స్పినాచ్ మరియు ఫెటా ఫలాఫెల్ బైట్స్ రెసిపీ

Posted By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

వర్షాకాలం రాబోతోంది. ఈ వర్షాకాలంలో వేడివేడివి తింటూ ఉంటే ఆహ్లాదంగా ఉంటుంది. వేడివేడి టీ తీసుకుంటూ పక్కనే స్పైసీ స్నాక్స్ ని తీసుకుంటూ ఉంటే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. ఇప్పుడు, టీ తో పాటు అమోఘమైన హాట్ ఛీజీ స్పినాచ్ మరియు ఫలాఫెల్ బైట్స్ ని ప్రయత్నిద్దాం. ఫెటా ఛీజ్ ని స్పినాచ్ మరియు ఫలాఫెల్ తో కలిపి డీప్ ఫ్రై ని చేయడం ద్వారా ఈ అమోఘమైన స్నాక్ ను తయారుచేసుకోవచ్చు. వీటిని, డీప్ ఫ్రై కాకుండా ఎయిర్ ఫ్రై చేయడం ద్వారా కేలరీల కౌంట్ ను తగ్గించుకోవచ్చు. మీ స్నేహితులకి మీరు కిట్టీ పార్టీని అందించేటప్పుడు ఈ రెసిపీని ప్రయత్నించి వారికి వడ్డించి వారందరి అభినందనలు పొందండి.

 Spinach And Feta Falafel Recipe | How To Prepare Spinach And Feta Falafel | Spinach And Feta Falafel Bites
స్పినాచ్ అండ్ ఫెటా ఫలాఫెల్ రెసిపీ | స్పినాచ్ అండ్ ఫెటా ఫలాఫెల్ రెసిపీని తయారుచేసే విధానం | స్పినాచ్ అండ్ ఫెటా ఫలాఫెల్ బైట్స్
స్పినాచ్ అండ్ ఫెటా ఫలాఫెల్ రెసిపీ | స్పినాచ్ అండ్ ఫెటా ఫలాఫెల్ రెసిపీని తయారుచేసే విధానం | స్పినాచ్ అండ్ ఫెటా ఫలాఫెల్ బైట్స్
Prep Time
30 Mins
Cook Time
25M
Total Time
55 Mins

Recipe By: పూజా గుప్తా

Recipe Type: స్నాక్స్

Serves: 3-4

Ingredients
 • బేబీ స్పినాచ్ - 2-3 కప్స్

  నానబెట్టి వడగట్టిన చిక్పీస్ - అర కేజీ

  ఫెటా ఛీజ్ - 1 కప్పు

  జీలకర్ర - 2 టీస్పూన్స్

  సాదా పిండి - ఒక కప్పు

  వెజిటబుల్ ఆయిల్ - వేపుడుకి అవసరమైనంత

  తగినంత తజకీ

Red Rice Kanda Poha
How to Prepare
 • ఒక చిల్లుల గిన్నె(కోలాండర్)లో బేబీ స్పినాచ్ ని తీసుకుని దానిపై మరుగుతున్న నీటిని పోయండి.

  నీరు చల్లబడిన తరువాత స్పినాచ్ పై నున్న అదనపు నీటిని పిండండి.

  ఇప్పుడు, నానబెట్టిన చిక్ పీస్, ఫెటా, జీలకర్ర మరియు సాదా పిండితో పాటు స్పినాచ్ ని ఫుడ్ ప్రోసెస్సర్ లో వేసి మెత్తగా నూరుకోండి.

  ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తీసుకుని ఒక టేబుల్ స్పూన్ సైజ్ బాల్స్ ని తయారుచేసుకోండి. చేతులకు అంటుకోకుండా ముందుగా కాస్తంత పొడిని చేతులకు అడ్డుకుని ఈ బాల్స్ ని తయారుచేయండి. ఇప్పుడు వాటిని చదును చేయండి.

  వెజిటబుల్ ఆయిల్ లో వీటిని రెండు నుంచి మూడు నిమిషాల వరకు వేచండి. ఆ తరువాత వీటిని చల్లారనివ్వండి.

  ఇప్పుడు వీటిని బేకింగ్ ట్రే పైన పెట్టి క్లింగ్ ఫిలిం తో కప్పి ఉంచి ఫ్రీజ్ అవనివ్వండి.

  వడ్డించడానికి వీటిని రాత్రంతా ఫ్రిడ్జ్ లో డీఫ్రాస్ట్ చేసుకోండి ఆ తరువాత 180C/160C fan/ gas లో అయిదు నుంచి పది నిమిషాల పాటు కుక్ చేయండి.

  తజకితో దీనిని సర్వ్ చేసుకోండి.

  ఇవి 3 నెలల వరకు ఫ్రోజెన్ గా నిల్వవుంటాయి.

  బేకింగ్ ట్రేస్ లేకపోతే, ఈ కాన్ఫెస్ అనేవి సాలిడ్ గా ఫ్రోజెన్ అయ్యాక వీటిని ఫ్రీజర్ బ్యాగ్స్ లోకి మార్చుకోండి.

  వీటిని సరిగ్గా వ్రాప్ చేయండి. తద్వారా, ఇవి ఎక్కువ కాలం నిలువ ఉంటాయి.

  వీటిని కరెక్ట్ గా లేబుల్ చేయండి.

Instructions
 • స్పినాచ్ నుంచి నీటిని మొత్తం పిండి వేయాలి. లేదంటే, ఫలాఫెల్ అనేది జారుగా అవుతుంది.
Nutritional Information
 • సెర్వింగ్ సైజ్ - 2 బాల్స్
 • కేలరీలు - 49
 • ఫ్యాట్ - 3 గ్రాములు
 • ప్రోటీన్ - 2 గ్రాములు
 • కార్బోహైడ్రేట్స్ - 5 గ్రాములు
 • డైటరీ ఫైబర్ - 1 గ్రాము
[ 3.5 of 5 - 37 Users]