పైన క్రిస్పీగా.. లోపల సాఫ్ట్‌ గా.. సాయంత్రం పూట వేడివేడి పనీర్ ఫింగర్స్ చేసుకోండిలా..

Posted By:

సాధారణంగా సాయంత్రం అవగానే మనకు ఏదైనా క్రిస్పీగా,వేడివేడిగా తినాలనిపిస్తుంటది. ఈ క్రమంలో చాలామంది బోండాలు, సమోసాలు, బజ్జీలు, వడలు వంటివి తింటుంటారు. అయితే ఆరోగ్యానికి మేలు చేసేలా, టేస్టీగా ఏదైనా తినాలుంటే ఓ సారి పనీర్ ఫింగర్స్ ట్రై చేయండి. దీనిని చాలా ఈజీగా ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు.

పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌ గా ఉంటూ నోట్లో వేస్తే కరిగిపోయే ఈ స్నాక్ అంటే పిల్లల దగ్గర్నుంచి పెద్దల వరకు అందరూ ఫిదా అవ్వాల్సిందే. వీకెండ్ పార్టీకైనా, ఈవినింగ్ టీ టైమ్‌ కైనా లేదా ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడైనా వడ్డించడానికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. నోరూరించే పనీర్ ఫింగర్స్‌ని ఎలా చేయాలో ఇక్కడ చూడండి.

Crispy on the Outside Soft Inside Quick Easy Evening Snack Paneer Fingers Recipe in Telugu

పనీర్ ఫింగర్స్ తయారీకి కావలసిన పదార్థాలు

మ్యారినేషన్ కోసం
పనీర్ - 250 గ్రాములు
కారం - అర టీస్పూన్
పసుపు - పావు టీస్పూన్
గరం మసాలా - అర టీస్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
నిమ్మరసం - 1 టేబుల్ స్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
కోటింగ్ కోసం
మైదా - 2 టేబుల్ స్పూన్లు
కార్న్‌ఫ్లోర్ - 2 టేబుల్ స్పూన్లు
మిరియాల పొడి - అర టీస్పూన్
బ్రెడ్ క్రంబ్స్ - 1 కప్పు
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా

నానమ్మల కాలం నాటి నల్చిన కారం..చికెన్, మటన్ కూడా పోటికి రావు..రోలు, మిక్సీ కూడా అక్కర్లేదు చేత్తోనే..

పనీర్ ఫింగర్స్ తయారీ విధానం

-ముందుగా పనీర్‌ ను పొడవాటి వేళ్ల ఆకారంలో (ఫింగర్స్ లాగా) సమానంగా కట్ చేసుకోండి.

-ఒక బౌల్ తీసుకుని అందులో పనీర్ ముక్కలు, కారం, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, నిమ్మరసం వేసి ముక్కలకు బాగా పట్టేలా మెల్లగా కలపండి. పనీర్ విరగకుండా చూసుకోండి. కలిపాక దీన్ని ఓ 15 నిమిషాల పాటు పక్కన పెట్టండి.

-ఇప్పుడు మరో గిన్నెలో మైదా, కార్న్‌ఫ్లోర్, చిటికెడు పసుపు, మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసి, తగినన్ని నీళ్లు పోసి మరీ పల్చగా కాకుండా కలుపుకోండి. తర్వాత కలిపి పక్కనుంచుకున్న పనీర్ ముక్కల్ని ఒక్కొక్కటిగా తీసుకుని, ముందుగా పిండి మిశ్రమంలో ముంచి, ఆ తర్వాత బ్రెడ్ క్రంబ్స్‌(బ్రెడ్ ముక్కలన్నీ పొడిగా చేసినది) లో వేసి అన్ని వైపులా అంటేలా దొర్లించండి. పనీర్ ముక్కలన్నింటికీ ఇలాగే చేసి పక్కన పెట్టుకోండి.

-ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి, డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడి చేయండి. నూనె వేడెక్కాక పనీర్ ముక్కలను వేసి, మీడియం మంట మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా కరకరలాడేదాకా వేయించండి.

-వేయించిన పనీర్ ఫింగర్స్‌ను టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్‌ లోకి తీసుకుంటే అదనపు నూనెను పీల్చుకుంటుంది.

-అంతే ఎంతో రుచికరమైన, వేడి వేడి పనీర్ ఫింగర్స్ రెడీ. అయితే డైట్ చేసేవాళ్లు, నూనెలో వేయించడం ఇష్టం లేని వారు, హెల్తీగా తినాలనుకుంటే వీటిని ఎయిర్ ఫ్రైయర్ లో కూడా ఈజీగా చేసుకోవచ్చు.

-టమాటో కెచప్ లేదా పుదీనా చట్నీతో వీటిని లాగించేస్తే ఆ మజాయే వేరు.

[ of 5 - Users]
Story first published: Monday, October 5, 2026, 16:34 [IST]
Desktop Bottom Promotion