Latest Updates
-
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. నోరూరించే సొరకాయ పకోడీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
సొరకాయతో రుచికరమైన వంటకాలతో పాటు క్రిస్పీ గారెలు, టేస్టీ హల్వా తయారుచేయడం మనందరికీ తెలిసిందే. అయితే సొరకాయ పకోడీ గురించి ఎప్పుడైనా విన్నారా? సాయంత్రం వేళ వేడివేడి టీతో పాటు కరకరలాడే స్నాక్స్ తినాలనిపిస్తే, మీ ఇంట్లో సొరకాయ పకోడీ ట్రై చేయండి.
బయట వైపు ఎంతో కరకరలాడుతూ, లోపల నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత మెత్తగా ఉండే ఈ పకోడీల రుచికి ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. దీనికి ఎక్కువ సమయం గానీ, భారీగా పదార్థాలు గానీ అవసరం లేదు. కేవలం మన వంటగదిలో ఉండే వాటితో క్షణాల్లో వీటిని తయారుచేయవచ్చు.

సొరకాయ పకోడీ తయారీకి కావలసిన పదార్థాలు
లేత సొరకాయ తురుము - 1 కప్పు
ఉల్లిపాయ ముక్కలు - అర కప్పు
శనగపిండి - అర కప్పు
బొంబాయి రవ్వ - 2 టేబుల్ స్పూన్లు
పెరుగు - 2 టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి - 2 (సన్నగా తరగాలి)
కొత్తిమీర తరుగు - కొద్దిగా
కారం - 1 టీస్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
ఓరిగానో - అర టీస్పూన్
చిల్లీ ఫ్లేక్స్ (మిరప తురుము) - అర టీస్పూన్
ఉప్పు - రుచికి తగినంత
నూనె - వేయించడానికి సరిపడా
సొరకాయ పకోడీ తయారీ విధానం
-ముందుగా లేత సొరకాయను తీసుకుని శుభ్రంగా కడిగి సన్నగా తురుముకోవాలి.
-ఇప్పుడు ఒక లోతైన గిన్నె తీసుకుని, అందులో సొరకాయ తురుము, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, శనగపిండి, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తరుగు, రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. పకోడీలు కరకరలాడుతూ రావాలంటే ఇందులో కచ్చితంగా 'బొంబాయి రవ్వ'ను కలపాలి. ఆ తర్వాత కారం, ధనియాల పొడి, ఓరిగానో, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు వేసి అన్ని పదార్థాలు కలిసేలా మిక్స్ చేయాలి. అవసరమైతే కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ పకోడీల పిండిలా చిక్కగా కలుపుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి, డీప్ ఫ్రైకి సరిపడా నూనెతో బాండీ పెట్టుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి, ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కొద్దికొద్దిగా తీసుకుంటూ పకోడీల్లా నూనెలో వేయాలి. ఇవి రెండు వైపులా చక్కటి బంగారు గోధుమ రంగులోకి మారి, కరకరలాడేలా వేయించుకోవాలి.
-బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్ లో పేపర్ నాప్ కిన్ పరుచుకుని, దానిపైకి పకోడీలను తీసుకోవాలి. దీనివల్ల అదనపు నూనె అంతా పోతుంది.
-అంతే ఎంతో రుచికరమైన వేడివేడి సొరకాయ పకోడీలు రెడీ. పచ్చి కొత్తిమీర చట్నీతో లేదా టమాటా సాస్‌తో ఆస్వాదించండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
