Latest Updates
-
విటమిన్ B12 లోపానికి చెక్, నరాల వీక్నెస్ తగ్గించే మేక లివర్ కర్రీ..ఎలా చేసుకోవాలంటే.. -
రాగి జావ తాగుతున్నారా? ఈ నిజం తెలియకపోతే ఎంత తాగినా వేస్ట్! -
ప్రభుత్వ హాస్పిటల్స్ దుస్థితికి ఇదే నిదర్శనం.. ట్రీట్మెంట్ కోసం ప్రైవేట్ హాస్పిటల్ కి ఎయిమ్స్ డైరెక్టర్! -
మెతుకు మిగల్చకుండా తినే రుచి..తమిళనాడు స్పెషల్ దిండిగల్ తలపకట్టి చికెన్ బిర్యానీ ఇంట్లోనే చేసుకోండిలా.. -
క్రంచీ, టేస్టీ జీడిపప్పు పకోడి..మస్త్ కిక్కిచ్చే స్నాక్ ఈజీగా చేసుకోండిలా.. -
కరివేపాకు మరమరాలు..మూవీ, వెబ్ సిరీస్ చూస్తూ తినడానికి బెస్ట్ టేస్టీ,హెల్తీ స్నాక్ ! -
డీప్ ఫ్రై లేని హెల్తీ స్నాక్..సూపర్ టేస్టీ సగ్గుబియ్యం పొంగనాలు ఈజీగా ఇంట్లో చేసుకోండిలా.. -
ఈ చిన్న సీక్రెట్ తెలిస్తే..ఇంట్లోనే క్షణాల్లో రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ,సాఫ్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ -
వంకాయ దోసకాయ పచ్చడి..ఏంట టేస్ట్ రా బాబు మైండ్ నుంచి పోవట్లేదు అనాల్సిందే! -
తల్లిదండ్రులూ బీ అలర్ట్..పిల్లలకు సిరప్ వేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి
పోషకాలు పుష్కలంగా, రుచి అత్యద్భుతంగా..సొరకాయ రొట్టెలు ఈజీగా చేసుకోండిలా
సొరకాయతో రచికరమైన కూరలే కాకుండా టేస్టీ స్నాక్స్, స్వీట్లు కూడా తయారుచేసుకోవచ్చు. సోరకాయతో వడలు, గారెలు, పాయసం ఇలా చాలామంది చేసుకుంటుంటారు. అయితే మీరెప్పుడైనా సొరకాయ సగ్గుబియ్యం కాంబినేషన్ తో రొట్టెలు చేశారా? ఏదైనా కొత్తగా తినాలనిపించినప్పుడు ఇలా చేసి పెడితే ఇంటిళ్లపాదీ ఎంతో ఇష్టంగా తింటారు. దీనికి సైడ్ డిష్ గా పెరుగు చట్నీ ఉంటే టేస్ట్ అదరహో అనిపిస్తుంది. టేస్టీ సొరకాయ సగ్గుబియ్యం రొట్టెలు తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.
సొరకాయ సగ్గుబియ్యం రొట్టె తయారీకి కావాల్సిన పదార్థాలు
-వేరుశెనగపప్పు
-సొరకాయ తురుము
-బంగాళదుంప
-జీలకర్ర
-పెరుగు
-తాలింపు గింజలు
-సగ్గుబియ్యం
-కొత్తిమీర
-ఉప్పు
-నూనె(కాల్చుకోడానికి)

సొరకాయ సగ్గుబియ్యం రొట్టె తయారీ విధానం
-ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకోండి. అందులో 1 కప్పు సగ్గుబియ్యం వేసుకోండి, ఇందులో నీళ్లు పోసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. తర్వాత అందులో 1 కప్పు గోరువెచ్చని నీళ్లు పోసి సగ్గుబియ్యం 10 నిమిషాలు నానబెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో పావు కప్పు వేరుశెనగపప్పులు(పల్లీలు)వేసి వేయించి తర్వాత వాటిని మిక్సీ జార్ లో వేసి గ్రైండ్ చేసి ఆ పొడిని పక్కన పెట్టుకోండి.
-ఈలోగా 300 గ్రాముల సొరకాయలను గ్రేటర్ తో తురుముకోవాలి. తర్వాత చేత్తో సొరకాయ తురుముని నీరు లేకుండా బాగా పిండేసుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ పోసుకుని వేడయ్యాక అందులో 1 టీస్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత అందులో సొరకాయ తురుము వేసి మీడియం మంట మీద 2 నిమిషాలు పచ్చివాసన పోయేదాకా వేయించి స్టవ్ ఆపేసి దానిని చల్లారనివ్వాలి.
విటమిన్ B12 లోపానికి చెక్, నరాల వీక్నెస్ తగ్గించే మేక లివర్ కర్రీ..ఎలా చేసుకోవాలంటే..
-తర్వాత నానిన సగ్గుబియ్యం ఒక పెద్ద గిన్నెలో వేసుకోండి. ఇందులోనే వేయించిన సొరకాయ తురుము, 1పెద్ద ఉడికించిన బంగాళదుంప తురుము లేదా నలిపి అయినా, వేయించి గ్రైండ్ చేసుకున్న పల్లీల పొడి, 2 పచ్చిమిరపకాయల సన్నని తరుగు, కొత్తిమీర తరుగు, రుచికి తగినంత ఉప్పు వేసి ఈ మిశ్రమం మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇందులో నీళ్లు పోయనక్కర్లేదు..అందులోనే తేమ సరిపోతుంది.
-తర్వాత మరో గిన్నెలో ఒక కప్పు పెరుగు వేసి, అందులో ముందుగా వేయించిన సొరకాయ ఫ్రైలో కొద్దిగా వేసి పెరుగుతో దాన్ని కలిసేలా కలుపుకోండి. తర్వాత తాలింపు పెట్టుకుని దాన్ని ఇందులో వేసి కలపండి. ఈ పెరుగు చట్నీ సొరకాయ రొట్టెతో సైడ్ డిష్ గా తినడానికి బాగుంటుంది. దీనిని పక్కన పెట్టుకోండి.
-తర్వాత ఒక అరిటాకు తీసుకొని దానిమీద కొంచెం నూనె వేసి మొత్తం రుద్దండి, తర్వాత సగ్గుబియ్యం మిశ్రం కొంచెం చేతుల్లోకి తీసుకుని అరటిఆకు లేదా బటర్ పేపర్ మీద పెట్టి రొట్టెలా ఒత్తుకోవాలి.
-తర్వత స్టవ్ మీద పెనం పెట్టుకోండి. దాని మీద ఆయిల్ వేసి రుద్ది తర్వాత ఒత్తుకున్న రొట్టెను దానిమీద వేసి మీడియం మంట మీద రెండు వైపులా మంచి కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి.
-అయితే ఇదే సగ్గుబియ్యం మిశ్రమంలో బోండాలు మాదిరిగా కూడా చేసుకోవచ్చు. డీప్ ఫ్రై చేసిన నూనెలో సగ్గుబియ్యం మిశ్రం కొంచెం చేతుల్లోకి తీసుకుని రౌండ్ గా నలుపుకుని నూనెలో వేసి వేయించుకోవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
