Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
వింటర్ స్పెషల్..ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకునే హెల్తీ మసాలా కిచిడి..ఎలా చేసుకోవాలంటే..
శీతాకాలం వచ్చిందంటే చాలు మన ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం చాలా అవసరం. బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, మన బాడీ టెంపరేటచ్ బ్యాలెన్స్ గా ఉంచడానికి,రోగనిరోధక శక్తిని పెంచడానికి వేడిని పుట్టించే ఆహారాలు తీసుకోవాలి. అలాంటి ఆహారాలలో సజ్జలు ప్రధానమైనవి.
పూర్వీకుల కాలం నుండి సజ్జలను శక్తినిచ్చే ధాన్యంగా పిలుస్తారు. బియ్యం అస్సలు వాడకుండా, కేవలం సజ్జలు, పప్పు, కూరగాయలతో ఎంతో రుచికరమైన, పోషకాలతో నిండిన మసాలా కిచిడిని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
-సజ్జలు
-పెసరపప్పు
-జీడిపప్పు
-నెయ్యి
-జీలకర్ర
-ఆవాలు
-ఇంగువ
-పచ్చిమిర్చి
-ఉల్లిపాయ
-కరివేపాకు
-అల్లంవెల్లుల్లి పేస్ట్
-టమోటా
-క్యారెట్
-బఠానీలు
-ఆలుగడ్డ
-పసుపు
-కారం
-ధనియాల పొడి
-గరం మసాలా
-ఉప్పు
-కొత్తిమీర
తయారీ విధానం
-ముందుగా అరకప్పు సజ్జలను కనీసం 8 గంటల పాటు నీటిలో నానబెట్టాలి.
-తర్వాత నీళ్లు వంపేసి నానిన సజ్జలను మిక్సీ గిన్నెలో వేసి మధ్య మధ్యలో ఆపుకుంటూ కొంచెం రవ్వ రవ్వగా ఉండేలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నీళ్లు అస్సలు పోయవద్దు.
-తర్వాత ఒక గిన్నెలో అరకప్పు పెసరపప్పు వేసి నీళ్లు పోసి శుభ్రంగా కడిగాక నీళ్లు పోసి పక్కన పెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద అడుగు మందంగా ఉండే గిన్నె లేదా కుక్కర్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడయ్యాక ఇందులో అర టీస్పూన్ జీలకర్ర, 1 బిర్యానీ ఆకు వేసి వేయించుకోవాలి.
-జీలకర్ర వేగిన తర్వాత అందులోనే 2 రెమ్మల కరివేపాకు, చిటికెడు ఇంగువ, 1 ఉల్లిపాయను మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి వెయ్యండి.
-ఉల్లిపాయలు లైట్ గా వేగిన తర్వాత అందులో 1 టస్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా కలుపుకున్నాక ఇందులో 1 క్యారెట్ చిన్న ముక్కలు,1 బంగాళదుంప చిన్న ముక్కలు, కొన్ని పచ్చి బఠాణీలు, 1 టమాటో మీడియం సైజ్ ముక్కలు, 2 పచ్చిమిరపకాయల సన్నని ముక్కలు వేసి మెత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. కూరగాయల ముక్కలన్నీ 1 కప్పు అంత ఉండాలి.
-ఇప్పుడు అందులో అర టీస్సూన్ ధనియాల పొడి, పావు టీస్పూన్ గరం మసాలా, రుచికి తగినంత ఉప్పు, సరిపడా కారం, చిటికెడు పసుపు వేసి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి.
-ఇప్పుడు అందులో గ్రైండ్ చేసుకున్న సజ్జల పిండి, నానబెట్టుకున్న పెసరపప్పు వేసి కలిపాక ఇందులోనే 3 కప్పుల నీళ్లు పోసి కలిపి మూతపెట్టి మూతపెట్టేసి మీడియం మంట మీద మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకించుకోవాలి.
-మిశ్రమం దగ్గర పడినప్పుడు మూతపెట్టేసి తక్కువ మంట మీద 2 నిమిషాలు ఉడికించాలి.
-చివరగా కొత్తిమీర తరుగు అందులో చల్లుకొని కలిపాక 1 స్పూన్ నెయ్యిలో వేయించిన కొన్ని జడిపప్పలను నెయ్యితో సహా ఇందులో వేసి కలిపి స్టవ్ ఆపేయాలి. అంతే హెల్దీ మసాలా కిచిడి రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications