నానమ్మల కాలం నాటి నల్చిన కారం..చికెన్, మటన్ కూడా పోటికి రావు..రోలు, మిక్సీ కూడా అక్కర్లేదు చేత్తోనే..

Posted By:

తెలుగు వారి వంటకాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది ఘాటైన రుచులు, కారం, మసాలాలు. పూర్వకాలం నుండి మన అమ్మమ్మలు, నానమ్మలు రోట్లో వేసి దంచి చేసే పొడులు, పచ్చళ్ల రుచే వేరు. అలాంటి ఒక అద్భుతమైన సాంప్రదాయ వంటకమే ఈ నల్చిన కారం. దీని స్పెషాలిటీ ఏంటంటే దీనిని రోట్లో దంచాల్సిన పని కూడా ఉండదు. కేవలం మన చేతులతోనే దీన్ని రెడీ చేసుకోవచ్చు.

వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని ఈ నల్చిన కారం కలుపుకుని తింటే ఆ రుచి అమృతంతో సమానం. నల్చిన కారం కేవలం రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇందులో వాడే ప్రతిదీ ఒక ఔషధంతో సమానం. శరీరానికి కావలసి పోషకాలు, రుచి అన్నీ ఒకేసారి అందించే ఈ నల్చిన కారాన్ని మీ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

Authentic Nalchina Karam Recipe Traditional Telugu Hand Mashed Chutney

నల్చిన కారం తయారీకి కావాల్సిన పదార్థాలు

-ఎండుమిర్చి
-కరివేపాకు
-కొత్తిమీర
-వెల్లుల్లి
-నూనె
-ఉల్లిపాయ
-టమాటో
-ఉప్పు

ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండే ఉలవల కారం పొడి..ఒక్కసారి చేస్తే నెల రోజులు నిల్వ..ఇడ్లీ, వేడి అన్నంలోకి బెస్ట్

నల్చిన కారం తయారీ విధానం

-ముందుగా 5 మీడియం సైజు టమాటోలు తీసుకోండి. వాటిని శుభ్రంగా కడగండి. తర్వాత ఒక్కో టమాటోను రెండు ముక్కలుగా కట్ చేసుకోండి.

తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసి అందులో 1 మీడియం సైజు వెల్లుల్లి గడ్డ రెబ్బలను తొక్క తీసేసి నూనెలో వేసి లైట్ గా కలర్ మారే దాకా వేయించాలి. తర్వాత ఇందులోనే 12 ఎండుమిరపకాయలు వేసి కలర్ మారి, చేత్తో పట్టుకుంటే కరకరమనేలా అయ్యేదాకా వేయించుకోవాలి.

-తర్వాత ఎండుమిర్చి, వేగిన వెల్లుల్లిని ఒక ప్లేట్ లోకి తీసుకోండి.

-ఇప్పుడు స్టవ్ మీద బాండీలో మిగిలి ఉన్న నూనెలోనే కరివేపాకు, సన్నగా, పొడవుగా కట్ చేసుకునన్న 3 ఉల్లిపాయల చీలికలను వేసి అవి మెత్తబడి, గొల్టెన్ కలర్ లోకి మారిన తర్వాత వాటిని కూడా ప్లేట్ లోకి తీసుకోండి.

-తర్వాత బాండీలో మరికొంచెం నూనె వేసి అందులో కట్ చేసుకున్న టమాటో ముక్కలన్నీ వేసి పైన తొక్కు చేత్తో పట్టుకుంటే ఊడి వచ్చేలా అయ్యే వరకు సుమారు 5 నిమిషాలు ఉడికించాలి. తర్వాత వీటిని ప్లేట్ లోకి తీసుకోండి. టమాటోల పైన తొక్క తీసేయండి.

-ఇప్పుడు ముందుగా వేయించిన ఎండుమిర్చి,వెల్లుల్లిని చేత్తో బాగా నలుపుకోండి. తర్వాత ఇందులోనే 1 టీస్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోండి. తర్వాత ఈ మిశ్రమంలోనే వేయించిన ఉల్లిపాయలు, కరివేపాకు వేసి చేత్తోనే బాగా కలుపుకోండి. చివరగా ఇందులో వేయించి తొక్క తీసేసిన టామాటోలు వేసి చిదిమినట్లుగా బాగా కలుపుకోండి.

-మెత్తం అన్నీ కలిసేలా బాగా కలుపుకున్నాక చివరగా అందులో కొంచెం ఎక్కువగానే కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోండి.

-అంతే సూపర్ టేస్టీ, హెల్తీ నల్చిన కారం రెడీ.

[ of 5 - Users]
Story first published: Monday, October 5, 2026, 12:22 [IST]
Desktop Bottom Promotion