లిపాయలు: 2(సన్నగా పొడవుగా తరిగినవి)
టమోటో: 1
శనగపప్పు, మినపపప్పు, ఆవాలు: 2tsp
జీలకర్ర: 1 tsp
కరివేపాకు: రెండు రెమ్మలు
కొత్తిమీర: 1/2cup
జీడిపప్పు: 6-8
నూనె : తగినంత
ఉప్పు : రుచికి తగినంత.
తయారు చేయు విధానం:
1. ముందుగా ఓట్స్ ను నూనె లేకుండా దోరగా వేయించి పక్క తీసి పెట్టుకోవాలి.
2. తరువాత ఒక పాన్ నూనె వేసి కాస్త వేడి అయ్యాక పోపు గింజలు వేసి దోరగా వేయించాలి. వెంటనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, కూరగాయల ముక్కలు, కరివేపాకు వేసి మరి కాసేపు వేయించుకోవాలి.
3. చివరగా టమోటా కూడా వేసి బాగా వేయించి సరిపడా నీళ్లుపోసి(ఒక కప్పుఓట్స్ కి ఒక కప్పు నీళ్ళు) తగినంత ఉప్పు వేసి మూత పెట్టాలి.
4. తర్వాత నీరు మరుగుతుండగా వేయించిపెట్టుకున్న ఓట్స్ వేసి బాగా కలిపి మూతపెట్టాలి. ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీర వేసుకుని దింపుకోవాలి. సర్వ్ చేసే ముందుగా జీడిపప్పును గార్నిష్ గా అలంకరించి సర్వ్ చేయాలిం అంతే అంతే...ఓట్స్-జీడిపప్పు ఉప్మా రెడీ.



Click it and Unblock the Notifications











