Latest Updates
-
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి!
క్యారెట్-ఓట్ మీల్ సూప్: వింటర్ స్పెషల్
వింటర్ లో చలి... గిలి... ముఖ్యంగా ఆహారం మీద ఆసక్తిని తగ్గిస్తుంది. వేడి వేడిగా ఏదైనా తినాలి, ఏదైనా తాగాలి అనిపస్తుంటుంది. అయితే సరిగ్గా ఆహారం తీసుకోక పోవటం వల్ల శరీరానికి తగిన పోషకాలు అందక, అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. దీనికో చక్కని పరిష్కారం సూప్. వేడి వేడిగా ఓ కప్పు సూప్ తాగితే నీరసమూ ఎగిరపోతుంది. శరీరానికి కావలసిన పోషకాలూ అందుతాయి. సూప్ ఒత్తిడిని తొగించి హృదయాన్ని తేలికపరుస్తుంది. ఆహారాన్ని తీసుకోవాలనే ఆత్రుతను రేపుతుంది.
చలికాలంలో వేడి వేడిగా ఈ సూప్ భలే మజా ఇస్తుంది. ఈ సూప్ ను ఏ వేళలో( బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్) అయినా సరే తీసుకోవచ్చు. పిల్లలు పెద్దలు అమితంగా ఇష్టపడే ఈ క్యారెట్ మరియు ఓట్ మీల్ సూప్ బరువును తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంచుతుంది. మరి ఈ హెల్తీ వింటర్ సూప్ ఎలా తయారు చేయాలో చూద్దాం...

కావలసిన పదార్థాలు:
ఓట్‌స : 1/4cup
క్యారట్: 2
ఉల్లిపాయ : 1 చిన్నది
వెన్న : కొద్దిగా
ఉప్పు : రుచికి తగినంత
మిరియాలపొడి: చిటికెడు
కొత్తిమీర : కొద్దిగా
తయారీ విధానం:
1. ముందుగా క్యారట్ చెక్కు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
2. తర్వాత ఒక గిన్నెలో రెండు కప్పుల నీళ్లు పోసి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసి మెత్తబడేవరకు ఉడికించాలి.
3. తర్వాత స్టౌ ఆఫ్ చేసి, క్రిందికి దించి పెట్టుకోవాలి. చల్లారాక మిక్సీ జార్ లో వేసి గ్రైండ్ చేసుకుని వడకట్టుకోవాలి. ః
4. ఇప్పుడు పాన్ లో వెన్న వేడి చేసి ఓట్ మీట్ వేసి దోరగా వేయించాలి.
5. తర్వాత అందులోనే నీళ్ళు పోసి రెండు-మూడు నిమిషాలు మీడియం మంట మీద ఉడికించాలి.
6. ఓట్స్ ఉడికిన తర్వాత అందులో ముందుగా తయారుచేసి పెట్టుకొన్న క్యారట్ రసం, తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసి కాస్త చిక్కబడేవరకు మరిగించాలి. ఇందులో టమాటా లేదా చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు. రుచికరంగా చలికి, ఘాటుఘాటుగా ఉంటూ గొంతులో కమ్మగా దింగుతుంది.



Click it and Unblock the Notifications











