Latest Updates
-
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే!
ముల్లంగితో చట్నీ ఇలా చేస్తే రుచి అమోఘం..పచ్చి వాసన అస్సలు రాదు..ఇడ్లీ,దోసెల్లోకి కేక!
ఇడ్లీ, దోసె, వడ ఇలా టిఫిన్ ఏదైనా సరే పక్కన పల్లీ చట్నీయో, కొబ్బరి చట్నీయో, లేదా అల్లం పచ్చడో చేయడం మనకు అలవాటు. కానీ రోజూ ఒకే రకమైన చట్నీలు తిని బోర్ కొడుతోందా? అయితే, ఈసారి కాస్త కొత్తగా, ఆరోగ్యకరంగా ముల్లంగి చట్నీ ట్రై చేయండి.అమ్మో ముల్లంగి చట్నీనా? ఆ వాసన అంటేనే మా ఇంట్లో ఎవరూ తినరు అని కంగారు పడుతున్నారా? అస్సలు చింతించకండి.
సరికొత్తగా చేసే ఈ చట్నీలో ముల్లంగి వాసన ఇసుమంతైనా ఉండదు సరికదా.. అసలు ఇది ముల్లంగితో చేసిన చట్నీ అంటే మీ ఇంట్లో వాళ్ళు నమ్మరు కూడా. అంత రుచిగా, కమ్మగా, కాస్త కారంగా నోటికి తగులుతూ అద్భుతంగా ఉంటుంది. ఇడ్లీ దోసెల్లోకి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే ఈ ముల్లంగి చట్నీని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావాల్సిన పదార్థాలు
ముల్లంగి: 150 గ్రాములు
నూనె: 3 టేబుల్ స్పూన్లు
మినప్పప్పు: 2 టేబుల్ స్పూన్లు
ఎండు మిరపకాయలు: 5
సాంబార్ ఉల్లిపాయ: 15-20
వెల్లుల్లి రెబ్బలు: 10
టమోటా: 1
కరివేపాకు: 1 రెమ్మ
కొత్తిమీర: గుప్పెడు
చింతపండు: చిన్న ఉసిరికాయంత
ఉప్పు: రుచికి సరిపడా
తాలింపుకి నూనె: 1 టీస్పూన్
ఆవాలు: 1/2 టీస్పూన్
మినప్పప్పు: 1/2 టీస్పూన్
కరివేపాకు: కొద్దిగా
పసుపు : చిటికెడు
తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టి అందులో 2 టీస్పూన్ల నూనె వేసి వేడెక్కాక కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి ముక్కలను వేయాలి. ముల్లంగిలో ఉండే పచ్చి వాసన పోయి, ముక్కలు కాస్త రంగు మారే వరకు మీడియం మంటపై దోరగా వేయించుకోవాలి.
-వేగిన ముక్కలను ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు అదే బాండీలో మరో టీస్పూన్ నూనె వేసి మినప్పప్పు, ఎండు మిరపకాయలు వేసి దోరగా వేయించండి. పప్పులు ఎర్రగా వేగిన తర్వాత సాంబార్ ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకోవాలి.
-ఉల్లిపాయలు వేగాక కట్ చేసిన టమోటా ముక్కలను వేసి కలపాలి. టమోటాలు పూర్తిగా మగ్గి మెత్తగా అయ్యే వరకు మూత పెట్టి ఉడికించండి.
-టమోటాలు మగ్గిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసి ఒక్క నిమిషం పాటు వేయించాక ముందుగా వేయించి పెట్టుకున్న ముల్లంగి ముక్కలను కూడా బాండీలో కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వండి.
-మిశ్రమం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లోకి తీసుకోండి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, చిన్న ముక్క చింతపండు వేసి, అవసరమైతే కొద్దిగా నీరు పోసి మెత్తగా లేదా కాస్త బరకగా మిక్సీ పట్టుకోండి.
-చివరిగా స్టవ్ మీద చిన్న కడాయి పెట్టి నూనె వేసి ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు, చిటికెడు పసుపు వేసి తాలింపు వేయండి. ఈ తాలింపును చట్నీలో కలిపేయండి.
-అంతే ఎంతో రుచికరమైన, ఘాటైన ముల్లంగి చట్నీ రెడీ. వేడి వేడి ఇడ్లీలోకైనా, క్రిస్పీ దోసెలోకైనా ఈ చట్నీ వేసుకుని తింటే అమృతంలా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications






