Latest Updates
-
నవరాత్రులు 3వ రోజు స్పెషల్..అన్నపూర్ణా దేవి నైవేద్యంగా కమ్మని కొబ్బరి పాయసం..ఇలా చేసుకోండి -
కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? యూరిక్ యాసిడ్ తగ్గాలంటే ఈ 3 ఫుడ్స్ తినకూడదు! -
అక్టోబర్ 12 నుంచి శుక్ర మౌఢ్యమి.. ఈ 5 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి! -
క్రిస్పీ చీజ్ పనీర్ సమోసా..సాయంత్రం వేళ పర్ఫెక్ట్ స్నాక్..ఇలా చేసుకోండి.. -
అందమైన అమ్మాయి పిలిచిందని అర్థరాత్రి రూమ్ కి వెళ్లిన బ్యాంక్ మేనేజర్..తర్వాత ఏమైందంటే..? -
జలుబు, దగ్గును తగ్గించే వెల్లుల్లి మిరియాల అన్నం..జస్ట్ 10 నిమిషాల్లోనే చేసుకోండిలా -
నవరాత్రుల్లో 2వ రోజు ప్రసాదం..శ్రీ గాయత్రీ దేవి నైవేద్యంగా రవ్వ పులిహోర.. ఇలా సింపుల్ గా చేయండి -
Navaratri 2026 Day 2: దసరా నవరాత్రులు 2వ రోజు.. బ్రహ్మచారిణి మాత పూజా విధానం, పురాణ గాథ, మంత్రాలు -
ఆదివారం స్పెషల్ పొటాటో చికెన్ కుర్మా..ఆ సీక్రెట్ పదార్థం కలిపారంటే తిరుగులేని రుచి.. -
Weekly Rasi Phalalu: అక్టోబర్ 11-17 వార ఫలాలు.. ఏ రాశుల వారికి అదృష్టం వరిస్తుందంటే?
రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎంత తిన్నా ఈజీగా బరువు తగ్గించే సొరకాయ చపాతీ.!
బరువు తగ్గాలనుకునేవారి డైట్‌లో చపాతీ ముందుంటుంది. కానీ డైలీ ఒకే టేస్ట్‌లో చపాతీ తినడం బోర్ కదా.. అందుకే ఆలూ పరాటా కూడా అప్పుడప్పుడూ ట్రై చేస్తారు. కానీ ఎప్పుడైనా సొరకాయ చపాతీ ట్రై చేశారా.? నీటి శాతం ఎక్కువగా ఉండే సొరకాయతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. బరువును అదుపులో ఉంచుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అదే విధంగా జీర్ణక్రియకు దోహదపడుతుంది. మరి ఈ సొరకాయతో చపాతీ చేసి తిన్నారంటే.. ఇక రొటీన్ చపాతీల జోలికి వెళ్లరు. చుక్క నీరు కలపకుండా సొరకాయ చపాతీని ఎలా చేయాలో చూద్దాం..

సొరకాయ చపాతీ తయారీకి కావాల్సిన పదార్థాలు
సొరకాయ- ఒకటి
గోధుమ పిండి- రెండు కప్పులు
పచ్చిమిర్చి- రెండు
తరిగిన అల్లం- టీస్పూన్
ఉప్పు- టీస్పూన్
పసుపు- అరటీస్పూన్
కారం- ఒకటిన్నర టీస్పూన్
ధనియాల పొడి- ఒకటిన్నర టీస్పూన్
జీలకర్ర పొడి- ఒకటిన్నర టీస్పూన్
ఆమ్‌చూర్ పొడి- ఒకటిన్నర టీస్పూన్
గరం మసాలా పొడి- అర టీస్పూన్
వాము- పావు టీస్పూన్
కసూరి మేథీ- టీస్పూన్
కొత్తిమీర- గుప్పెడు
నూనె- టీస్పూన్
సొరకాయ చపాతీ తయారీ విధానం
సొరకాయ చపాతీ తయారీ కోసం ముందుగా సొరకాయ తొక్క తీసి కడిగి పెట్టుకోవాలి. తర్వాత గ్రేటర్ సహాయంతో తురుముకోవాలి.
ఈ తురిమిన సొరకాయ మిశ్రమాన్ని ఒక వెడల్పాటి బౌల్‌లోకి తీసుకోండి. ఇందులో చిన్నగా గుండ్రంగా కట్ చేసిన పచ్చిమిర్చి, తురిమిన అల్లం ముద్ద, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, ఆమ్‌చూర్ పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి ఒక్కొక్కటిగా వేసుకోవాలి.
తర్వాత వాము, కసూరి మేథీని అరచేతుల్లో పొడిగా చేసి ఈ మిశ్రమంలో కలపాలి. ఇప్పుడు గోధుమ పిండిని వేసుకోవాలి. కడిగిన కొత్తిమీర వేసి బాగా కలపాలి. సొరకాయలోని నీటి శాతం కారణంగా చుక్క నీరు కూడా కలపకుండా వేళ్లతోనే పిండి ముద్దలాగా చేసుకోవాలి.

చివర్లో కొద్దిగా నూనె వేసి మరోసారి కలిపి సాఫ్ట్ ముద్దలాగా చేసుకోవాలి. పదినిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు వీటిని చపాతీ సైజ్ ముద్దలుగా చేసుకుని పొడి పిండి సహాయంతో చపాతీలు చేసుకోవాలి. అన్నీ చేసుకుని పక్కన పెట్టిన తర్వాత స్టవ్‌పైన పాన్ పెట్టి ఒక్కొక్కటిగా కాల్చుకోవాలి. కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోవడం ద్వారా చపాతీలు పొంగుతూ కాలుతాయి.
రక్తం పట్టడానికి, ఉక్కు లాంటి ఎముకల కోసం తప్పక తినాల్సిన పాత కాలం నాటి బలమైన స్వీట్.!
అంతే రుచికరమైన టేస్టీ సొరకాయ చపాతీలు రెడీ. వీటిని ఏదైనా కర్రీ, పప్పు లేదా పెరుగుతో లాగించేయొచ్చు. బ్రేక్‌ఫాస్ట్ లేదా డిన్నర్‌లోకి ఈ రెసిపీ బెస్ట్ ఛాయిస్..
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
