Latest Updates
-
ప్రభుత్వ హాస్పిటల్స్ దుస్థితికి ఇదే నిదర్శనం.. ట్రీట్మెంట్ కోసం ప్రైవేట్ హాస్పిటల్ కి ఎయిమ్స్ డైరెక్టర్! -
మెతుకు మిగల్చకుండా తినే రుచి..తమిళనాడు స్పెషల్ దిండిగల్ తలపకట్టి చికెన్ బిర్యానీ ఇంట్లోనే చేసుకోండిలా.. -
క్రంచీ, టేస్టీ జీడిపప్పు పకోడి..మస్త్ కిక్కిచ్చే స్నాక్ ఈజీగా చేసుకోండిలా.. -
కరివేపాకు మరమరాలు..మూవీ, వెబ్ సిరీస్ చూస్తూ తినడానికి బెస్ట్ టేస్టీ,హెల్తీ స్నాక్ ! -
డీప్ ఫ్రై లేని హెల్తీ స్నాక్..సూపర్ టేస్టీ సగ్గుబియ్యం పొంగనాలు ఈజీగా ఇంట్లో చేసుకోండిలా.. -
ఈ చిన్న సీక్రెట్ తెలిస్తే..ఇంట్లోనే క్షణాల్లో రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ,సాఫ్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ -
వంకాయ దోసకాయ పచ్చడి..ఏంట టేస్ట్ రా బాబు మైండ్ నుంచి పోవట్లేదు అనాల్సిందే! -
తల్లిదండ్రులూ బీ అలర్ట్..పిల్లలకు సిరప్ వేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి -
భూటాన్ స్పెషల్ ఎగ్ ఏమా దత్షీ..స్వర్గానికి బెత్తెడే దూరం! -
పండుగ రోజే దారుణం..భర్త డోర్ ఓపెన్ చేయగానే ప్రియుడితో సరసాలాడుతూ భార్య..రెండ్ హ్యాండెడ్ గా దొరకడంతో..
రెస్టారెంట్ స్టైల్ తవా చికెన్..వేళ్లు నాకుతూ తినడం గ్యారెంటీ..ఈజీగా చేసుకోండిలా..
మనం హోటల్ లేదా రెస్టారెంట్ కు వెళ్లినప్పుడు మెనూ
చూడగానే నాన్ వెజ్ తినేవాళ్లయితే ముందుగా ఆర్డర్ చేయాలనిపించేది
చికెన్ వంటకాలే. పిల్లలైనా, పెద్దలైనా చికెన్ పేరు వినగానే
లొట్టలేసుకుంటూ తింటారు. అయితే రెస్టారెంట్లో దొరికే ఆ అద్భుతమైన
రుచిని మన ఇంట్లో కూడా ఆస్వాదించాలనుకుంటే తవా చికెన్ బెస్ట్ ఆప్షన్.
చాలా త్వరగా, కేవలం కొద్ది నిమిషాల్లోనే తయారు చేసుకోగలిగే అద్భుతమైన
వంటకం ఇది. ఘుమఘుమలాడే రెస్టారెంట్ స్టైల్ తవా చికెన్ ఫ్రై మీ
ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

తవా చికెన్ తయారీకి కావలసిన పదార్థాలు
ఎముకలు లేని చికెన్ (బోన్ లెస్ థై పీసెస్) - 500
గ్రాములు
టమాటాలు - 2
పచ్చిమిర్చి - 3
తరిగిన అల్లం, వెల్లుల్లి - చెరో 1 టీస్పూన్
పసుపు - అర టీస్పూన్
కారం - 1 టీస్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
జీలకర్ర పొడి -అర టీస్పూన్
గరం మసాలా - ముప్పావు టీస్పూన్
వంటనూనె - 3 టేబుల్ స్పూన్లు
తరిగిన కొత్తిమీర - 1 కప్పు
కసూరి మెంతి - 1 టీస్పూన్
పొడవుగా తరిగిన అల్లం- 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
రెస్టారెంట్ స్టైల్ గ్రీన్ చిల్లీ చికెన్.. ఇంట్లోనే పక్కా లోకల్ ఫ్లేవర్ తో ఇలా చేసేయండి!
తవా చికెన్ తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి, ఒక వెడల్పాటి పెనం (తవా) పెట్టుకోండి. అందులో నూనె వేసి వేడయ్యాక, సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి ముక్కలను వేసి తక్కువ మంటపై ఓ నిమిషం పాటు వేయించండి. కమ్మని సువాసన వస్తుండగా.. కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలను అందులో వేయండి.
-ఇప్పుడు మంటను హై ఫ్లేమ్ లో ఉంచి చికెన్ ముక్కల రంగు మారేంత వరకు సుమారు 5 నిమిషాల పాటు బాగా వేయించాలి. ఆ తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, సరిపడా ఉప్పు వేసి చికెన్ కు మసాలాలు పట్టేలా బాగా కలపాలి. మసాలా మాడకుండా ఉండటానికి కొద్దిగా నీళ్లు చల్లి, మీడియం మంట మీద మరో 3 నిమిషాలు వేయించాలి.
-ఇప్పుడు అందులో సన్నగా తరిగిన టమాటా ముక్కలను వేసి, అవి మెత్తబడే వరకు 3-4 నిమిషాలు ఉడికించండి. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు చల్లి, మూతపెట్టి, టమాటాలు గుజ్జులా మారి నూనె పైకి తేలేవరకు సుమారు 10 నిమిషాలు తక్కువ మంటపై ఉడికించాలి. ఆ తర్వాత చేతితో నలిపిన కసూరి మెంతిని చల్లి మరో రెండు నిమిషాలు మగ్గనివ్వాలి.
-చికెన్ చక్కగా ఉడికిన తర్వాత, పొడవుగా తరిగిన అల్లం ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు వేసి కలపాలి. ఇవి చికెన్ కు అదనపు రుచిని, ఘాటును ఇస్తాయి.
-చివరగా కొత్తిమీరను పైన చల్లి, మీడియం మంటపై రెండు నిమిషాలు వేయించి స్టవ్ ఆపేయండి.
-అంతే తవా చికెన్ ఫ్రై రెడీ. వేడివేడి నాన్, చపాతీ, బటర్ రోటీ లేదా పుల్కాతో దీన్ని వడ్డిస్తే.. మీ ఇంట్లో వాళ్లంతా వేళ్లు నాకుతూ తింటారు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
