Latest Updates
-
బంగాళదుంపలు, గుడ్లు ఉడకబెట్టేటప్పుడు ఈ తప్పు చేస్తున్నారా? పర్ఫెక్ట్ గా ఉడికే ట్రిక్ చెప్పిన చెఫ్! -
కాలేయ ఆరోగ్యం కోసం చాణక్యుడు చెప్పిన ఈ రహస్యాలు పాటిస్తున్నారా? -
బరువు తగ్గడానికి బ్రహ్మాస్త్రం.. పరగడుపున అవిసె గింజల నీళ్లు తాగితే పొట్ట మాయం! -
ఫైవ్ స్టార్ రెస్టారెంట్ రుచితో.. ఇంట్లోనే సులభంగా క్రీమీ కోకోనట్ చికెన్ కర్రీ..ఎలా చేసుకోవాలంటే.. -
వడగాల్పుల వేళ జాగ్రత్త! ఎండల నుంచి ప్రాణాలు కాపాడుకోవడం ఎలా? -
అక్షయ తృతీయ రోజున ఈ సమయాల్లో పూజ చేస్తే అదృష్టం మీదే! -
వృషభం, సింహం, ధనుస్సు రాశుల వారికి ఈ వారం రాజయోగం.. మీ జాతకం ఎలా ఉందంటే? - 19 నుండి 25 ఏప్రిల్ 2026 వరకు -
వృషభం, సింహం, ధనస్సు రాశుల వారికి రాజయోగం.. ఆ ఒక్క విషయంలో జాగ్రత్త! - ఆదివారం, 19 ఏప్రిల్ 2026 -
తల్లిదండ్రులూ అలెర్ట్..ఏడాదిలోపు పిల్లలకు పొరపాటున కూడా ఇవి తినిపించొద్దు! -
పెళ్లి గురించి ఎవరూ చెప్పని 5 పచ్చి నిజాలు..ఇవి తెలుసుకోకపోతే కష్టమే!
ఆనియన్ రింగ్స్ : వింటర్ స్పెషల్ స్నాక్
ఈ శీతాకాలపు సాయంత్రాలలో కప్పు వేడి వేడీ కాఫీతో పాటు కరకరలాడుతూ ఉండే స్నాక్స్ ఉంటే బాగుంటుందనుకుంటున్నారా??లేదా ఈ శీతాకాలపు సాయంత్రాలు ఒకవేళ అనుకోకుండా అతిధులొస్తే వేడి వేడిగా కారం కారంగా ఉండే స్నాక్స్
ఈ శీతాకాలపు సాయంత్రాలలో కప్పు వేడి వేడీ కాఫీతో పాటు కరకరలాడుతూ ఉండే స్నాక్స్ ఉంటే బాగుంటుందనుకుంటున్నారా??లేదా ఈ శీతాకాలపు సాయంత్రాలు ఒకవేళ అనుకోకుండా అతిధులొస్తే వేడి వేడిగా కారం కారంగా ఉండే స్నాక్స్ ఏమి చేసి పెట్టాలని ఆలోచిస్తున్నారా?? అదిగో అందుకోసమే మేము మీకు చిటికెలో తయారయ్యే స్నాక్ ఐటెం ఇస్తున్నాము, అదే ఆనియన్ రింగ్స్.దీనికి కావాల్సిన పదార్ధాలు కూడా సులభంగా దొరికేవే.

ఇక వీటి తయారీకి ఏమి కావాలో, ఎలా తయారు చెయ్యాలో చూద్దామా.
ఎంత మందికి సరిపోతుంది-10
ప్రిపరెషన్ టైం-15 నిమిషాలు
కుకింగ్ టైం-10 నిమిషాలు

కావాల్సిన పదార్ధాలు:
ఉల్లిపాయలు-5(విడివిడిగా వచ్చేటట్లు పొరలుగా తరగాలి)
నూనె-వేయించడానికి సరిపడినంత
కారం-1 టీ స్పూను
మైదా-1 1/2 కప్పు
ఎండబెట్టిన మిక్స్డ్ హెర్బ్స్-1 టీ స్పూను

త్రాగే సోడా-2 కప్పులు
ఉప్పు-రుచికి సరిపడా
ఉల్లిపాయ పొడి-1 టీ స్పూను
మిరియాలు-1/2 టీ స్పూను(మెత్తగా దంచుకోవాలి)
బ్రెడ్ క్రంబ్స్-1/2 కప్పూ
ఆవ పొడి-1/2 టీ స్పూను
కారంఫ్లేక్స్-1/2 కప్పు(మెత్తగా పొడి చేసుకోవాలి)
కొత్తిమీర-1 టేబుల్ స్పూను(సన్నగా తరగాలి)

తయారీ విధానం:
1)ఉల్లిపాయలని విడివిడిగా వచ్చేటట్లు పొరలుగా తరగాలి. ఇలా తరిగిన ఉల్లిపాయలని 15 నిమిషాలపాటు చల్లని నీటిలో నానబెట్టాలి.తరువాత నీటిలోనుండీ తీసి కిచెన్ టవల్ మీద ఆరబెట్టాలి.ఆరిన తరువాత ఒక ప్లేటులోకి మార్చి వీటి మీద పిండిని చల్లాలి.అందువల్ల ఎక్కువగా ఉన్న తేమని పిండి పీల్చుకుంటుంది.
2)ఒక పెద్ద గిన్నెలో మైదా,కారం,మిక్స్డ్ హెర్బ్స్,ఉల్లి పొడి,ఆవ పొడి,మిరియాలు,ఉప్పు వేసి అన్నీ బాగా కలిసేటట్లు బాగా కలపాలి.
3)ఈ పిండికి సోడా పోసి ఈ మిశ్రమం ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. పిండి మరీ పల్చగా లేదా చిక్కగా ఉండకూడదు.
4)ఈ పిండిని ఉండలు లేకుండా బాగా కలపాలి.

5)ఒక ప్లేటులో కార్న్ ఫ్లేక్స్ పొడి,బ్రెడ్ పొడి,తరిగిన కొత్తిమీర వేసి బగా కలపాలి.
6)ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి వేడి చెయ్యాలి.
7)పొరలు పొరలుగా తరిగిన ఉల్లిపాయలని ఒకొక్కటిగా ఈ పిండిలో ముంచి బ్రెడ్ క్రంబ్స్ ,కార్న్ ఫ్లేక్స్ పొడిలో దొర్లించి ఉల్లిపాయలకి బ్రెడ్ పొడి బాగా పట్టేటట్లు చూడాలి.

8)ఇలా బ్రెడ్ పొడిలో దొర్లించిన ఉల్లిపాయలని వేడెక్కిన నూనెలో వేసి బంగారు రంగు వచ్చేవరకూ వేయించాలి.
9)వేగాకా నూనెలో నుండి తీసి కిచన్ టవల్ మీద వేస్తే ఆనియన్ రింగ్స్‌లో ఉన్న అధిక నూనెని పీల్చుకుం



Click it and Unblock the Notifications











