Latest Updates
-
పైన క్రిస్పీగా.. లోపల సాఫ్ట్ గా.. సాయంత్రం పూట వేడివేడి పనీర్ ఫింగర్స్ చేసుకోండిలా.. -
వంశాభివృద్ధికి, పితృదేవతల ఆశీస్సులకు మహాలయ అమావాస్య.. తర్పణం, శుభ సమయం వివరాలివే.! -
రోజూ 10 నిమిషాలు సూర్యాస్తమయాన్ని చూస్తే ఏమవుతుందో తెలుసా? -
నాటు శైలిలో ఘాటుగా 'రొయ్య పొట్టు చారు'.. పల్లెటూరి రుచుల మజానే వేరు.! -
ఇన్ స్టాగ్రామ్ లో ఇష్టపడ్డారు..పెళ్లి చేసుకున్నారు..7 నెలలకే స్కూల్ టైతో భర్త గొంతు నులిమి.. -
మెంతులు ఆరోగ్యానికి మంచిదే కాదు... ఈ వ్యాధులు ఉన్నవారికి ముప్పూ తేవచ్చు! -
నానమ్మల కాలం నాటి నల్చిన కారం..చికెన్, మటన్ కూడా పోటికి రావు..రోలు, మిక్సీ కూడా అక్కర్లేదు చేత్తోనే.. -
బాబా వంగా అంచనా..అక్టోబర్ 5వ తేదీ నుంచి ఆ 5 రాశుల వారికి రాజయోగం పక్కా! -
తిండి ఆలస్యమైందని దండన.. జొమాటో డెలివరీ బాయ్‌పై దంపతుల దాడి.. వైరల్ వీడియో.! -
ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండే ఉలవల కారం పొడి..ఒక్కసారి చేస్తే నెల రోజులు నిల్వ..ఇడ్లీ, వేడి అన్నంలోకి బెస్ట్
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నిజంగా నేరమా.. మన భారతీయ చట్టాలు ఏం చెబుతున్నాయంటే.!
రోడ్లు, పబ్లిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అప్పుడపప్పుడూ ప్రేమ జంటలు బహిరంగంగా ముద్దు పెట్టుకోవడం చూస్తూనే ఉంటాం. బైక్ డ్రైవింగ్ చేస్తూ ప్రియురాలిని ఒడిలో కూర్చోపెట్టుకుని గాఢంగా కిస్ చేసుకోవడం లాంటి వీడియోలు తరచూ వైరల్ అవుతూనే ఉంటాయి. ఇలాంటి ఘటనలు చుట్టూ ఉన్న జనాన్ని కొంచెం ఇబ్బందికి గురిచేస్తుంటాయి. అయితే ఇలా పబ్లిక్‌గా ముద్దు పెట్టుకుంటే మన దేశంలో నేరమా, కాదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. వీటిపై చట్టాలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయి.. ఏం చెబుతున్నాయి.. తెలుసుకుందాం..

నిజంగా నేరమా
పబ్లిక్ ప్రాంతాల్లో ప్రేమికులు ముద్దు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం, చేతులు పట్టుకుని, ఎత్తుకుని నడవడం వంటివాటిని నిరసిస్తూ మన దేశంలో ప్రత్యేకంగా చట్టమంటూ ఏం లేదు. అయితే బహిరంగ ప్రదేశాల్లో జంటలు ఇలాంటి పనులకు పాల్పడితే పోలీసులు తప్పనిసరిగా చర్యలు తీసుకుంటారు. అందులో ఎలాంటి సందేహం లేదు.
చట్టం ఏం చెబుతోంది…
భారతీయ న్యాయ సంహిత(IPC) చట్టం 294 ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో ఇతరులకు ఇబ్బంది కలిగించేలా జంటలు ప్రవర్తిస్తే అది శిక్షార్హమైన నేరం. నాలుగు గోడల మధ్య ఏకాంతంగా జంటలు అనుభూతి చెందాల్సిన పనులను బహిరంగంగా చేయడం మన దేశంలో ఇతరులకు ఇబ్బందికరంగా ఉంటుంది.

అయితే ఇలాంటి ఘటనలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయరు. కానీ రోడ్లపై ఇతర ప్రయాణికులకు అడ్డం కలిగిస్తూ ఇలాంటి పనులకు పాల్పడటం, పబ్లిక్ ప్రాంతాల్లో చేయకూడని పనులు చేయడం ద్వారా పోలీసులు వారిని అరెస్ట్ చేయవచ్చు. కాగా, ఇది బెయిలబుల్ అఫెన్స్. పూచీకత్తుతో వారు బయటకు రావచ్చు. మైనర్లు ఇలాంటి పనులకు పాల్పడితే వారి తల్లిదండ్రుల సమక్షంలో మందలింపు చర్యలు పాల్పడతారు. పద్దినిమిదేళ్లు దాటితే వ్యక్తిగతంగా మందలిస్తారు. కానీ బెయిల్‌పై బయటకు రావాలంటే కొంత మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
కాగా, రోడ్డుపై బైక్ లేదా కార్లు నడుపుతూ విన్యాసాలు ప్రదర్శించాలని భావించే కొందరు యువకులు.. ప్రియురాళ్లతో బహిరంగంగా ముద్దులు పెడుతూ ప్రమాదకరంగా డ్రైవింగ్‌కు పాల్పడటం చూస్తూనే ఉంటాం. ఈ క్రమంలో ఇలాంటి చర్యలకు పాల్పడటం ద్వారా రోడ్డుపై ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇతర ప్రయాణికులు, వాహనదారులకు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రజల ప్రాణాలు, సౌకర్యం, రోడ్డు భద్రతను దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని పోలీసులు సైతం సూచిస్తుంటారు.



Click it and Unblock the Notifications
