కర్ణాటక స్పెషల్ వాంగి బాత్ పొడి..ఒక్కసారి చేస్తే 4 నెలలు నిల్వ..బోర్ కొట్టించే కూరలు కూడా అమృతమైపోతాయ్..

Posted By:

రెగ్యులర్ గా అవే కూరలు తిని బోర్ కొట్టేసిందా? రెగ్యులర్ కూరలను కూడా అద్భుతంగా మార్చే శక్తి ఉన్నదే కర్ణాటక స్పెషల్ వాంగి బాత్ పొడి. ఈ పొడినే వాంగి బాత్ లో వాడతారు. నిమ్మకాయ పులిహోరలో ఆఖరును ఈ పొడి కొంచెం వేసి కలిపారంటే సూపర్ గా టేస్ట్ ఉంటుంది. చాలా ప్రత్యేకమైన రుచి వస్తుంది.

ఇదే కాకుండా, ఏ వేపుళ్లు,ఇగుర్లు చేసినా చివర్లో ఈ పొడి కొంచెం వేసి చూడండి ప్రత్యకమైన టేస్ట్ ఆ వంటలకు వచ్చేస్తుంది. కర్ణాటక స్పెషల్ వాంగి బాత్ పొడిని మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Step by Step Guide to Make Authentic Karnataka Vangi Bath Podi at Home in Telugu

వాంగి బాత్ పొడి తయారీకి కావాల్సిన పదార్థాలు

-మినపప్పు
-పచ్చి శెనగపప్పు
-ధనియాలు
-యాలకలు
-దాల్చిన చెక్క
-మరాఠీ మొగ్గ
-లవంగాలు
-గసగసాలు
-ఎండుకొబ్బరి తురుము
-గుంటూరు ఎండుమిర్చి
-బ్యాడిగ మిర్చి
-పసుపు
-ఇంగువ

కృష్ణాష్టమి స్పెషల్..కన్నయ్యకు అత్యంత ఇష్టమైన ధనియాల పంజిరి ఎలా చేసుకోవాలంటే..

వాంగి బాత్ పొడి తయారీ విధానం

-ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్లు(25 గ్రా)మినపప్పు, 2 టేబుల్ స్పూన్లు పచ్చి శెనగపప్పు వేసి సన్నని సెగ మీద కలుపుతూ మంచి వాసన వచ్చేదాకా వేయించాక అందులోనే 25 గ్రాముల ధనియాలు వేసి మంచి సువాసన వచ్చేదాకా వేయించి స్టవ్ ఆపేయండి.

-ఇప్పుడు వేయించినవన్నీ ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లారనివ్వండి.

-ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అదే కడాయిలో 4 యాలకలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 15 లవంగాలు, 2 అంగుళాల మరాఠీ మొగ్గ వేసి మంచి వాసన వచ్చేదాకా వేయించాలి. తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్(10 గ్రా) గసగసాలు వేసి చిట్లనిచ్చేదాకా వేయించి వీటిని కూడా ముందుగా ధనియాలు మినపప్పు ఉన్న ప్లేట్ లోకి తీసుకోండి.

-ఇప్పుడు స్టవ్ మీద ఉన్న అదే కడాయిలో అరకప్పు ఎండుకొబ్బరి తురుము వేసి సన్నని సెగ మీద కలుపుతూ వేపుకోవాలి. మంచి వాసన రాగానే దీనిని కూడా ప్లేట్ లోకి తీసుకోండి.

-ఇప్పుడు స్టవ్ మీద ఉన్న అదే కడాయిలో 8 గుంటూరు మిర్చి వేసి కాస్త రంగు మారి పొంగేదాకా వేయించాక తీసి పక్కన పెట్టుకోండి.

-ఇప్పుడు అదే కడాయిలో 75 గ్రాములు తొడిమలు తీసేసిన బ్యాడిగ మిర్చి వేసి తక్కువ మంట మీద కరకరలాడేట్లుగా వేయించాక వీటిని కూడా ప్లేట్ లోకి తీసుకొని చల్లారనివ్వాలి.

-ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకోండి, అందులో ముందుగా వేయించి చల్లార్చిన పప్పులు, ఎండుకొబ్బరి తురుము,అర టీస్పూన్ పసుపు, చిటికెడు ఇంగువ కూడా వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పొడిలోనే చల్లారిన గుంటూరు మిర్చి, బ్యాడిగ మిర్చి వేసి మరోసారి గ్రైండ్ చేసుకోండి. మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకున్న ఈ మొత్తాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లారనివ్వాలి.

-తర్వాత గాలి చొరబడని డబ్బాలో దీన్ని పెట్టుకుంటే 4 నెలల పాటు నిల్వ ఉంటుంది.

[ of 5 - Users]
Story first published: Tuesday, September 1, 2026, 8:04 [IST]
Desktop Bottom Promotion