మెంతులు ఆరోగ్యానికి మంచిదే కాదు... ఈ వ్యాధులు ఉన్నవారికి ముప్పూ తేవచ్చు!

మెంతులను వంటల్లో ఉపయోగించడం మాత్రమే కాదు.. చర్మ సంరక్షణలోనూ దోహదపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్‌, ఐరన్‌, మెగ్నీషియం, మాంగనీస్‌ వంటి పోషకాలు మెరుగైన జీర్ణక్రియతో పాటు షుగర్‌ లెవెల్స్‌ను కంట్రోల్‌ చేస్తుంది. బరువును అదుపులో ఉంచుతుంది. వీటిని రాత్రంతా నానబెట్టి తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే కొందరు మాత్రం మెంతులను తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. మరి ఎవరెవరు వీటిని తీసుకోవద్దు.. తెలుసుకుందాం..

Fenugreek offers health benefits but it can be dangerous for these people

కూరలు, పులుసుల్లో మెంతులను మసాలాగా తరచూ ఉపయోగిస్తారు. అయితే వీటిని నానబెట్టి తీసుకోవడం, పొడి చేసుకుని తినడం, సప్లిమెంట్స్‌లా వాడటం.. ఇలా ఒక్కో రకంగా తీసుకుంటే ఒక్కో ఫలితం ఉంటుంది. ఈ క్రమంలో కొన్ని రకాల మందులు తీసుకునేవారు వాటితో కలిపి మందులు తీసుకుంటే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. దుష్పరిణామాలు ఎదుర్కోవచ్చు.

రక్తం పలుచబడే ప్రక్రియపై ప్రభావం

రక్తం పలుచబడటానికి మందులు వాడుతున్న వారు మెంతులు తీసుకునే ముందు సంబంధిత డాక్టర్‌ సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. మెడిసిన్స్‌తో కలిపి వీటిని తీసుకోవడం ద్వారా రక్తస్రావం లాంటి సమస్యలు ఎదురుకావచ్చు.

జీర్ణ సమస్యలు

జీర్ణక్రియ సమస్యలు ఉన్నవారు, జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు మెంతులు అధిక మెతాదులో తీసుకుంటే ప్రమాదం తలెత్తవచ్చు. గ్యాస్‌, కడుపు ఉబ్బరం, అసౌకర్యం వంటి సమస్యల బారిన పడే ప్రమాదం ఉంది.

Fenugreek offers health benefits but it can be dangerous for these people

డయాబెటిస్‌ బాధితులు

డయాబెటిస్‌ బాధితులు రక్తంలో షుగర్‌ లెవెల్స్‌ను కంట్రోల్‌ చేసుకునేందుకు తరచుగా ఇన్సులిన్‌ తీసుకోవడంతో పాటు మందులు వాడుతుంటారు. అయితే చక్కెర స్థాయిలపై మెంతులు ప్రభావం చూపించవచ్చు. ఎక్కువగా తీసుకుంటే లెవెల్స్‌ మరింతగా పడిపోవచ్చు. డాక్టర్‌ సలహాతోనే మెంతులను పరిమిత మోతాదులో తీసుకోవాలి.

గర్భిణీలు

ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు మెంతులను అధిక మొత్తంలో తీసుకోవడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. వైద్యుల సలహా లేకుండా సప్లిమెంట్స్‌ రూపంలో తీసుకున్నా, ఎక్కువగా తీసుకున్నా గర్భాశయంపై ప్రభావం చూపే అవకాసం ఉందని హెచ్చరిస్తున్నారు.

థైరాయిడ్‌ మెడిసిన్స్‌

మెంతుల్లో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. ఈ క్రమంలో మెంతులు థైరాయిడ్‌ మందుల శోషణపై ప్రభావం చూపించచ్చు. థైరాయిడ్‌ ఉన్నవారు మందులు వాడుతున్నట్లయితే వీటి వాడకం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మెంతులకు, ఈ మందులకి మధ్య రెండు గంటలపైన వ్యవధి ఉండేలా చూసుకోవడం మంచిది.

సర్జరీ ఉన్నవారు

వివిధ ఆరోగ్య సమస్యల దృష్ట్యా సర్జరీ చేయించుకునేవారు మెంతుల వాడకం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మెంతులు లేదా సప్లిమెంట్స్‌ తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి. రక్తం గడ్డకట్టే ప్రక్రియపై ప్రభావం చూపడమే కాకుండా రక్త స్రావం అయ్యే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు.

మెంతులు ప్రకృతి అందించిన గొప్ప వరం అయినా అధికంగా తీసుకునే ముందు నిపుణుల సలహా తప్పనిసరి. ముఖ్యంగా వివిధ రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు డైట్‌లో చేర్చుకునే ముందు జాగ్రత్త వహించాలి. పరిమితికి మించి తీసుకుంటే ఇబ్బందులు తప్పవు.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Monday, October 5, 2026, 12:41 [IST]
Desktop Bottom Promotion