Latest Updates
-
వెల్లుల్లి ఘాటు,టమాటా పులుపు,గుడ్డు కమ్మదనం.. నోరూరించే టమాటా గార్లిక్ ఎగ్ రైస్! -
రోజువారీ ఆహారంలో వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారా.?.. మీ కిడ్నీలు రిస్క్‌లో పడినట్లే.! -
ప్రేమకు, పెళ్లికి జెన్ జీ యువత ఎందుకు దూరమవుతోంది? -
భాగస్వామి ఎంపిక విషయంలో పదే పదే తప్పు చేస్తున్నారా.. మిమ్మల్ని ఇరకాటంలో పెట్టే విషయాలివే.! -
మధ్యాహ్నం 12 లేదా 2 గంటలకే చెక్ ఇన్..హోటల్స్ ఫాలో అయ్యే రూల్ వెనుక అసలు కథ! -
బఠానీ, పెసరపప్పు కాంబినేషన్... ఈ సమోసా రుచి చూస్తే మళ్లీ మళ్లీ తింటారు! -
వ్యాయామం చేసటప్పుడు విపరీతంగా చెమట.. కొవ్వు కరిగిపోతుందని అస్సలు సంబరపడొద్దు.! -
ఉదయం లేవగానే ఒళ్లు నొప్పులు, జాయింట్స్ పట్టేస్తున్నాయా? -
పప్పులు నానబెట్టే పనిలేదు,రుబ్బే శ్రమలేదు..అటుకులు,బంగాళదుంపలతో క్షణాల్లో కరకరలాడే అప్పడాలు.. -
ప్రెగ్నెన్సీలో చర్మం ఎందుకు నల్లబడుతుందో తెలుసా.. పిగ్మెంటేషన్‌ను ఇలా పోగొట్టుకోండి.!
ఇడ్లీ, దోశ, చపాతీ, అన్నం..అన్నింటికీ అద్భుతమైన రుచినిచ్చే ఉల్లిపాయ కుర్మా..ఎలా చేసుకోవాలంటే
ఇడ్లీ, దోశ, చపాతీ, పలావ్ వంటి వంటకాలు చేసుకున్నప్పుడు, వాటిలోకి ఎప్పుడూ తినే చట్నీలు కాకుండా కాస్త వైవిధ్యంగా, రుచికరంగా ఏదైనా ఉంటే బాగుండు అనిపిస్తుందా? మీ వంటింట్లో ఉండే సాధారణ పదార్థాలతోనే ఎంతో రుచికరంగా చేసుకోగలిగే వంటకమే ఉల్లిపాయ కుర్మా. దీనిని ఉల్లిపాయ గొజ్జు అని కూడా పిలుస్తుంటారు.
ఇది దోశ, చపాతీ, పూరీ వంటి అన్ని రకాల టిఫిన్స్ తో పాటు అన్నంలోకి కూడా అద్భుతమైన కాంబినేషన్. మరి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు లేదా తక్కువ సమయంలో మంచి రుచిని కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
ఉల్లిపాయలు - 4
టమోటాలు - 2
వెల్లుల్లి రెబ్బలు - 6
చింతపండు -నిమ్మకాయ సైజు
బెల్లం - 1 టేబుల్ స్పూన్
సాంబార్ పొడి - 1 స్పూన్
ధనియాల పొడి - 1 స్పూన్
కారం - రుచికి తగినంత
పసుపు - చిటికెడు
ఉప్పు - రుచికి తగినంత
నూనె - సరిపడా
పోపు దినుసులు: ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇంగువ
కరివేపాకు - రెండు రెమ్మలు
కొత్తిమీర - కొద్దిగా
తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి.
-నూనె వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, చిటికెడు మెంతులు వేసి వేయించాలి. ఇవి చిటపటలాడాక, కొంచెం ఇంగువ,తాజా కరివేపాకు వేయాలి. ఈ పోపు మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి.
-ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, దంచిన వెల్లుల్లి రెబ్బలను కడాయిలో వేయాలి. ఉల్లిపాయలు పచ్చి వాసన పోయి, లేత బంగారు రంగులోకి వచ్చే వరకు సుమారు 1-2 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై వేయించుకోవాలి.
-ఉల్లిపాయలు వేగాక అందులో చిటికెడు పసుపు, రుచికి సరిపడా కారం, ధనియాల పొడి, సాంబార్ పొడి, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మసాలాలన్నీ ఉల్లిపాయలకు పట్టేలా ఒక నిమిషం పాటు వేయించాలి.
-ఇప్పుడు రెండు టమోటాలను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి. ఈ టమోటా మిశ్రమాన్ని కడాయిలో వేసి బాగా కలిపి మూత పెట్టి, నూనె పైకి తేలేంత వరకు సుమారు 2 నిమిషాల పాటు చిన్న మంటపై ఉడికించాలి.
-గ్రేవీ దగ్గర పడ్డాక ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు రసాన్ని పాన్ లో పోయాలి. అలాగే గ్రేవీ చిక్కదనం కోసం అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసుకోవచ్చు. ఇప్పుడు పులుపును బ్యాలెన్స్ చేయడానికి ఒక స్పూన్ తురిమిన బెల్లం వేసి కలిపి మూత పెట్టి మరో 2-3 నిమిషాలు ఉడికించాలి.
-గ్రేవీ చిక్కబడి, మంచి సువాసన వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీరను చల్లుకుని దింపేయాలి. అంతే ఎంతో రుచికరమైన, ఘుమఘుమలాడే ఉల్లిపాయ కుర్మా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications