Latest Updates
-
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి!
ఆపిల్-ఖర్జూరం ఖీర్ : రంజాన్ స్పెషల్
ఇండియన్ డిజర్ట్స్ లో ఖీర్ చాలా ఫేమస్ వంటకం. ముఖ్యంగా ఖీర్ మన ఇండియాలో ఎక్కువగా ఇష్టపడుతారు. ఖీర్ మన భోజనంలో ఒక స్పెషల్ డిజర్ట్ గా తీసుకోవడం అలనాటి కాలం నుండి ఒక ఆనవాయి. ఒక్క హిందువులకు మాత్రమే కాదు, ముఖ్యంగా ముస్లీములు తయారుచేసే ఖీర్ చాలా అద్భుతంగా రుచికరంగా ఉంటుంది.
ఆపిల్ మరియు డేట్స్ (ఖర్జూరాలతో)తయారుచేసే ఖీర్ చాలా ఆరోగ్యకరం. ముఖ్యంగా రంజాన్ మాసంలో ఉపవాసం ఉన్నవారు ఒక శక్తివంతమైన ఆహారాల్లో డేట్స్ తో తయారుచేసే వంటలు కూడా ఒకటి. డేట్స్ తో తయారుచేసే వంటలకు రంజాన్ మాసంలో చాలా ప్రత్యేకత ఉంది. అంతే కాదు, డయాబెటిక్ ఉన్నవారు కూడా చాలా సంతోషకరంగా తీసుకోగలిగిన డిజర్ట్ ఇది. ఈ ఖీర్ ను లో ఫ్యాట్ మిల్క్ తో తయారుచేస్తారు. ఈ ఖీర్ తయారుచేయడానికి నేచురల్ స్వీట్నర్, వాల్ నట్స్ ఆపిల్స్, వేయడం వల్ల మరింత టేస్టీగా క్రంచీగా ఉంటుంది. మరి ఈ రంజాన్ స్పెషల్ ఆపిల్ డేట్స్ ఖీర్ ను ఎలా తయారుచేయాలో చూద్దాం...
కావలసిన పదార్థాలు:
ఆపిల్ : 1 (సన్నగా తరగాలి)
పంచదార : 1tsp
పాలు : 3cups(ఫ్యాట్ తక్కువ ఉన్నవి)
సన్నగా తరిగిన ఖర్జూరాలు : 1cup
గార్నిషింగ్ కోసం:
వాల్‌నట్స్ : 1tbsp(సన్నగా తరగాలి)
ఆపిల్ : చిన్న ముక్క (సన్నగా తరగాలి)

తయారు చేయు విధానం:
1. ముందుగా నాన్‌స్టిక్ పాత్రలో... ఆపిల్ ముక్కలు, పంచదార, మూడు టేబుల్ స్పూన్ల నీళ్లు వేసి సన్న మంట మీద ఆపకుండా కలుపుతూ, కొద్దిసేపు ఉడికించి దించేయాలి
2. తర్వాత చల్లారాక ఫ్రిజ్‌లో ఉంచాలి.
3. తర్వాత ఒక పాత్రలో పాలు, ఖర్జూరం తరుగు వేసి బాగా కలిపి స్టౌ మీద ఉంచి సన్నని మంట మీద పది నిముషాలు ఆపకుండా కలుపుతూ ఉడికించి దించేయాలి.
4. చల్లారాక ఫ్రిజ్‌లో ఉంచి తీయాలి. సర్వ్ చేసే ముందు ఉడికించిన ఆపిల్ మిశ్రమాన్ని, ఖర్జూరం మిశ్రమానికి జత చేసి నెమ్మదిగా కలపాలి.
5. తర్వత వాల్‌నట్స్ తరుగు, ఆపిల్ ముక్కలతో అలంకరించి చల్లచల్లగా అందించాలి. అంతే ఆపిల్ మరియు డేట్స్ ఖీర్ రెడీ.



Click it and Unblock the Notifications











