రోజూ 10 నిమిషాలు సూర్యాస్తమయాన్ని చూస్తే ఏమవుతుందో తెలుసా?

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో అందరూ బిజీ లైఫ్ అయిపోయారు. సోషల్ మీడియా వాడకంలో కొందరు బిజీగా, మరికొందరు ఆఫీసు టార్గెట్లు, డెడ్ లైన్స్ తో, మరికొందరు తమ ఎదుగుదల గురించిన ఆలోచన మానేసి ఇతరుల గురించి డిస్కషన్ చేస్తూ బిజి బిజీ లైఫ్ గడుపుతున్నారు. ఈ క్రమంలో చాలామంది ఒత్తిడికి లోనవుతూ అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.

అయితే మీరు కూడా ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తడికి గురవుతున్నారా? ఏసీ గదుల్లో, కంప్యూటర్ స్క్రీన్ల ముందు మీ పగటి పూటను హరించేస్తూ.. ప్రకృతికి దూరంగా బతుకుతున్నారా? ఆకాశం ఎర్రబడటం, సూర్యుడు మెల్లగా పడమటి కొండల వెనుక అస్తమించడం చివరిసారిగా ఎప్పుడు చూశారో కూడా మీకు గుర్తులేదా? అయితే మీ పని ఒత్తిడిని కాసేపు పక్కనపెట్టి, మళ్లీ ఆ ప్రకృతి అందాలను ఆస్వాదించండి.

Feeling Stressed How Watching the Sunset for 10 Minutes Can Improve Your Mental Health

దీనికోసం ఎక్కడికో సుదూర ప్రాంతాలకు ప్రయాణించాల్సిన పనిలేదు. ఆఫీసులో ఉంటే కాస్త బయటకు వచ్చి ,వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఒక్క పది నిమిషాలు మేడ మీదకు లేదా బాల్కనీలోకి వెళ్లండి. మొబైల్ కెమెరా లెన్స్‌ తో ఫోటోలు తీయాలనే ఆరాటాన్ని పక్కనపెట్టి, మీ సొంత కళ్లతో ఆ ఆకాశాన్ని చూడండి. ఈ చిన్న పని మీ మానసిక స్థితిలో అద్భుతాలు సృష్టిస్తుందని మనస్తత్వవేత్తలు చెబుతున్నారు.

ప్రముఖ అమెరికన్ సైకాలజిస్ట్, రచయిత్రి మాలినీ సబా మాటల్లో చెప్పాలంటే.. అనవసరమైన ఆలోచనల సుడిగుండం నుంచి బయటపడటానికి ఇదొక అద్భుతమైన మార్గం. సూర్యాస్తమయ సమయంలో ఆకాశంలో మారే రంగుల విన్యాసం మనసుపై ఇంద్రజాలం చేస్తుంది. చల్లని గాలి, అనంతమైన ఆకాశం ముందు మన రోజువారీ కష్టాలు, ఆందోళనలు, తీరని కోరికల లెక్కలు చాలా చిన్నవిగా అనిపిస్తాయి.

నానమ్మల కాలం నాటి నల్చిన కారం..చికెన్, మటన్ కూడా పోటికి రావు..రోలు, మిక్సీ కూడా అక్కర్లేదు చేత్తోనే..నానమ్మల కాలం నాటి నల్చిన కారం..చికెన్, మటన్ కూడా పోటికి రావు..రోలు, మిక్సీ కూడా అక్కర్లేదు చేత్తోనే..

మానసిక వైద్య నిపుణులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. సూర్యాస్తమయాన్ని ఆస్వాదించడానికి మన ఇంట్లో తెరిచి ఉన్న కిటికీలు, బాల్కనీలు, ఇంటి పైకప్పుల నుంచి చూసినా చాలని.. ప్రకృతిలో రంగులు మారే ఈ అద్భుత దృశ్యం.. మనలోని ఆందోళనలను తాత్కాలికంగా మాయం చేసి, మనసును తేలికపరుస్తుందని చెబుతున్నారు.

ఈ 10 నిమిషాల విరామం మీకు ఏమిస్తుంది?

ఒత్తిడికి చెక్: ఆకాశం బంగారు, ఎరుపు రంగులతో నిండిపోతున్నప్పుడు, ఆ అందం మన ఆఫీసు గడువులను, సంబంధాలలోని ఒత్తిళ్లను క్షణాల్లో మరచిపోయేలా చేస్తుంది. ప్రకృతికి ఉన్న స్వస్థత చేకూర్చే గుణం, మనసును నయం చేస్తుంది.

శారీరక, మానసిక ప్రశాంతత: మనస్సు ప్రశాంతంగా మారినప్పుడు, హార్ట్ బీట్ రేటు నెమ్మదిస్తుంది. క్రమం తప్పకుండా సూర్యాస్తమయాన్ని చూడటం వల్ల దీర్ఘకాలిక ఒత్తిడి తగ్గి, దేహానికి, మనసుకు సంపూర్ణ విశ్రాంతి లభిస్తుంది.

శరీరానికి స్పష్టమైన సంకేతం: ప్రకృతికి, మన శరీరానికి మధ్య విడదీయరాని బంధం ఉంది. అస్తమిస్తున్న సూర్యుడు ఇక పని చాలించి విశ్రాంతి తీసుకో అని మన శరీరానికి ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇస్తాడు. రాత్రి చీకటి పడేకొద్దీ దేహం ప్రశాంతమైన నిద్రకు సిద్ధమవుతుంది.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Monday, October 5, 2026, 15:21 [IST]
Desktop Bottom Promotion